- Home
- Entertainment
- Karthika Deepam: శౌర్య కోసం బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేసిన హిమ.. జ్వాలనే శౌర్య అని తెలుసుకున్న హిమ!
Karthika Deepam: శౌర్య కోసం బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేసిన హిమ.. జ్వాలనే శౌర్య అని తెలుసుకున్న హిమ!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

క్యాంపు లో ఉన్న హిమ (Hima) సౌర్య ఆచూకి దొరికితే బాగుండు అని అనుకుంటుంది. సౌర్య దొరికే దాకా నేను నిరాశ పడను అంతేకాక నా ప్రయత్నాలు ఆపను అని హిమ నిరూపమ్ తో అంటుంది. మరోవైపు ప్రేమ్ హిమ ను ఫోటోలు తీసుకుంటూ సౌర్య (Sourya)కు దొరికిపోతాడు.
ఆ తరువాత హిమ (Hima) వాళ్లు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి సౌర్య, ప్రేమ్ లు బ్లడ్ ఇవ్వాలని ఫిక్స్ అవుతారు. ఈ క్రమంలో ఈ రెండు జంటలు కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటారు. సౌర్య (Sourya) ఈ బస్తీ లో నే మెడికల్ క్యాంపు పెట్టడానికి కారణం ఏమై ఉంటుంది అని ఆలోచిస్తుంది.
మరోవైపు హిమ (Hima) మెడికల్ క్యాంపు నీ గురించే ఏర్పాటు చేసాను సౌర్య (Sourya) అని ఆలోచిస్తుంది. ఆ తరువాత హిమ క్యాంపు కు వచ్చిన వాళ్ళని సౌర్య చిన్నప్పటి ఫోటో చూయించి తన ఆచూకీ అడుగుతుంది. కానీ ప్రతి ఒక్కరు తెలియదని చెబుతారు. ఇక ఒక వ్యక్తి మాత్రం నన్ను విసిగించ వద్దు వెళ్ళండి అని చిరాకు పడతాడు.
ఆ తరువాత నిరూపమ్ (Nirupam) సౌర్య చేతికి ఉన్న హెచ్ అక్షరం చూసి ఆది ఎవరి పేరు అని అడుగుతాడు. కానీ సౌర్య చెప్పకుండా ఆ అక్షరాన్ని హైడ్ చేసుకుంటుంది. ఇక ఇది విన్న హిమ జ్వాలా నే సౌర్య నా అని ఎంతో ఆనంద పడుతుంది. ఇక మరోవైపు సౌర్య హెచ్ అంటే నా శత్రువు అని చెబుతుంది. దాంతో హిమ (Hima) ఎంతో భాద పడుతుంది.
అంతే కాకుండా ఆటో మీద వదిలేదే లే.. అని తనకోసమే అలా రాయించాను అని చెబుతుంది. ఇక ఆ మాట విన్న చాటుగా ఉండి విన్న హిమ (Hima) బాధపడుతూ ఉంటుంది. ఇక సౌర్య (Sourya) నా జీవితాన్ని సెకండ్ లలో తారుమారు చేసిన ఆవిడను వదలను గాక వదలను అని అంటుంది. ఇక ఈలోపు అక్కడకు హిమ వస్తుంది. కాగా రేపటి భాగంలో ఎం జరుగుతుందో చూడాలి.