ఎంతమంది అందగత్తెలున్నా చందమామ సొగసే వేరు.. భర్తతో కాజల్ రొమాంటిక్ బ్లాస్ట్, మైండ్ బ్లోయింగ్ పిక్స్ వైరల్
తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది.
తన కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు గ్రాఫ్ స్టడీగా మైంటైన్ చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళ భాషల్లో కాజల్ దాదాపుగా స్టార్ హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. టాలీవుడ్ లో ఎక్కువ విజయాల శాతం ఉన్న హీరోయిన్ కూడా కాజలే.
కమర్షియల్ చిత్రాలతో కాజల్ తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకుంది. వివాహం తర్వాత కూడా కాజల్ అగర్వాల్ మంచి అవకాశాలతో రాణిస్తోంది. కాజల్ కెరీర్ మొత్తంలో ఆమె సక్సెస్ గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు. ఇది కాజల్ కు మాత్రమే సాధ్యమైన ఘనత.
కాజల్ అగర్వాల్ 2020 అక్టోబర్ లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లుని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వివాహం తర్వాత ఈ జంట వెకేషన్స్ కి వెళుతూ మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.
గత ఏడాది కాజల్, కిచ్లు దంపతులు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. కాజల్ ప్రస్తుతం తన ముద్దుల కొడుకుతో మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. తరచుగా భర్తతో, కొడుకుతో ఉన్న ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది.
గత ఏడాది ప్రెగ్నన్సీ కారణంగా సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన కాజల్.. ఈ ఏడాది తిరిగి యాక్టింగ్ తో బిజీ కానుంది. ప్రస్తుతం కాజల్ కమల్ హాసన్ సరసన ఇండియన్ 2లో నటిస్తోంది. వర్కౌట్స్ చేస్తూ మునుపటి ఫిజిక్ పొందే ప్రయత్నం చేస్తోంది.
తాజాగా కాజల్ తన భర్త కిచ్లు తో కలసి రొమాంటిక్ రొమాంటిక్ ఫోటో షూట్ చేసింది. గణేష్ ఉత్సవాల సందర్భంగా కాజల్ గోల్డ్ కలర్ శారీలో చూపు తిప్పుకోలేని సోయగాలతో ఊరిస్తోంది. ముఖ్యంగా కాజల్ నడుము సొగసుతో విరహం ఉట్టిపడుతున్నట్లు ఇస్తున్న ఫోజులు నెక్స్ట్ లెవల్ అంతే.
ఈ ఫోజుల్లో కాజల్ నిజంగానే చందమామలా వెలిగిపోతోంది. మైండ్ బ్లాక్ అయ్యే విధంగా ఆమె ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇద్దరూ రొమాంటిక్ గా ఈ ఫోటో షూట్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం కాజల్ బాలయ్య సరసన భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తోంది.