Jr NTR కు చాలా ఇష్టమైన ఫుడ్ ఐటమ్ ఏంటో తెలుసా..? ఆదివారం అస్సలు వదిలిపెట్టడట.
టాలీవుడ్ హీరోలలో మంచి భోజన ప్రిముడు ఎవరు అంటే ఎన్టీఆర్ పేరు ముందుగా వినిపిస్తుంది. ఫుడ్ విషయంలో ఏమాత్రం వెనకడుగు వేయని తారక్.. చాలా ఇష్టంగా తినే తినే ఫుడ్ ఐటమ్ ఏంటో తెలుసా..?
దేవర సక్సెస్ జోష్ లో ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. నెక్ట్స్ ఏ సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. ఇప్పటి వరకూ ఏ క్లారిటీ లేదు. కాని ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లో జాయిన్ అవుతున్నాడని మాత్రం సమాచారం. ఇది కాసేపు పక్కన పెడితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా కోసం చాలా కష్టపడతాడు. సిక్స్ ప్యాక్ చేయమన్నా చేస్తాడు.
Also Read: సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్న రజినీకాంత్..? సూపర్ స్టార్ నిర్ణయానికి కారణం ఏంటి..?
కాని ఇతర హీరోలలాగా డైటింగ్ లు చేసి కడుపు మాడ్చుకోవడం ఆయనకు అలవాటు లేదు. తనకు ఇష్టమైన ఫుడ్ లాగించేస్తుంటాడు. ఈ విషయం చాలా సార్లు చెప్పకొచ్చారు తారక్. హీరోగా కొంత మెయింటేన్ చేయాలి కాబట్టి కాస్త ఈమధ్య కంట్రోల్ లో ఉంచుకుంటున్నాడు కాని.. తారక్ మంచి భోజన ప్రియుడు ఆయన చాలా సందర్భాల్లో తన ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పుకొచ్చారు.
తనకు ఇష్టమైన ఫుడ్ ఏంటో చెపుతూనే ఎలా తింటాడు అనేది కూడా చెప్పారు. ఆయనకు ఇది ఇష్టమని చెప్పడం వేరు, అది ఎలా వండాలి...ఎలా తినాలో కూడా చెప్పడంలో తారక్ తరువాతే ఎవరైనా. ఇంతకీ ఎన్టీఆర్ కు చాలా అంటే చాలా ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా.. ఎన్టీఆర్ కు ఆయన తాతలాగే నాటుకోడి అంటే చాలా ఇష్టమట. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో తారక్ చెప్పాడు.
అయితే చికెన్ కర్రీలా తినడం కాదు, ఏకంగా కోడి మొత్తాన్ని తినడం ఇష్టమట. నాటుకోడిని క్లీన్ చేసి,ఆ కోడి మొత్తాన్ని కాల్చి, దానికి చుట్టూ కారం, అల్లం వెల్లుల్లి ముద్దని దట్టించి, కాసేపు అలా ఉంచి, దానికి కాస్త నెయ్యి, పెరుగు, పసుపు పట్టించి.. మంచి మంటమీద కాల్చి.. తందూరిలా చేసి.. రోటీతో తో తినడం చాలా ఇష్టమట. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో తారక్ వెళ్ళడించారు.
ఇక ఎన్టీఆర్ తాజాగా దేవర సినిమాతో అభిమానుల ముందుకు వచ్చాడు. సోలో హీరోగా దాదాపు 6 ఏళ్ళ తరువాత ఫ్యాన్స్ ముందుకు వచ్చిన ఎన్టీఆర్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ తో మూడేళ్ళ క్రితం ఆస్కార్ రేంజ్ కు వెళ్ళాడు. ఇక దేవర సినిమాతో రచ్చ రచ్చ చేశాడు ఎన్టీఆర్. ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 600 కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది.
కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాను ఎన్టీఆర్ అన్న ప్రముఖ హీరో కళ్యాణ్ రామ్ నిర్మించారు. ఇక ఈసినిమాలో జూనియర్ జతగా బాలీవుడ్ ముద్దు గుమ్మ జాన్వీ కపూర్ నటించి మెప్పించింది. అయతే ఆమె ఈసినిమాలో ఒక్క పాటలో తప్పించి. సినిమాలో పెద్దగా యాక్టింగ్ స్కోప్ లేదని చెప్పవచ్చు.
ఇక ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ తో కలిసి వార్2 సినిమాలో నటిస్తున్నాడు. ఈసినిమా తరువాత ఆయన ప్రశాంత్ నీల్ సినిమాలో జాయిన్ అవుతాడని సమాచారం.