ఆ మూవీ వదులుకుని తప్పు చేశాను, ఇప్పటికీ బాధపడుతున్న ఎన్టీఆర్, ఇంతకీ ఆ చిత్రం ఏమిటో తెలుసా?
జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ బడా స్టార్స్ లో ఒకరు. పాన్ ఇండియా హీరో. దేవరతో మరో భారీ విజయం ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఎన్టీఆర్ ఓ చిత్రాన్ని చేయనందుకు ఇప్పటికీ బాధపడుతున్నాడట.
జూనియర్ ఎన్టీఆర్ టీనేజ్ ముగియకముందే హీరోగా మారాడు. ఇరవై ఏళ్ళు నిండకుండానే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి చిత్రాలతో ఎన్టీఆర్ ఇమేజ్ భారీగా పెరిగింది. కాగా ఎన్టీఆర్ కెరీర్లో చాలా సూపర్ హిట్ చిత్రాలను వదిలేశాడు. బొమ్మరిల్లు, ఆర్య వంటి భారీ హిట్స్ ఎన్టీఆర్ చేయాల్సింది. అవి మొదట ఎన్టీఆర్ వద్దకు వెళ్లిన కథలు. ఆయన రిజెక్ట్ చేయడంతో ఇతర హీరోలతో చేశారు.
షెడ్యూల్స్ కుదరకో, సబ్జెక్టు నచ్చకో, సబ్జెక్టు నచ్చినా తన ఇమేజ్ కి సెట్ కాదనో... ఎన్టీఆర్ కొన్ని హిట్ సినిమాలు వదిలేశారు. ఓ సినిమా చేయనందుకు ఆయన చాలా ఫీల్ అవుతున్నాడట. ఆ మూవీ రవితేజ నటించిన భద్ర. దర్శకుడు బోయపాటి తెరకెక్కించిన భద్ర 2005లో విడుదలై రవితేజకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆయన కెరీర్ కి భద్ర ప్లస్ అయ్యింది.
NTR
కానీ ఈ కథను మొదట బోయపాటి ఎన్టీఆర్ కి వినిపించాడట. ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడట. దాంతో భద్ర కథ రవితేజ వద్దకు వెళ్ళింది. లవ్, యాక్షన్, ఎమోషన్స్ జోడించి తెరకెక్కించిన భద్ర భారీ విజయం అందుకుంది. భద్ర విడుదలయ్యే నాటికి ఎన్టీఆర్ ప్లాప్స్ లో ఉన్నాడు. సింహాద్రి అనంతరం ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా డిజాస్టర్ అయ్యింది. సాంబ యావరేజ్. నా అల్లుడు, నరసింహుడు డబుల్ డిజాస్టర్స్ అయ్యాయి.
భద్ర చేసి ఉంటే ఎన్టీఆర్ వరుస పరాజయాల నుండి బయటపడేవాడు. 2007లో రాజమౌళి యమదొంగ చేసే వరకు ఎన్టీఆర్ కి ప్లాప్స్ పడుతూనే ఉన్నాయి. కాగా భద్ర వదులుకోకుండా ఉండాల్సింది. ఆ ప్రాజెక్ట్ వదులుకుని తప్పు చేశానని ఇప్పటికీ ఎన్టీఆర్ బాధపడుతూ ఉంటాడట. సన్నిహితుల వద్ద వాపోతూ ఉంటాడట. భద్ర చేయకున్నప్పటికీ ఎన్టీఆర్ స్టార్ హీరోగా ఎదిగాడు.
Devara
టెంపర్ అనంతరం ఎన్టీఆర్ కి ఒక్క ఫ్లాప్ కూడా లేదు. హిట్స్, సూపర్ హిట్స్ కొడుతూనే ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీతో గ్లోబల్ ఫేమ్ రాబట్టాడు. రామ్ చరణ్ మరో హీరోగా నటించాడు. దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ వరల్డ్ వైడ్ రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ గెలిచిన సంగతి తెలిసిందే.
కాగా రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ ని కూడా ఎన్టీఆర్ బ్రేక్ చేశాడు. సాధారణంగా ఎన్టీఆర్ తో మూవీ చేసిన హీరో నెక్స్ట్ మూవీ డిజాస్టర్ కావాల్సిందే. ఆచార్య రూపంలో రామ్ చరణ్ ని ఈ సెంటిమెంట్ వెంటాడింది. దీన్ని అధిగమించిన మొదటి హీరోగా ఎన్టీఆర్ నిలిచాడు. దేవర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దేవర వరల్డ్ వైడ్ రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.