MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • OTT: సముద్రంలో దొరికిన బంగారు ఆభరణంతో ఊహించని చిక్కులు.. అదిరిపోయే కోర్ట్ రూమ్ థ్రిల్లర్ మిస్ కావొద్దు

OTT: సముద్రంలో దొరికిన బంగారు ఆభరణంతో ఊహించని చిక్కులు.. అదిరిపోయే కోర్ట్ రూమ్ థ్రిల్లర్ మిస్ కావొద్దు

ప్రముఖ నటుడు కరుణాస్ నటించిన థ్రిల్లర్ సినిమా ఎన్న విలై ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైంది. రామేశ్వరం తీరం బ్యాక్ డ్రాప్ లో జరిగే ఓ మత్స్యకారుడు కథ ఇది. మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Oct 16 2026, 07:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Enna Vilai OTT
Image Credit : Asianet News

Enna Vilai OTT

ప్రముఖ నటుడు కరుణాస్ ప్రధాన పాత్రలో నటించిన ఎన్న విలై (Enna Vilai) అనే తమిళ మూవీ థియేటర్స్ లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ మూవీలో కరుణాస్ ప్రధాన పాత్రలో నటించగా నిమిషా సజయన్ లాయర్ గా అదరగొట్టారు. ఈ సినిమా అక్టోబర్ 15 నుంచి నెట్ ఫ్లిక్స్ లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ మొదలైంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కోర్ట్ రూమ్ సన్నివేశాలు హైలైట్
Image Credit : Asianet News

కోర్ట్ రూమ్ సన్నివేశాలు హైలైట్

ఈ సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో పాటు, కోర్ట్ రూమ్ సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. ఒక పేదవాడు ఊహించని విధంగా ఈ సిస్టం కుట్రలో చిక్కుకుపోతే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి, తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం కోసం ఎలా నిలబడ్డాడు అనేది ఈ చిత్ర కథ.

35
కథ ఏంటంటే
Image Credit : Asianet News

కథ ఏంటంటే

తవసి ముత్తు(కరుణాస్) రామేశ్వరంలో నివాసం ఉండే సాధారణ మత్యకారుడు. అతడికి ఓ చెల్లి, భార్య, ఇద్దరు పిల్లలు ఉంటారు. చెల్లి పెళ్లీడుకు వచ్చి ఉంటుంది. పిల్లలు చదువుతుంటారు. తవసి, అతడి భార్య, చెల్లి ఏదో ఒక పని చేస్తూ కుటుంబం కోసం కష్టపడుతుంటారు. తవసి మత్స్యకార వృత్తి కొనసాగిస్తూ ఖాళీ సమయాల్లో రామేశ్వరం తీరప్రాంతంలో భక్తులు సముద్రంలో విసిరిన నాణేలని వెతికి పోగు చేసుకుంటుంటారు. అతడితో పాటు ఆ ఊరిలో చాలా మంది నాణేలని ఏరుకునే పని చేస్తుంటారు.

45
కోట్ల విలువైన ఆభరణం, కానిస్టేబుల్ కుట్ర
Image Credit : Asianet News

కోట్ల విలువైన ఆభరణం, కానిస్టేబుల్ కుట్ర

ఇలా సముద్రంలో నాణేలు ఏరుకుంటూ ఉండగా ఒకరోజు తవసికి సముద్రం అడుగున ఒక బంగారు ఆభరణం కనిపిస్తుంది. అనుమానంతో తవసి తనకు తెలిసిన కానిస్టేబుల్ కి ఆ ఆభరణాన్ని చూపించి సముద్రంలో దొరికింది అని చెబుతాడు. వెంటనే ఆ కానిస్టేబుల్ కుట్ర మొదలు పెడతాడు. తవసి మోసం చేస్తాడు. ఇది బంగారం కాదు, గిల్డ్ నగ.. నాటకాలు వేసేవాళ్ళు ఎవరో సముద్రంలో పడవేసి ఉంటారు. నిజంగా బంగారం అయితే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఉంటారు కదా అని నమ్మిస్తాడు. కానిస్టేబుల్ మాటలని తవసి నమ్ముతాడు. ఆ ఆభరణాన్ని కానిస్టేబుల్ పరీక్షించి చూస్తే నిజంగా అది బంగారం అని తేలుతుంది. దీనితో తవసికి తెలియకుండా దానికి పొదిగి ఉన్న ఒక రత్నాన్ని కానిస్టేబుల్ తీసుకుంటాడు. ఇది గిల్డ్ దే అయినప్పటికీ దీని గురించి ఎవరికీ చెప్పొద్దు అని.. తాను అడిగినప్పుడు తెచ్చి ఇవ్వమని కానిస్టేబుల్.. తవసికి చెబుతాడు. కానిస్టేబుల్ రహస్యంగా ఆ రత్నాన్ని అమ్మితే 3 లక్షలు డబ్బు వస్తుంది. ఒక్క రత్నానికే 3 లక్షలు వస్తే.. ఇక ఆ ఆభరణం మొత్తం విలువ కోట్లల్లో ఉంటుంది అని కానిస్టేబుల్ కి అర్థం అవుతుంది. దీనితో కానిస్టేబుల్ కుట్ర చేసి తవసిని దొగతనం కేసులో ఇరికించి ఆ ఆభరణాన్ని సొంతం చేసుకోవాలి అని భావిస్తాడు. తన తోటి కానిస్టేబుల్స్ కి వాటా ఇచ్చి వాళ్ళ సాయం తీసుకుంటాడు. ఆ విధంగా నిస్సహాయుడైన తవసి అన్యాయంగా దొంగతనం కేసులో చిక్కుకుంటాడు. ఆ తర్వాత పరిణామాలు ఎలా మారాయి ? తవసి రక్షించేందుకు లాయర్ కాంచన(నిమిషా సజయన్) చేసిన ప్రయత్నాలు ఏంటి ? కేసు హై కోర్టు వరకు ఎలా వెళ్ళింది ? చివరకు ఆ బంగారు ఆభరణం గురించి హై కోర్టు ఏం తేల్చింది ? అనేది మిగిలిన కథ.

55
కరుణాస్ నటన అద్భుతం
Image Credit : Asianet News

కరుణాస్ నటన అద్భుతం

కరుణాస్ మత్స్యకారుడిగా, అమాయకుడిగా అద్భుతంగా నటించారు. ఇక లాయర్ పాత్రలో నిమిషా కూడా అదరగొట్టింది. చివర్లో కరుణాస్ తన పరువు కోసం హై కోర్టులో చేసిన పోరాటం ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో కొంత సాగదీత ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఆకట్టుకుంటుంది. సజీవ్ పల్లూర్ ఈ చిత్రానికి దర్శకుడు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
ఓటీటీ
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Salman Khan: ఆ హీరోయిన్ తో సల్మాన్ ఖాన్ కెమిస్ట్రీ.. మళ్లీ చూడాల్సిన 5 సూపర్ హిట్ సినిమాలు!
Recommended image2
Kota Srinivasa Rao: ఇష్టం లేకుంటే షూటింగ్ నుంచి వెళ్ళిపో, కోట శ్రీనివాసరావుతో డైరెక్టర్.. నటి వల్ల వివాదం
Recommended image3
Horror Movies: ఈ హారర్ సినిమాలు ఒంటరిగా చూసే దమ్ముందా? అయితే ఈ మలయాళ సినిమాలు మీకోసమే!
Related Stories
Recommended image1
Chiranjeevi: చిరంజీవిని ఎయిర్ పోర్ట్ లో కలిసి రిక్వస్ట్ చేశా, నాకు మిగిలింది మాత్రం మొండి చెయ్యే
Recommended image2
Kota Srinivasa Rao: ఇష్టం లేకుంటే షూటింగ్ నుంచి వెళ్ళిపో, కోట శ్రీనివాసరావుతో డైరెక్టర్.. నటి వల్ల వివాదం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved