MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jana Nayagan Box Office: 5వ రోజు జన నాయగన్ కి ఊహించని కలెక్షన్లు.. విజయ్‌ మూవీకి ఎంత వచ్చాయంటే?

Jana Nayagan Box Office: 5వ రోజు జన నాయగన్ కి ఊహించని కలెక్షన్లు.. విజయ్‌ మూవీకి ఎంత వచ్చాయంటే?

Jana Nayagan Box Office: దళపతి విజయ్ హీరోగా, హెచ్. వినోద్ దర్శకత్వంలో వచ్చిన 'జన నాయగన్' సినిమా బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. 5వ రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయనేది చూస్తే,

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 28 2026, 11:33 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జన నాయకుడికి మిశ్రమ స్పందన
Image Credit : Instagram

జన నాయకుడికి మిశ్రమ స్పందన

దళపతి విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమా జూన్ 23న థియేటర్లలో రిలీజైంది. విజయ్, తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాక నటుడిగా ఇదే ఆయన చివరి సినిమా. అందుకే ఈ సినిమాను థియేటర్లలో పండగలా జరుపుకోవాలని అభిమానులు ఎదురుచూశారు. వాళ్లు ఊహించినట్టే సినిమాకు బ్రహ్మాండమైన రెస్పాన్స్ ని ఇచ్చారు. కానీ, ఒక సినిమాగా 'జన నాయగన్'కు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి. 'ఇది విజయ్ చివరి సినిమా కాబట్టి ఒకసారి చూడొచ్చు' అని సోషల్ మీడియాలో చాలామంది కామెంట్ చేస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
వీకెడ్‌లో దుమ్ములేపిన జన నాయగన్‌
Image Credit : Instagram

వీకెడ్‌లో దుమ్ములేపిన జన నాయగన్‌

మరికొందరు 'సినిమా మొత్తం దళపతి వన్ మ్యాన్ షో' అని అంటుంటే,   'పైసా వసూల్ సినిమా' అని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో, 'జన నాయగన్' కలెక్షన్లని వెల్లడించింది ప్రముఖ ట్రేడ్ వెబ్‌సైట్ సాక్‌నిల్క్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో రూ.217.48 కోట్లు వసూలు చేసినట్లు  పేర్కొంది. వీకెండ్‌లో కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ సినిమా, వీక్‌డేస్‌లో ఎలా పెర్ఫామ్ చేస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.

34
జన నాయగన్‌ 5 రోజుల కలెక్షన్లు
Image Credit : Asianet News

జన నాయగన్‌ 5 రోజుల కలెక్షన్లు

అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ, వీక్‌డేస్‌లో(సోమవారం) కూడా 'జన నాయగన్' వసూళ్లలో దుమ్మురేపింది. సోమవారం నాడు ఈ సినిమా ఇండియాలో మాత్రమే రూ.10.15 కోట్లు వసూలు చేసింది. దీంతో, 5 రోజుల్లో ఇండియాలో మొత్తం రూ.157.74 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్‌లో నిన్న ఒక్కరోజే రూ.4 కోట్లు రాబట్టింది. ఫలితంగా, 5 రోజుల్లో ఓవర్సీస్‌లో ఈ సినిమా వసూళ్లు రూ.75.50 కోట్లకు చేరాయి. ఇప్పటివరకు 'జన నాయగన్' ప్రపంచవ్యాప్తంగా రూ.233.24 కోట్లు వసూలు చేసింది.

44
ముగ్గురు దర్శకుల మెరుపులు
Image Credit : Asianet News

ముగ్గురు దర్శకుల మెరుపులు

ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికెట్ ఇచ్చింది. హెచ్. వినోద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'జన నాయగన్'లో బాబీ డియోల్, పూజా హెగ్డే, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, నరైన్, ప్రియమణి, మమితా బైజు వంటి పెద్ద తారాగణం నటించింది.  నిర్మాత వెంకట్ కె. నారాయణ, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించారు. దళపతి విజయ్‌కి ఇష్టమైన ముగ్గురు దర్శకులు లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్‌లను ముద్దుగా 'దళపతి బాయ్స్' అని పిలుస్తారు. ఈ ముగ్గురూ 'జన నాయగన్' క్లైమాక్స్‌లో గెస్ట్ రోల్స్‌లో కనిపించడం విశేషం.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
టీవీకే విజయ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Love and War: లవ్ అండ్ వార్ లో స్టైలిష్ గా రణ్‌బీర్ కపూర్, ఫస్ట్ లుక్ అదిరింది.. కానీ ట్విస్ట్
Recommended image2
George Krish: 12న వెంకటేష్, 13న చిరంజీవి.. అయినా తగ్గేదే లేదమ్మా, శర్వా ఫిక్స్ అయ్యాడు
Recommended image3
Movie Copied Scenes: బ్లాక్ బస్టర్ సినిమాల్లో అదిరిపోయే సీన్లు..మొత్తం కాపీ చేసినవే, ఎక్కడ నుంచి లేపేశారంటే
Related Stories
Recommended image1
Yash New House: బెంగళూరులో యశ్ ఇంద్రభవనం.. లోపల ఎలా ఉందో చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Recommended image2
Posani: చావుబతుకు పరిస్థితుల్లో పోసాని భార్య.. మహేష్‌, నమ్రత చేసిన హెల్ప్ ని తలుచుకొని ఎమోషనల్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved