- Home
- Entertainment
- Karthika Deepam: జ్వాలకు ఆటోని గిఫ్ట్ గా ఇచ్చిన నిరుపమ్.. ప్రేమ్ ప్రశ్నతో ఉలిక్కిపడ్డ హిమ!
Karthika Deepam: జ్వాలకు ఆటోని గిఫ్ట్ గా ఇచ్చిన నిరుపమ్.. ప్రేమ్ ప్రశ్నతో ఉలిక్కిపడ్డ హిమ!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. పైగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

నిరూపమ్ (Nirupam) జ్వాల కోసం ఒక కొత్త ఆటోను తీసుకుని వస్తాడు. దాంతో జ్వాల ఎంతో ఆనంద పడుతుంది. ఇక చంద్రమ్మ.. సార్ మీరు దేవుడు సార్ అంటూ.. నిరూపమ్ ను పొగిడి పారేస్తుంది. ఈలోపు జ్వాల (Jwala) ఇచ్చే అంత గొప్ప మనసు మీకున్న ఫ్రీ గా తీసుకోవడానికి నేను రెడీ గా లేను అని అంటుంది.
అంతేకాకుండా ఆటోకి కావాల్సిన డబ్బు తిరిగి ఇస్తే తీసుకోవాలని అంటుంది. ఇక హిమ (Hima) ను ఈ ఆటో నువ్వు నడుపుకుంటూ రావాలా.. షోరూం వాళ్లకు చెప్తే వాళ్ళు తీసుకు వస్తారు కదా అని అంటుంది. దాంతో హిమ అది ప్రేమ జ్వాల (Jwala) అని అంటుంది.
ఆ మాటతో వీరిద్దరూ ఒకరి కొకరు ప్రేమగా హాగ్ చేసుకుంటారు. ఇక నిరూపమ్ (Nirupam) వాళ్లకు పెద్ద పార్టీ ఇస్తానని జ్వాలా ఒక రెస్టారెంట్ కు తీసుకొని వెళుతుంది. ఈలోపు అనుకోకుండా ఆ పార్టీలో ప్రేమ్ (Prem) వచ్చి జాయిన్ అవుతాడు.
ఇక హిమ (Hima) మనసులో చిన్నప్పుడు మనకు రెస్టారెంట్లో తినడం అంటే చాలా ఇష్టం ఉండేది అని అనుకుంటుంది. ప్రేమ్ ప్లేట్ లో ఉన్న చికెన్ పీస్ ను జ్వాల (Jwala) కొట్టేసి కాసేపు ఆట పట్టిస్తుంది. ఈ క్రమంలో ప్రేమ్ నీకు అక్క చెల్లి తమ్ముడు ఎవరూ లేరా అని జ్వాల ను అడుగుతాడు. దాంతో హిమ తెగ కంగారు పడిపోతుంది.
ఇక జ్వాల (Jwala) ఎవరూ లేరు అని చెబుతుంది. ఆ తరువాత ఎక్స్ ట్రా ఉల్లిపాయలు అని ప్రేమ్ ను జ్వాల కాసేపు ఆట పట్టిస్తుంది. ఇక ప్రేమ్ హిమ వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు. ఒక వైపు జ్వాలా నిరూపమ్ (Nirupam) వైపు ప్రేమగా చూస్తుంది.
ఇక రేపటి భాగంలో హిమ (Hima) గదిలో లైట్స్ ఫ్యాన్ లు అలాగే ఆన్ లో ఉంటాయి. అది గమనించిన సౌందర్య హిమ గదిలో కి వెళ్లి ఆఫ్ చేయబోతుంది. ఈ క్రమంలో అక్కడే హిమ, జ్వాల (Jwala) కలిసి దిగిన సెల్ఫీ ప్రేమ్ ఉంటుంది. ఇక రేపటి భాగంలో సౌందర్య ఆ సెల్ఫీ ను చూస్తుందో లేదో చూడాలి.