MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • నీ హెల్త్ బాలేదు ఇంటికెళ్లి రెస్ట్ తీసుకో, సుమన్‌ శెట్టి క్రేజీ నామినేషన్‌ .. 13 వారం నామినేషన్‌ లిస్ట్

నీ హెల్త్ బాలేదు ఇంటికెళ్లి రెస్ట్ తీసుకో, సుమన్‌ శెట్టి క్రేజీ నామినేషన్‌ .. 13 వారం నామినేషన్‌ లిస్ట్

బిగ్‌ బాస్‌ తెలుగు 9 13వ వారం నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా, కొంత హాట్‌గా, మరికొంత ఫన్నీగా సాగింది. అందులో భాగంగా సుమన్‌ శెట్టి, డీమాన్‌ పవన్‌ల నామినేషన్‌ చాలా క్రేజీగా ఉంది. 

3 Min read
Author : Aithagoni Raju
Published : Dec 01 2025, 11:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
క్రేజీగా 13 వారం నామినేషన్‌
Image Credit : youtube/@JioHotstarTelugu

క్రేజీగా 13 వారం నామినేషన్‌

బిగ్‌ బాస్‌ తెలుగు 9 13 వారం స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం హౌజ్‌లో 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఈ ఆదివారం దివ్య ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. అయితే డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందేమో అని అంతా భావించారు. కానీ సింగిల్‌ ఎలిమినేషన్‌తోనే సరిపెట్టారు. మరి 13వ వారం డబుల్ ఎలిమినేషన్‌కి వెళ్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సోమవారం నామినేషన్ల ప్రక్రియ క్రేజీగా సాగింది. అందులో భాగంగా సుమన్‌ శెట్టి నామినేషన్‌ అత్యంత క్రేజీగా మారింది. ఆయన నామినేషన్‌ చేసిన పాయింట్‌కి హౌజ్‌లో అంతా నవ్వాపుకోలేకపోయారు.

26
అక్కడో మాట ఇక్కడో మాట
Image Credit : youtube/@JioHotstarTelugu

అక్కడో మాట ఇక్కడో మాట

ఈ వారం నామినేషన్‌లో మొదట ఇమ్మాన్యుయెల్‌.. రీతూని నామినేట్‌ చేశాడు. తనని నమ్మానని కానీ ఆ నమ్మకాన్ని పోగొట్టావని ఆయన చెప్పగా, ఇక్కడో మాట, అక్కడో మాట చెబుతావని కౌంటర్‌ ఇచ్చింది. సపోర్ట్ చేయలేదని చెప్పింది. పది సార్లు సపోర్ట్ చేసినట్టుగా చెప్పాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం గట్టిగానే జరిగింది. ఆ తర్వాత డీమాన్‌ పవన్‌ని నామినేట్‌ చేశాడు ఇమ్మాన్యుయెల్‌. రెబల్‌ టాస్క్ లో తనని తీసేయడం పట్ల తాను బాధపడినట్టు తెలిపారు. భరణి.. సంజనాని నామినేట్‌ చేశాడు. ఫ్రాంక్ చేయడాన్ని తప్పుపట్టాడు. మెడిసిన్‌ తీసుకోవడం పట్ల ఆయన ఫైర్‌ అయ్యాడు. డీమాన్‌ పవన్‌ ని నామినేట్‌ చేస్తూ, గత పది రోజులుగా పవన్‌ కనిపించడం లేదని, నీ కోసం నువు గేమ్‌ ఆడాలని తెలిపారు. ఈ వారం నేను ఫస్ట్ టికెట్‌ టూ ఫినాలే కొట్టి చూపిస్తా అంటూ సవాల్‌ చేశాడు పవన్‌.

Related Articles

Related image1
సమంత ఈషా ఫౌండేషన్‌లోనే ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా? `భూత శుద్ధి వివాహం` స్పెషాలిటి ఇదే
Related image2
ఇమ్మాన్యుయెల్‌ హార్ట్ బ్రేక్‌ చేసిన తనూజ.. దెబ్బకి డీమాన్‌ పవన్‌కి ఫ్యూజుల్‌ ఔట్‌
36
సంజనాకి ఇచ్చిపడేసిన రీతూ
Image Credit : youtube/@JioHotstarTelugu

సంజనాకి ఇచ్చిపడేసిన రీతూ

రీతూ చౌదరీ.. సుమన్‌ శెట్టిని నామినేట్‌ చేస్తూ కెప్టెన్సీ టాస్క్ లో ఇంకా బాగా ఆడలేదని, లైట్‌ తీసుకుంటున్నట్టుగా అనిపించిందని తెలిపింది. సంజనాని నామినేట్‌ చేస్తూ, తనపై చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ బ్యాక్‌ స్టాంప్‌ వేశావని నామినేట్‌ చేసింది. దీంతో ఇద్దరు కాసేపు వాదించుకున్నారు. అనంతరం తనూజ.. మొదట ఇమ్మాన్యుయెల్‌తో వాదనకు దిగింది. తన కోసం స్టాండ్ తీసుకోలేదని, నువ్వు నా ఫ్రెండ్‌ అంటూ ఆమె కామెంట్‌ చేసింది. ఈ క్రమంలో ఇద్దరు ఎమోషనల్‌ అయ్యారు. తన పర్సనల్‌ విషయాలు షేర్‌ చేసిన ప్రతిసారి నామినేట్‌ చేస్తూ వచ్చాడని తెలిపింది. తనకు సపోర్ట్ గా లేవని, స్టాండ్‌ తీసుకోలేదని చెప్పగా, ప్రతి సారి తాను స్టాండ్‌ తీసుకున్నా, సపోర్ట్ చేశానని, పైగా నువ్వు ఫ్రెండ్‌ కాదంటే బాధపడినట్టు ఇమ్మాన్యుయెల్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

46
నవ్వులు పూయించిన సుమన్‌ శెట్టి నామినేషన్‌
Image Credit : youtube/@JioHotstarTelugu

నవ్వులు పూయించిన సుమన్‌ శెట్టి నామినేషన్‌

కానీ ఇందులో తనూజ ట్విస్ట్ ఇస్తూ, ఇమ్మాన్యుయెల్‌ని కాకుండా డీమాన్‌ పవన్‌ని నామినేట్‌ చేయడం గమనార్హం. దీనికి బిగ్‌ బాస్‌ కూడా ఫైర్‌‌ అయ్యాడు. డీమాన్‌ పవన్‌ ఫైర్‌ అయ్యాడు. నీ గేమ్‌ నువ్వు ఆడాలని, ఎవరి కోసమే గేమ్‌ ఆడటం కరెక్ట్ కాదని, టీమ్‌గా ఆడతానని, రీతూ కోసం ఆడటాన్ని ఆమె తప్పుపట్టింది. ఆ తర్వాత సంజనాని నామినేట్‌ చేసింది తనూజ. సుమన్‌ శెట్టి.. రీతూని నామినేట్‌ చేస్తూ, నామినేషన్‌ లేవు, ఈ సారి నామినేషన్‌లో ఉండు అని చెప్పాడు, అదే సమయంలో బాగా అరుస్తున్నావ్‌, తగ్గించుకో అని తెలిపాడు. దీనికి అంతా నవ్వారు. ఇంతలో మరో షాక్‌ ఇచ్చాడు సుమన్‌ శెట్టి. డీమాన్‌ పవన్‌ని నామినేట్‌ చేస్తూ నీ హెల్త్ బాగా లేదు, నువ్వు ఇప్పుడు ఇంటికెళ్లి రెస్ట్ తీసుకో, నీకు రెస్ట్ అవసరం అని నామినేట్‌ చేయడం గమనార్హం. దీంతో  హౌజ్‌ మేట్స్ నవ్వాపుకోలేదు.

56
డీమాన్‌ పవన్‌ కూడా నవ్వులపాలు
Image Credit : youtube/@JioHotstarTelugu

డీమాన్‌ పవన్‌ కూడా నవ్వులపాలు

మరోవైపు ఓవర్‌ కాన్ఫిడెన్స్ తగ్గించుకోవాలని, నువ్వే టికెట్‌ ఫినాలే కొడితే మిగిలిన వాళ్లు కొట్టారా? అంటూ పవన్‌ని నామినేట్‌ చేసింది సంజనా. అలాగే, సారీ చెప్పినా తనని నామినేట్‌ చేస్తున్నారని రీతూని నామినేట్‌ చేసింది సంజనా. ఇంకోవైపు డీమాన్‌ పవన్‌.. తనూజ, సంజనాలను నామినేట్‌ చేశాడు. అయితే అందరు నామినేషన్‌లో ఉంటే బెటర్‌ అని చెప్పిన ఇమ్మాన్యుయెల్‌ని నామినేట్‌ చేయగా, అంతా నవ్వుకున్నారు. దీంతో సంజనాని నామినేట్‌ చేశాడు పవన్‌. ఇది కూడా క్రేజీగా అనిపించింది. 

66
13 వారం నామినేషన్స్ లిస్ట్ ఇదే
Image Credit : youtube/@JioHotstarTelugu

13 వారం నామినేషన్స్ లిస్ట్ ఇదే

ఫైనల్‌గా కెప్టెన్‌ కళ్యాణ్‌ ఒక నామినేషన్‌ అధికారం ఇవ్వడంతో నామినేషన్‌లో లేని భరణిని నామినేట్‌ చేశాడు. దీంతో 13వ వారం సంజన, రీతూచౌదరీ, పవన్‌, సుమన్‌ శెట్టి, తనూజ, భరణి నామినేషన్‌లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్‌ అవుతారనేది చూడాలి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Krishnan: పెళ్లిపై త్రిష అదిరిపోయే రియాక్షన్‌.. ఎప్పుడు, ఎవరిని చేసుకుంటుందో చెప్పిన స్టార్‌ హీరోయిన్‌
Recommended image2
Virosh Sangeeth Party: తెల్లవారుజామున 4 గంటల వరకు సంగీత్‌ పార్టీ.. నవాబ్‌లను తలపించే లుక్‌.. విజయ్‌, రష్మిక ఎమోషనల్‌
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: మీనాని అవమానించిన చింటూ అమ్మమ్మ, రోహిణీ ప్లాన్ పసిగట్టిన బాలు
Related Stories
Recommended image1
సమంత ఈషా ఫౌండేషన్‌లోనే ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా? `భూత శుద్ధి వివాహం` స్పెషాలిటి ఇదే
Recommended image2
ఇమ్మాన్యుయెల్‌ హార్ట్ బ్రేక్‌ చేసిన తనూజ.. దెబ్బకి డీమాన్‌ పవన్‌కి ఫ్యూజుల్‌ ఔట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved