అమల బ్యాక్ గ్రౌండ్‌కి, శోభిత ఫ్యామిలీకి ఉన్న కామన్ క్వాలిటీ, నాగార్జున పెళ్లికి ఒప్పుకోవడానికి కారణమదేనా?
నాగచైతన్య చేసుకున్న శోభితా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్, అమల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌కి ఒక కామన్ క్వాలిటీ ఉంది. నాగ్ పెళ్లికి ఓకే చెప్పడానికి దానికి సంబంధం ఉందా?
అక్కినేని ఫ్యామిలీ పెళ్లి బాజాలు మోగాయి. బుధవారం రాత్రి నాగచైతన్య, శోభితాలు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాత్రి 8.13 గంటలకు తన ప్రియురాలు శోభిత మెడలో మూడు ముళ్లు వేశారు నాగచైతన్య. అనంతరం కొత్త జంటని బంధుమిత్రులు, సినీ ప్రముఖులు ఆశీర్వదించారు. వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగార్జున విషెస్ చేస్తూ సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు శోభితాకి సంబంధించిన, ఆమె అత్త అమలకు సంబంధించిన ఓ విషయం ఆసక్తికరంగా మారింది. అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అమలకి, శోభిత ఫ్యామిలీలకు సంబంధించి ఓ అంశం కామన్‌గా ఉంది. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ సేమ్ ఉంది. అదే ఇప్పుడు అందరిని వాహ్ అనేలా చేస్తుంది. అంతేకాదు నాగార్జున ఈ పెళ్లికి ఒప్పుకోవడానికి కూడా కారణం అదే అనే సందేహం కూడా కలుగుతుంది.
read more: శోభిత ధూళిపాళ - నాగచైతన్య పెళ్లి ఫోటోలు చూశారా, పట్టు పంచలో చైతూ, కాంచివరం చీరలో శోభిత
మరి ఆ క్వాలిటీ ఏంటనేది చూస్తే.. అమల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నేవీ. తండ్రి నేవీ అధికారి. అమ్మ రైటర్, సోషల్ యాక్టివిస్ట్, పొయేటిస్ట్, తను ఎప్పుడూ బిజీగా ఉంటుందట. అలాగే నాన్న ఎప్పుడూ ఆయన నేవీ సర్వీస్‌లో బిజీగా ఉంటారట. ఇలా ఉన్నతమైన కుటుంబం వారిది. దీంతో ఒక సిస్టమాటిక్ లైఫ్ ఉంటుంది. కల్చర్ ఉంటుంది. హుందాగా ఉంటారు. అమలని నాగార్జున ప్రేమించి పెళ్లి చేసుకున్న విసయం తెలిసిందే. అయితే ఆమెని మ్యారేజ్ చేసుకోవడానికి ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కూడా ఓ కారణంగా చెప్పొచ్చు.
మరోవైపు శోభితా ఫ్యామిలీకి కూడా నేవీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. శోభిత తండ్రి ఆయన మర్చెంట్ నేవీ ఇంజనీర్. తల్లి స్కూల్ టీచర్. ఇలా రెండు కుటుంబాలకు కామన్ క్వాలిటీ నేవీ. దీంతో శోభితా ఫ్యామిలీ కూడా సిస్టమాటిక్‌గా ఉంటుందని చెప్పొచ్చు. ఉన్నతమైన స్టడీస్ చేసిన ఫ్యామిలీ కావడంతో ఆ హుందాతనం ఉంటుంది. నాగ చైతన్యతో శోభితా పెళ్లికి నాగ్ గ్రీన సిగ్నల ఇవ్వడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చు. ఏదేమైనా ఇప్పుడు అత్తా కోడలు ఒకే ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి రావడం విశేషం.
ఇక నాగచైతన్య, శోభితా దూళిపాళ పెళ్లికి సినిమా సెలబ్రిటీలు బాగానే సందడి చేశారు. చిరంజీవి ఫ్యామిలీ, రామ్ చరణ్ వచ్చారు. దగ్గుబాటి ఫ్యామిలీ ఉంది. వెంకటేష్, రానా దగ్గరుండి పెళ్లి చేయించారు. అక్కినేని ఫ్యామిలీ అంతా దగ్గరే ఉంది. వీరితోపాటు అల్లు అర్జున్ వచ్చారు. తమిళ హీరో కార్తి, `తండేల్` దర్శకుడు చందూ మొండేటి కూడా పెళ్లికి హాజరయ్యారు. వీరితోపాటు చాలా మంది ప్రముఖుులు సందడి చేసినట్టు తెలుస్తుంది.
వీటిలో అక్కినేని ఫ్యామిలీతో నాగచైతన్య చేసిన సందడి పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఇందులో రానాతో పిక్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. చైతూ, రానాల మధ్య అనుబంధాన్ని చాటి చెబుతుంది.
read more: `పుష్ప 2ః ది రూల్` సినిమాలో 5 హైలైట్స్.. థియేటర్లలో పూనకాలు తెప్పించే ఎలిమెంట్లు ఇవే
also read: `పుష్ప 2` మూవీ రివ్యూ, రేటింగ్