MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Entertainment
  • ప్రభాస్ బాటలో మరో హీరో.... పెళ్లి, పిల్లలు వద్దంటూ షాకింగ్ కామెంట్స్! కారణం?

ప్రభాస్ బాటలో మరో హీరో.... పెళ్లి, పిల్లలు వద్దంటూ షాకింగ్ కామెంట్స్! కారణం?

పెళ్లి వద్దనే వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది. సోలో లైఫ్ సో బెటర్ అంటున్నారు. నలభై ఏళ్ళు పైబడిన చాలా మంది హీరోలు, హీరోయిన్స్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ప్రభాస్ మాదిరి పెళ్లి వద్దంటున్నాడు మరో యంగ్ హీరో..   

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 22 2024, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Prabhas

Prabhas


సల్మాన్ ఖాన్, విశాల్, ప్రభాస్, టబు, అనుష్క శెట్టి, శోభన... వీరందరి వయసు 40 ప్లస్. ఎవరికీ వివాహాలు కాలేదు. కొందరు అసలు చేసుకోమని తేల్చేశారు. ప్రభాస్ ని మీ పెళ్లి ఎప్పుడని అడిగితే...  నవ్వేసి ఊరుకుంటాడు. లేదంటే సమాధానం దాటేస్తాడు. ఈ ప్రశ్న ఫేస్ చేయడం ప్రభాస్ కి అతి పెద్ద సవాల్. అందుకే మీడియా ముందుకు కూడా పెద్దగా రాడు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రభాస్ పెళ్లి పై పలుమార్లు పుకార్లు వచ్చాయి. అనుష్కతో పెళ్లి రూమర్ గట్టిగా వినిపించింది. తాము స్నేహితులం మాత్రమే అన్న... ప్రభాస్, అనుష్క పుకార్లను ఖండించారు. కాగా ప్రభాస్ కి పెళ్లి ఇష్టం లేదనే ఓ వాదన ఉంది. పెద్దవాళ్ళు ఎంతగా బ్రతిమిలాడినా ప్రభాస్ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటం లేదట. 

37

బాలయ్య హోస్ట్ గా ఉన్న అన్ స్టాపబుల్ షోకి ప్రభాస్ గెస్ట్ గా వచ్చాడు. బాలయ్య ఇదే విషయం పై ప్రశ్న అడిగారు. నాకు పెళ్లి యోగం లేదనుకుంటా, కావడం లేదని డిప్లమాటిక్ ఆన్సర్ చెప్పి ప్రభాస్ తప్పించుకున్నాడు. ఎంత గట్టిగా అడిగినా మనసులో మాట బయటపెట్టలేదు. 

 

47

సల్మాన్ తర్వాత నా పెళ్లి అని చెప్పి తప్పించుకున్నాడు. ప్రభాస్ మాదిరే టాలీవుడ్ లో మరో హీరో పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయ్యాడు. యంగ్ హీరో రాజ్ తరుణ్ ఈ మేరకు ఓపెన్ కామెంట్స్ చేశాడు. నేను వివాహం చేసుకోనని ఇంట్లో చెప్పేశాను. అమ్మ మొదట్లో ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆమె కూడా అర్థం చేసుకుందని అన్నాడు. 
 

57

సింగిల్ గా నా లైఫ్ హ్యాపీగా ఉంది. పెళ్లి, పిల్లలు వంటి విషయాలు నాకు ఇష్టం లేదు. వివాహం చేసుకోను అని అన్నాడు. రాజ్ తరుణ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. కెరీర్ బిగినింగ్ లో రాజ్ తరుణ్ షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. 

67

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తెరకెక్కిన ఉయ్యాలా జంపాలా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. సినిమా చూపిస్త మామ, కుమారి 21 ఎఫ్ రాజ్ తరుణ్ కి ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. రాజ్ తరుణ్ స్టార్ కావడం ఖాయం అనుకుంటుండగా వరుస ప్లాప్స్ పడ్డాయి. 

 

77

రేసులో వెనుకబడ్డ రాజ్ తరుణ్ ఇటీవల నా సామిరంగ చిత్రంతో ప్రేక్షకులను పలకరించాడు. నాగార్జున హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక రోల్స్ చేశారు. నా సామిరంగ హిట్ టాక్ తెచ్చుకుంది. రాజ్ తరుణ్ హీరోగా కొన్ని చిత్రాలు తెరకెక్కుతున్నాయి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో దుమ్మురేపుతున్న టాప్ 10 సినిమాలు.. సూర్య, తాప్సి, వరుణ్ తేజ్ హవా
Recommended image2
Chiranjeevi: రూ.25000 పెట్టలేం, స్టార్ ని పక్కన పెట్టి చిరంజీవితో మూవీ..నిర్మాతకు తెలియకుండానే సూపర్ హిట్
Recommended image3
Epic 5 Days Collections: ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్యకి పెద్ద షాక్‌.. దారుణంగా పడిపోయిన ఎపిక్‌ కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved