నిర్మాత ఆపేద్దామని చెప్పినా వినకుండా సినిమా రిలీజ్ చేయించిన జూ.ఎన్టీఆర్, ఫలితం చూశాక ఫ్యూజుల్ ఔట్
ఎన్టీఆర్ హీరోగా నటించిన ఓ సినిమా విషయంలో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. నిర్మాత మాట వినకుండా సినిమా చేస్తే ఫలితం చూసుకున్నాక మతిపోయింది.
NTR
జూ ఎన్టీఆర్ ఇటీవల `దేవర` సినిమాతో బాక్సాఫీసు వద్ద రచ్చ చేశాడు. కొరటాల శివ రూపొందించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఐదు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. ఎన్టీఆర్‌కి పాన్ ఇండియా మార్కెట్‌కి సంబంధించిన గట్టి బేస్ వేసింది. ఇప్పుడు మరో భారీ సినిమాతో రాబోతున్నారు తారక్. ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నాడు.
బిగ్ బాస్ తెలుగు 8 అప్ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదిలా ఉంటే యంగ్ టైగర్ కెరీర్‌లో హిట్లతోపాటు ఫ్లాప్‌లు చాలానే ఉన్నాయి. `టెంపర్`కి ముందు ఆయన సినిమాలు నాలుగైదు పరాజయం చెందాయి. దెబ్బమీద దెబ్బ పడింది. అయితే ఈ క్రమంలో ఓ సినిమా విషయంలో ఎన్టీఆర్ నిర్మాత మాట వినకుండా చేశాడట. మధ్యలోనే సినిమాని ఆపేద్దామని చెప్పాడట. కానీ తారక్ ఫోర్స్ చేసి సినిమాని పూర్తి చేయించాడట. ఫలితం చూసుకున్నకి మతిపోయిందట. మరి ఆ సినిమా ఏంటి, ఆ నిర్మాత ఎవరు అనేది చూస్తే.
ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీస్‌లో `రభస` ఒకటి. సంతోష్ శ్రీనివాస్ దీనికి దర్శకుడు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఈ మూవీలో సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. బెల్లంకొండ సురేష్ సినిమాని నిర్మించారు. 2014లో విడుదలైన ఈ మూవీ పరాజయం చెందింది. డిజాస్టర్ టాక్‌ని తెచ్చుకుంది. అయితే ఈ సినిమా విషయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుందట. సినిమా ఫెయిల్యూర్‌కి కారణం ఎన్టీఆర్ కారణమని తెలిపారు నిర్మాత బెల్లంకొండ సురేష్.
ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు మధ్యలో నిర్మాత సురేష్ రష్ చూశారట. ఔట్ పుట్ చూసుకున్నాక ఈ సినిమా ఆడదని అనిపించిందట. అదే విషయాన్ని టీమ్‌కి, ఎన్టీఆర్‌కి చెప్పాడు. సినిమా బాగా రాలేదు. బాగా తీయలేదు.
దీంతో సినిమా ఆడటం కష్టం మధ్యలోనే ఆపేద్దామని చెప్పాడట నిర్మాత. దీంతో లేదు సినిమా బాగా వచ్చింది. చూడు మంచి హిట్ అవుతుందని ఎన్టీఆర్ అన్నారట. బలవంతంగా కంప్లీట్ చేయించి రిలీజ్ చేయించారట. ఆగస్ట్ 29న విడుదలైన ఈ సినిమా ఫస్ట్ ఫో నుంచే నెగటివ్ టాక్ వచ్చిందట.
అయితే ఎన్టీఆర్ క్రేజ్, ఫాలోయింగ్ కారణంగా మంచి ఓపెనింగ్స్ వచ్చాయట. సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా, సినిమా బాగానే వసూళ్లని రాబట్టిందట. అది కేవలం ఎన్టీఆర్ కారణంగానే అని చెప్పాడు సురేష్. అయితే దాదాపు 80-90శాతం రికవరీ అయ్యిందట. దాదాపు 10-15శాతం లాస్ వచ్చిందని తెలిపారు.
అయితే తాను 50శాతం పోతుందని భావించాడట. కానీ ఎన్టీఆర్ వల్లే కలెక్షన్లు పెరిగాయని తెలిపారు నిర్మాత. తాను చెప్పిన మాటనే నిజమైందని, ఫలితం చూసుకున్నాక తారక్‌కి మతిపోయిందన్నారు సురేష్. ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
read more:`పుష్ప-పుష్ప2`కి ఉన్న పోలికలు, తేడాలు.. సుకుమార్ చేసిన మ్యాజిక్ ఏంటి?