- Home
- Entertainment
- పుష్ప 2 కాదు అంతకి మించి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం.. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన నిర్మాత
పుష్ప 2 కాదు అంతకి మించి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం.. ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన నిర్మాత
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో చిత్రం ఇటీవల ప్రారంభమైంది. ఎన్టీఆర్, నీల్ తొలి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

Jr NTR
యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో చిత్రం ఇటీవల ప్రారంభమైంది. ఎన్టీఆర్, నీల్ తొలి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన దృశ్యాలని ప్రశాంత్ నీల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Prashanth Neel, NTR Jr, kgf
ఈశాన్య రాష్ట్రాల్లో నల్లమందు నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్లు వార్తలు వచ్చాయి. మైత్రి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. మైత్రి నిర్మాతలలో ఒకరైన రవిశంకర్ తాజాగా ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ చిత్ర సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇందులో ఎన్టీఆర్, నీల్ డ్రాగన్ గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. పుష్ప 2 1800 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. ఎన్టీఆర్ డ్రాగన్ ఎలా ఉండబోతోంది అని ప్రశ్నించారు.
రవిశంకర్ స్పందిస్తూ. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రానికి ఆకాశమే హద్దు. ఇండియన్ సినిమాలో ఇంతవరకు చూడని స్క్రిప్ట్ అది. దానిపై మీరు ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్న్నా పర్వాలేదు. అంత అద్భుతంగా ఉండబోతోంది. పుష్ప 2 కాదు.. ఎన్టీఆర్ నీల్ చిత్రం ఏ స్థాయిలో వసూళ్లు రాబడుతుంది అంటే ఊహకి కూడా అందదు అంటూ రవిశంకర్ అంచనాలు పెంచేశారు. రవిశంకర్ కామెంట్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉన్నాయి.
దేవర చిత్రం తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్నారు. దేవర 2 ఎప్పుడు ఉంటుందో తెలియదు. మరోవైపు ప్రశాంత్ నీల్ కూడా సలార్ 2 ఆపి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. డ్రాగన్ టైటిల్ విషయంలో కూడా రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. ఎన్టీఆర్, నీల్ మూవీ టైటిల్ డ్రాగన్ అని ఆయన కంఫర్మ్ చేశారు. తమిళంలో డ్రాగన్ టైటిల్ తో మూవీ వచ్చింది కదా.. ఇప్పుడు ఎలా అని ప్రశ్నించగా.. ఇది వేరు అది వేరు. ఎన్టీఆర్ నీల్ సినిమా హై ఓల్టేజ్ యాక్షన్ తో కూడుకున్న డ్రాగన్ అని తెలిపారు. పాన్ ఇండియా కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా రిలీజ్ చేయాల్సిన చిత్రం అది అని రవిశంకర్ సంచలన వ్యాఖలు చేశారు.