MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో భారీ బయోపిక్ చిత్రం.. తారక్ ఎవరి పాత్రలో నటించబోతున్నారో తెలుసా ?

ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో భారీ బయోపిక్ చిత్రం.. తారక్ ఎవరి పాత్రలో నటించబోతున్నారో తెలుసా ?

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న కొత్త బయోపిక్ "మేడ్ ఇన్ ఇండియా"లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించబోతున్నారనే వార్త పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 15 2025, 08:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Rajamouli, Jr NTR

Rajamouli, Jr NTR

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న కొత్త బయోపిక్ "మేడ్ ఇన్ ఇండియా"లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్ర పోషించబోతున్నారనే వార్త పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. భారతీయ సినిమాకు పితామహుడు అయిన దాదాసాహెబ్ ఫాల్కే జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి 2023లో అధికారికంగా ప్రకటించారు.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ చిత్రాన్ని మ్యాక్స్ స్టూడియోస్, షోయింగ్ బిజినెస్ కలిసి నిర్మిస్తున్నాయి. రాజమౌళి తన ట్విట్టర్ ఖాతాలో సెప్టెంబర్ 19, 2023న సినిమా ప్రకటన వీడియోను విడుదల చేశారు. “ఈ కథ విన్నప్పుడే నా మనసును తాకింది. ఒక బయోపిక్ తీయడం సులభం కాదు. అది కూడా ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా గురించిన కథ అయితే మరింత కష్టమే. కానీ మా బృందం సన్నద్ధంగా ఉంది,” అని రాజమౌళి పేర్కొన్నారు.

 

Related Articles

Related image1
RRR 2 చేస్తారా ? ఉపాసన ప్రశ్నకి స్పందించిన రాజమౌళి.. ఎన్టీఆర్, చరణ్ అల్లరి వైరల్
Related image2
టాలీవుడ్ దర్శకులకు షాకిచ్చిన అనసూయ భర్త.. కనిపించేంత సాఫ్ట్ కాదు
35
SS Karthikeya

SS Karthikeya

ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం ప్రకారం, జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో దాదాసాహెబ్ ఫాల్కే పాత్ర పోషించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.  నిర్మాతలు వరుణ్ గుప్తా, ఎస్.ఎస్. కార్తికేయ కలిసి జూనియర్ ఎన్టీఆర్‌కు కథ వినిపించారని తెలుస్తోంది. వీళ్ళిద్దరూ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. రాజమౌళి కూడా ఇన్వాల్వ్ అవుతారు. కానీ ఈ చిత్రానికి నితిన్ కక్కర్ దర్శకత్వం వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. "ఎన్టీఆర్ కథ విన్న వెంటనే ఆకర్షితులయ్యారు. దాదాసాహెబ్ ఫాల్కే గురించి తెలియని అనేక విషయాలు ఈ కథలో ఉన్నాయని, భారతీయ సినిమా అభివృద్ధి గురించి వివరంగా చెప్పడంతో ఎన్టీఆర్ ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. 

 

45
Jr NTR

Jr NTR

అంతేకాకుండా, ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్‌పై దర్శకుడు రాజమౌళి, ఆయన కుమారుడు కార్తికేయ,  నిర్మాత వరుణ్ గుప్తాపై గల అభిమానంతో మరింత ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కానీ ఇండస్ట్రీ వర్గాల్లో ఈ వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది.

55
Jr NTR

Jr NTR

ఎన్టీఆర్ ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ చిత్రాల్లో నటించారు. అయితే తొలిసారి ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వం వహించకుండా ఆయన ఇన్వాల్వ్ అవుతున్న చిత్రానికి ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఎస్.ఎస్. రాజమౌళి
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image2
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Recommended image3
Mahakali: మహాకాళి అవతారంలో శ్రియా రెడ్డి.. సలార్ స్టార్ బ్యాక్‌గ్రౌండ్, క్రికెట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఇవే
Related Stories
Recommended image1
RRR 2 చేస్తారా ? ఉపాసన ప్రశ్నకి స్పందించిన రాజమౌళి.. ఎన్టీఆర్, చరణ్ అల్లరి వైరల్
Recommended image2
టాలీవుడ్ దర్శకులకు షాకిచ్చిన అనసూయ భర్త.. కనిపించేంత సాఫ్ట్ కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved