MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Jr NTR: ఏఎన్నార్ అడిగిన ఒక్క మాటతో జూ.ఎన్టీఆర్ ఆశలు గల్లంతు.. దాన వీర శూర కర్ణ ఇక లేనట్లే ?

Jr NTR: ఏఎన్నార్ అడిగిన ఒక్క మాటతో జూ.ఎన్టీఆర్ ఆశలు గల్లంతు.. దాన వీర శూర కర్ణ ఇక లేనట్లే ?

జూనియర్ ఎన్టీఆర్ ఆశలపై లెజెండ్రీ నటుడు ఏఎన్నార్ నీళ్లు చల్లారు. ఆయన అడిగిన ఒక్క సందేహంతో ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Dec 25 2025, 01:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎన్టీఆర్ క్లాసిక్ సినిమాలు 
Image Credit : Instagram/Jr NTR

ఎన్టీఆర్ క్లాసిక్ సినిమాలు 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు పోలికలతో ఉంటాడని అభిమానులు అందరూ అంటుంటారు. తారక్ ఎప్పటికైనా నందమూరి తారక రామారావు క్లాసిక్ చిత్రాలని రీమేక్ చేయాలని లేదా అలాంటి పాత్రలో నటించాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కానీ క్లాసిక్ చిత్రాలని రిమేక్ చేసి ఇప్పటి తరం ఆడియన్స్ ని మెప్పించడం అంత సులువైన పని కాదు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆ సినిమా రీమేక్ కి ప్రయత్నం 
Image Credit : Youtube/Telugu Filmnagar

ఆ సినిమా రీమేక్ కి ప్రయత్నం 

కానీ ఈ ప్రయత్నాన్ని జూనియర్ ఎన్టీఆర్ గతంలో చేశారు. కానీ కార్యరూపం దాల్చలేదు. ఎన్టీఆర్ ప్రయత్నానికి అడ్డుకట్ట వేసింది లెజెండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు అనే చెప్పాలి. ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన క్లాసిక్ చిత్రాల్లో గుండమ్మ కథ ఒకటి. జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య.. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల మనవళ్లు కాబట్టి ఆ సినిమా రీమేక్ చేస్తే బావుంటుంది అని అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా కొందరు భావించారు. 

35
వార్నింగ్ ఇచ్చిన నాగార్జున 
Image Credit : amazon prime, imdb

వార్నింగ్ ఇచ్చిన నాగార్జున 

నటుడు, నిర్మాత మురళి మోహన్ గుండమ్మ కథ రీమేక్ కోసం ప్రయత్నాలు చేశారు. తారక్, నాగ చైతన్య కలసి నటిస్తే ఆ చిత్రానికి సాయం చేయడానికి నాగార్జున కూడా ముందుకు వచ్చారు. కాకపోతే అది క్లాసిక్ మూవీ. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని హెచ్చరించారట. అంతా ఓకె అనుకున్న తర్వాత ఈ ప్రపోజల్ ఏఎన్నార్ వద్దకు వెళ్ళింది. గుండమ్మ కథ రీమేక్ చేయడానికి ఏఎన్నార్ అడ్డు చెప్పలేదు. కాకపోతే ఆయన అడిగిన ఒకే ఒక్క డౌట్ తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయింది. 

45
ఏఎన్నార్ సందేహం ఇదే 
Image Credit : ETV Win

ఏఎన్నార్ సందేహం ఇదే 

అప్పటి నటీనటుల్ని మించి మెప్పించడం అంత సులువు కాదు. ఎన్టీఆర్, నాగ చైతన్యకి క్రేజ్ ఉంది కాబట్టి నడిచిపోతుంది. నటీనటులు కూడా అందరూ సెట్ కావచ్చు. కానీ టైటిల్ రోల్ లో నటించడానికి ఆప్షన్ ఎవరు ఉన్నారు. అదే సూర్యకాంతం పోషించిన గుండమ్మ పాత్రకి ఎవరిని పెడుతారు ? సరైన ప్రత్యామ్నాయం ఉందా అని ఏఎన్నార్ ప్రశ్నించారట. దీనితో ఎవరి నోటి వెంటా మాట రాలేదు. 

55
తారక్ కి అది ఎప్పటికీ సాధ్యం కాదా ?
Image Credit : Asianet News

తారక్ కి అది ఎప్పటికీ సాధ్యం కాదా ?

గుండమ్మ పాత్రలో నటించిన సూర్యకాంతంకి ప్రత్యామ్నాయం లేదు. అలాంటి నటి లేకుంటే ఈ సినిమా సాధ్యం కాదు అని ఏఎన్నార్ అన్నారట. ఆ విధంగా గుండమ్మ కథ రీమేక్ ఆగిపోయింది. ఎన్టీఆర్, నాగ చైతన్య ఆశలు గల్లంతు అయ్యాయి. తారక్ అభిమానులు దానవీర శూర కర్ణ చిత్రాన్ని కూడా రీమేక్ చేయాలని కోరుకుంటున్నారు. గుండమ్మ కథ రీమేక్ సాధ్యం కాలేదు కాబట్టి దాన వీర శూర కర్ణ రీమేక్ కూడా తెరకెక్కడం అసాధ్యం అని కొందరు భావిస్తున్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
నందమూరి తారక రామారావు
అక్కినేని నాగార్జున
నాగ చైతన్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
SJ Surya Villain Movies: ఇండియన్ 2 నుంచి సర్దార్ 2 వరకు.. ఎస్.జే.సూర్య విలనిజం ఎందుకు ఫ్లాప్ అవుతోంది? జైలర్ 2 గట్టెక్కిస్తుందా?
Recommended image2
Sobhan Babu: ఏమయ్యా ఎట్లా తీసావయ్యా సినిమా.. ఎస్వీ కృష్ణారెడ్డిని పిలిచి, నిలదీసిన శోభన్ బాబు, ఏమన్నాడంటే?
Recommended image3
Shooting Deaths: షూటింగ్ స్పాట్‌లోనే ప్రాణాలు వదిలారు! కెమెరా ముందు జరిగిన 8 విషాదాలు
Related Stories
Recommended image1
ఆ కండిషన్ కి ఒప్పుకుంటే నటించు, లేకుంటే వెళ్ళిపో.. శ్రీదేవికి చుక్కలు చూపించిన సూపర్ స్టార్ కృష్ణ
Recommended image2
Mahesh Babu: కృష్ణ గారి అబ్బాయి అని మాత్రమే తెలుసు, చంద్రమోహన్ హీరోయిన్ ని పిలిచి మరీ తిట్టిన మహేష్ బాబు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved