MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బుద్దుందేంట్రా లూజ్ వెధవ అంటూ కైకాలపై సీరియస్ అయిన ఎన్టీఆర్.. అంత తప్పు ఏం జరిగిందంటే

బుద్దుందేంట్రా లూజ్ వెధవ అంటూ కైకాలపై సీరియస్ అయిన ఎన్టీఆర్.. అంత తప్పు ఏం జరిగిందంటే

సూపర్ స్టార్ కృష్ణ మరణ విషాదం తీరక ముందే టాలీవుడ్ కి మరో షాక్ తగిలింది. లెజెండ్రీ నటుడు కైకాల సత్యనారాయణ(87) తుదిశ్వాస విడిచారు. కైకాల చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 23 2022, 09:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

సూపర్ స్టార్ కృష్ణ మరణ విషాదం తీరక ముందే టాలీవుడ్ కి మరో షాక్ తగిలింది. లెజెండ్రీ నటుడు కైకాల సత్యనారాయణ(87) తుదిశ్వాస విడిచారు. కైకాల చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. కొన్ని నెలల క్రితమే కైకాల పలు అవయవాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్ ఎదుర్కొన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ తెల్లవారు జామున 4 గంటలకు ఫిలిం నగర్ లోని తన నివాసంలో కైకాల మరణించారు. కైకాల మరణ వార్తతో సినీ ప్రముఖులు, అభిమానులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కైకాల సత్యనారాయణ 1935 కృష్ణా జిల్లా లోని కౌతారం గ్రామంలో జన్మించారు. 1959లో కైకాల 'సిపాయి కూతురు' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. 

37

ఆ తర్వాత కైకాల వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. విలన్ పాత్రలతో నట విశ్వరూపం ప్రదర్శించారు. యస్వీ రంగారావుకి ప్రత్యామ్నాయం అని ప్రశంసలు అందుకున్నారు.పౌరాణికం, జానపదం ఎలాంటి పాత్రల్లో అయిన జీవించేవారు కైకాల. ముఖ్యంగా టాలీవుడ్ వెండి తెరపై యముడు అంటే కైకాల మాత్రమే గుర్తు వచ్చేవారు. కైకాల, స్వర్గీయ ఎన్టీఆర్ మధ్య మంచి అనుబంధం ఉంది. 

47

1996లో కైకాల తెలుగుదేశం పార్టీ తరుపున మచిలీపట్నం ఎంపీగా కూడా బాధ్యతలు నిర్వహించారు.  తన ఎదుగుదలకి ఎన్టీఆర్ కారణం అని కైకాల ఎప్పుడూ గుర్తు  చేసుకుంటారు. ఎన్టీఆర్ తో వచ్చిన విభేదాలని కూడా కైకాల ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. కైకాల మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో నాకు రెండు సార్లు విభేదాలు వచ్చాయి. కొందరు చాడీలు చెప్పడం వల్లే ఇలా జరిగింది. ఆయనతో నాకు చాలా చనువు ఉంది. 

57

నన్ను పిలిచి ప్రశ్నించారు. అన్నయ్య.. నేను తప్పు చేసి ఉంటే నిరూపించండి అని చిన్న సవాల్ చేశా. తనపై చాడీలు చెప్పిన వారిని పిలిచి విచారించారు. దీనితో అసలు విషయం బయటపడి నా తప్పు లేదని తేలింది. వెంటనే ఆయన సారీ తమ్ముడు అని అన్నారు. ఆయన వైపు పొరపాటు ఉంటే వెంటనే క్షమించమని అడిగేస్తారు. చిన్నతనంగా భావించరు అని కైకాల అన్నారు. 

 

67

చిన్న చిన్న విషయాలు మినహా ఎన్టీఆర్ తో తనకు ఎలాంటి గొడవలు లేవని కైకాల అన్నారు. ఎందుకంటే నేను ఆయనతో గౌరవంగా అణుకువతో ఉండేవాడిని. ఆయన నా ఎదుగుదలకి కారణం అయిన వ్యక్తి. అలాగే తెలుగుదేశం పార్టీ స్థాపనలో  నేను కూడా ఒకడిని అని కైకాల అన్నారు. ప్రజల రుణం ఈ జన్మలోనే తీర్చుకోవాలి అనుకునేవారు ఎన్టీఆర్. అందుకే రాజకీయాల్లోకి వచ్చారు. నా సలహా తీసుకున్నారు. పార్టీ పెట్టాక ఎమ్మెల్యేగ పోటీ చేయాలని అడిగారు. 

77

కానీ నాకు మొదటిసారి కుదర్లేదు. నెక్స్ట్ టైం చేస్తాను అన్నయ్య అని చెప్పాను. కానీ ఆ తర్వాత అవుట్ డోర్ లో  ఉండడం వల్ల ఎలక్షన్ టైం కి రాలేకపోయాను. బుద్దుందేంట్రా లూజ్ వెధవ.. ఎందుకు మిస్ అయ్యావ్.. ఈ పాటికి మంత్రి అయి ఉండేవాడిని అని తిట్టారు. పోనిలే అన్నయ్య బ్యాడ్ లక్ అని చెప్పాను. తమ మధ్య అంతటి బంధం ఉండేది అని కైకాల గుర్తు చేసుకున్నారు. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Vijay: విజయ్‌ని వదలని త్రిష, స్పెషల్ బర్త్‌డే పోస్ట్.. అదిరిపోయే ఫోటోతో కౌంటర్‌
Recommended image2
Top 10 Heroines: సమంత ఈజ్‌ బ్యాక్‌, సాయిపల్లవి, శ్రీలీలకు షాక్‌.. రష్మిక, నయనతార, కాజల్ స్థానాలు ఇవే
Recommended image3
Raj Nidimoru: మా ఇద్దరి మధ్య భలే సింక్ కుదిరింది, సమంతపై రాజ్ నిడిమోరు ప్రశంసలు.. ఆమె సెల్ఫ్‌ మేడ్‌ యాక్టర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved