Karthika Deepam: ప్రేమ్ కాలర్ పట్టుకున్న జ్వాల.. శౌర్య జాడ తెలుసుకున్న సౌందర్య!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో సాగుతూ.. ట్విస్ట్ ల మీద ట్వస్ట్ లతో ప్రసారమౌతు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఆనంద్ రావు (Anand rao) గారి హార్ట్ ఎటాక్ వస్తుంది. ఆ విషయాన్ని సత్య కి చెబుతారు. ఇక సత్య కారు లేక హడావిడి పడడంతో జ్వాలా (Jwala).. మిమ్మల్ని నేను తీసుకెళ్తాను అని ఆఫర్ చేస్తుంది.
ఇక ఆనంద్ రావు (Anand rao) హెల్త్ కండిషన్స్ చూసిన నిరూపమ్ ఎక్కువ ఆలోచిస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెబుతాడు. అంతేకాకుండా తాతయ్య ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందని సౌందర్య (Soundarya) కు చెబుతాడు.
ఆ తర్వాత బంధాలు బంధుత్వాలు గురించి ప్రస్తావన రాగా హిమ (Hima), సౌర్య ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుందనే నమ్మకం నాకుంది అని అంటుంది. కానీ ప్రేమ్ నాకు నమ్మకం లేదు అని అంటాడు. దాంతో సౌందర్య (Soundarya) ఏంట్రా అలా పుల్ల విరిగినట్టు మాట్లాడుతున్నావు అని అంటుంది.
ఆ తర్వాత ప్రేమ్ (Prem) ఎవరు లేకపోతే ఏమిటి ఈ ఫోటోగ్రాఫర్ మనవడు ఉన్నాడు మీకు అని ప్రేమ్ ఆనందరావు కి ధైర్యం చెబుతాడు. అంతేకాకుండా ఉదయాన్నే డైలీ జాగింగ్ తీసుకొని వెళ్తాను అని అంటాడు. దాంతో ఆనంద్ రావు (Anand Rao) ఎంతో ఆనందం వ్యక్తం చేస్తాడు.
సత్య (Sathya) జ్వాల లు ఆటోలో ఆసుపత్రికి వస్తారు. ఇక వీళ్ళను చూసిన ప్రేమ్ ఏంటి డాడీ చీప్ గా ఆటోలో వస్తావా అని అడుగుతాడు. దాంతో జ్వాల ప్రేమ్ కాలర్ పట్టుకుంటుంది. దాంతో ప్రేమ్ జ్వాలను గట్టిగానే నెట్టేస్తాడు. ఇక జ్వాలా (Jwala) నిరూపమ్ ఒడిలో పోయి పడుతుంది.
ఇక ప్రేమ్ (Prem), జ్వాల ల మధ్య ఫన్నీ గా కొంత సేపు క్లాస్ నడుస్తుంది. ఆ సమయంలో అక్కడికి హిమ వస్తుంది. ఇక హిమ ను చుసిన జ్వాలా తింగరి నువ్వు డాక్టర్ వా అడుగుతుంది. ఆ తర్వాత నిరూపమ్ అమ్మాయిలు ఇలాగే ఉండాలి రా అని జ్వాలా (Jwala) ను మెచ్చుకుంటాడు.
ఇక ఆ తర్వాత జ్వాల (Jwala) గుడి కి వచ్చి చనిపోయిన మా అమ్మా నాన్నల పేర్లు మీద అన్నదానం చేయించాలి అని పంతులుగారితో చెబుతుంది. ఈలోపు ఆ గుడికి సౌందర్య (Soundarya) కూడా వస్తుంది.
సౌందర్య (Soundarya).. చనిపోయిన మా కొడుకు కోడలు పేరుమీద అన్నదానం జరిపించాలి అని పంతులుగారి తో అంటుంది. పంతులుగారు.. ఇదే పేరుమీద ఒక అమ్మాయి అన్నదానం జరిపించాలి అని చెప్పింది అని చెబుతాడు. దాంతో సౌందర్య సౌర్య (Sourya) ను గుర్తిస్తుంది.