Harikrishna: 'సీతయ్య' సీక్వెల్ కి ఎన్టీఆర్ రెడీ.. నాన్నకు ప్రేమతో అంటున్న తారక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తండ్రి హరికృష్ణ నటించిన సీతయ్య చిత్ర సీక్వెల్ పై ఆసక్తిగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఆ మూవీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
- FB
- TW
- Linkdin
Follow Us

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అన్ని పాజిబుల్ వేస్ లో రాజమౌళి ఈ చిత్రానికి ప్రచారం కల్పిస్తున్నారు. ప్రస్తుతం చరణ్, తారక్, జక్కన్న ప్రమోషన్స్ కోసం ఇండియా మొత్తం చుట్టేస్తున్నారు.
తాజాగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కూడా భాగం అయ్యారు. ప్రశాంతంగా ఎన్టీఆర్, రాంచరణ్ లతో కూర్చున్న కీరవాణి.. వారిద్దరితో సరదాగా ముచ్చటిస్తూ ఆసక్తికర ప్రశ్నలు సంధించారు. మీకు ఇష్టమైన సాంగ్ ఏది, నచ్చని సాంగ్ ఏది ఇలాంటి ప్రశ్నలని కీరవాణి హీరోలిద్దరిని అడిగారు.
వీరిమధ్య చర్చ కొనసాగుతున్న క్రమంలో స్వర్గీయ నందమూరి హరికృష్ణ నటించిన సీతయ్య మూవీ సీక్వెల్ ప్రస్తావన వచ్చింది. కీరవాణి.. హరికృష్ణని గుర్తు చేసుకున్నారు. ఎప్పుడు కలిసినా స్వర బ్రహ్మ స్వర విష్ణు స్వర దేవో మహేశ్వరః అంటూ ఆప్యాయంగా పలకరించేవారు అని గుర్తు చేసుకున్నారు. హరికృష్ణ సీతయ్య చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.
తారక్ తో కీరవాణి మాట్లాడుతూ.. సీతయ్య సీక్వెల్ లో నువ్వు నటిస్తే బావుంటుంది అని అన్నారు. ఎందుకంటే అది పవర్ ఫుల్ ఇన్స్పెక్టర్ రోల్. మద్రాసులో సింహాద్రి రికార్డింగ్ జరుగుతున్న సమయంలో సీతయ్య చిత్రంలోని ఒక్కమగాడు సాంగ్ ని పాడుకుంటూ ఉండేవాళ్ళం అని కీరవాణి అన్నారు. దీనికి ఎన్టీఆర్ బదులిస్తూ.. మళ్ళీ మీరే మ్యూజిక్ ఇస్తానంటే సీతయ్య సీక్వెల్ కి తాను రెడీ అని సరదాగా తెలిపాడు.
అయితే అందులో ఒక డైలాగ్ ఖచ్చితంగా ఉండాలి. వినపడదు.. వినపడలేదు అనే డైలాగ్ ఉండాలి అని ఎన్టీఆర్ సీతయ్య చిత్రంపై తన ఇష్టాన్ని తెలియజేసాడు. పక్కనే ఉన్న రాంచరణ్.. అవును మోడరన్ టేక్ లో సీతయ్య సీక్వెల్ చేస్తే చాలా బావుంటుంది అని అన్నారు.
మరి నాన్నకు ప్రేమతో ఎన్టీఆర్ సీతయ్య సీక్వెల్ కి రెడీ అవుతాడో లేదో చూడాలి. ఇంటర్వ్యూలో మాత్రం వారి మధ్య జరిగింది సరదా సంభాషణ మాత్రమే. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన సీతయ్య చిత్రం 2003లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రంలో హరికృష్ణ సరసన దివంగత నటి సౌందర్య, కుర్రాళ్ళ కలల రాణి సిమ్రన్ నటించారు.