MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Jr NTR: ఎన్టీఆర్ చేత కన్నీళ్లు పెట్టించిన సీన్ ఏదో తెలుసా? ఆ సినిమాలో శ్రీహరికి అంత అన్యాయం జరిగిందా?

Jr NTR: ఎన్టీఆర్ చేత కన్నీళ్లు పెట్టించిన సీన్ ఏదో తెలుసా? ఆ సినిమాలో శ్రీహరికి అంత అన్యాయం జరిగిందా?

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ హీరోగా ఎంత పేరు తెచ్చుకున్నాడో అందరికి తెలిసిందే. ఎటువంటి సన్నివేశం అయినా.. ఎంతో ధైర్యంగా చేసే తారక్.. ఒక్క సీన్ చూసి కన్నీరు పెట్టుకున్నారట. ఇంతకీ ఎంటా సీన్. ఎన్టీఆర్ ఎందుకు ఏడ్చాడు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 16 2026, 01:45 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌..
Image Credit : google

క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌..

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా నిలిచిన చిత్రం 'బృందావనం'. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కేవలం యాక్షన్ హీరోగానే కాకుండా, ఎన్టీఆర్ లోని అద్భుతమైన ఫ్యామిలీ సెంటిమెంట్ యాక్టింగ్‌ను ఈ సినిమా బయటకు తీసింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సమంత హీరోయిన్లుగా నటించగా, దివంగత నటుడు శ్రీహరి ఒక కీలకమైన పాత్రలో నటించి సినిమాకు ప్రాణం పోశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎన్టీఆర్ ను ఏడిపించిన సన్నీవేశం..
Image Credit : Asianet News

ఎన్టీఆర్ ను ఏడిపించిన సన్నీవేశం..

ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో హీరో ఎన్టీఆర్, దివంగత నటుడు శ్రీహరి సినిమా విశేషాలను, తమ అనుభవాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ బృందావనం సినిమాలో తనకు నచ్చిన బెస్ట్ సీన్ల గురించి మాట్లాడుతూ, రఘుబాబు, ఆహుతి ప్రసాద్, బ్రహ్మాజీ వంటి సీనియర్ నటులు చేసిన కామెడీ తో పాటు ఎమోషనల్ సీన్లు వన్ ఆఫ్ ది బెస్ట్ సీన్స్ అని కొనియాడారు సినిమా చూస్తున్నప్పుడు ఎన్నో సార్లు తాను ఎమోషనల్ అయి ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయని జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా వెల్లడించారు.

Related Articles

Related image1
Toilets: ఫారెన్ టాయిలెట్స్‌లో వాటర్ బదులు టిష్యూస్ ఎందుకు వాడతారో తెలుసా? అసలు కారణాలు ఇవే
Related image2
V R Raja: యూట్యూబర్ వీఆర్ రాజా నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా? సబ్ స్క్రైబర్స్, ఫాలోయింగ్ తెలిస్తే షాక్ అవుతారు
34
డైరెక్టర్ పై అలిగిన శ్రీహరి..
Image Credit : google

డైరెక్టర్ పై అలిగిన శ్రీహరి..

తాను చాలా ఎమోషనల్ వ్యక్తిని అని, అయితే దర్శకుడు వంశీ పైడిపల్లి తన పాత్ర ఎడిటింగ్‌లో ఒక చిన్న అన్యాయం చేశాడని శీహరి ఆ ఇంట్వ్యూలో సరదాగా వ్యాఖ్యానించారు సినిమాలో 'అన్న వచ్చిండే' అనే ఒక పవర్‌ఫుల్ షాట్‌ను కట్ చేయవద్దని తాను వంశీకి చెప్పినప్పటికీ, ఆ సీన్‌ను మూడు ముక్కలు చేశాడని. అయిన సరే ఆ ముక్కలను పారేయకుండా సినిమాలో పెట్టాడని శ్రీహరి అన్నారు. కానీ ఆ సీన్‌ను కట్ చేసినప్పటికీ, థియేటర్లలో ప్రేక్షకులనుండి వచ్చిన రెస్పాన్స్ మాత్రం అద్భుతంగా ఉందని శ్రీహరి ఆనందం వ్యక్తం చేశారు.

44
ఎవర్ గ్రీన్ సినిమా..
Image Credit : Asianet News

ఎవర్ గ్రీన్ సినిమా..

బృందావనంలో కట్ చేసిన ఆ ముక్కలకు కూడా అంతటి భారీ స్పందన రావడం విశేషమని, అందుకే ప్రేక్షకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఎన్టీఆర్, శ్రీహరి అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ,శ్రీహరి మధ్య వచ్చే సీన్లు, ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్స్ థియేటర్లలో ప్రేక్షకులకు కనువిందు చేశాయి. బృందావనం సినిమా ఇప్పటికీ టీవీల్లో వస్తే ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోవడానికి ఇలాంటి బలమైన పాత్రలు, నటీనటుల అద్భుతమైన నటనే కారణం.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Fauzi Release Date: పూనకాలు తెప్పించేలా ప్రభాస్‌ లుక్‌, ఫౌజీ రిలీజ్‌ డేట్‌.. ఏడాది గ్యాప్‌తో 3 సినిమాలు
Recommended image2
Stars Health: మానసిక ఆరోగ్యంపై మౌనం వీడిన సినిమా స్టార్స్ .. దీపికా, అలియా ఇంకా ఎవరు?
Recommended image3
Karna: 16 ఏళ్ళ పసి బాలుడి ఒళ్ళంతా బాణాలే, అలాంటి కర్ణుడు వీరుడు శూరుడా.. ఇది తెలిస్తే రక్తం మరుగుతుంది
Related Stories
Recommended image1
Toilets: ఫారెన్ టాయిలెట్స్‌లో వాటర్ బదులు టిష్యూస్ ఎందుకు వాడతారో తెలుసా? అసలు కారణాలు ఇవే
Recommended image2
V R Raja: యూట్యూబర్ వీఆర్ రాజా నెలకు ఎంత సంపాదిస్తాడో తెలుసా? సబ్ స్క్రైబర్స్, ఫాలోయింగ్ తెలిస్తే షాక్ అవుతారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved