MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అదుర్స్ మూవీ టైంలో జూ.ఎన్టీఆర్ ని సొంతవాళ్లే మోసం చేశారా ?..దాని విలువ ఇప్పుడు 1000 కోట్ల పైనే..

అదుర్స్ మూవీ టైంలో జూ.ఎన్టీఆర్ ని సొంతవాళ్లే మోసం చేశారా ?..దాని విలువ ఇప్పుడు 1000 కోట్ల పైనే..

ఏపీ రాజకీయాల్లో జూ. ఎన్టీఆర్ పేరు కూడా ముడిపడి ఉంటుంది. ఇప్పుడైతే తారక్ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు కానీ.. టిడిపిలో తరచుగా ఎన్టీఆర్ గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 13 2024, 12:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
NTR

NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో అదుర్స్ చిత్రం ఒకటి. ఎన్టీఆర్ డ్యూయెల్ రోల్ లో నటించిన ఆ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. ముఖ్యంగా చారి పాత్రలో ఎన్టీఆర్ నభూతో నభవిష్యతి అన్నట్లుగా వినోదం పండించాడు. 

 

26

ఆ చిత్రాన్ని నిర్మించింది ఎన్టీఆర్ స్నేహితులు, ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ. వివి వినాయక్ దర్శకత్వంలో ఆ చిత్రం తెరకెక్కింది. ఏపీ రాజకీయాల్లో జూ. ఎన్టీఆర్ పేరు కూడా ముడిపడి ఉంటుంది. ఇప్పుడైతే తారక్ రాజకీయాలకు దూరంగా ఉన్నాడు కానీ.. టిడిపిలో తరచుగా ఎన్టీఆర్ గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. 

 

36

ఆ పార్టీ నేతలో, అభిమానుల్లో తరచుగా తారక్ గురించి కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఎవరో సాధారణ కార్యకర్త కామెంట్స్ చేస్తే అంత ప్రాధాన్యత ఉండదు కానీ.. టిడిపిలో అత్యంత కీలక నేత చింతమనేని ప్రభాకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని, వల్లభనేని వంశీ గురించి చర్చ వచ్చింది. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ.. తారక్.. కొడాలి నాని, వంశీ ఎప్పుడో విడిపోయారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

 

46

దీనితో యాంకర్ గతంలో ఎన్టీఆర్.. కొడాలి నాని అడిగితే ప్రాణం అయినా ఇచ్చేస్తాను అని.. అంతటి స్నేహం ఉందని చెప్పిన వీడియో క్లిప్పింగ్ చూపించాడు. అవి గతంలో చేసిన వ్యాఖ్యలు అంటూ చింతమనేని కొట్టిపారేశారు. ఇప్పుడు వాళ్ళు కలసి లేరు. ఎందుకంటే ఎన్టీఆర్ ని వాళ్లిద్దరూ మోసం చేశారు అని చింతమనేని సంచలన ఆరోపణ చేశారు. ఈ విషయాన్ని నేను కొడాలి నాని, ఎన్టీఆర్ సన్నిహితుల ద్వారా తెలుసుకున్నా. 

 

56

అదుర్స్ మూవీ తర్వాత ఎన్టీఆర్ దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు నాని, వంశి తీసుకున్నారు. ఆ డబ్బుతో కోకాపేటలో 12 ఎకరాలు కొనిపెడతాం అని ఎన్టీఆర్ కి చెప్పారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కి ఆ డబ్బు లేదు.. కోకా పేటలో ల్యాండ్ లేదు. వాళ్లిద్దరూ మోసం చేశారు. ఇప్పుడు కోకాపేటలో ఎకరం 100 కోట్ల వరకు ఉంది కదా. 

 

66

ఆ లెక్కన 12 ఎకరాలు అంటే 1000 కోట్లపైనే ఉంటుంది కదా అని చింతమనేని అన్నారు. అది కనుక జరిగి ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ వేల కోట్లకి అధిపతి అని అన్నారు. చింతమనేని చేసిన ఈ వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కొందరు నెటిజన్లు ఇవి సాధారణంగా రాజకీయ నేతలు చేసే ఆరోపణలు మాత్రమే అని.. అందులో వాస్తవం ఉండే అవకాశం లేదని అంటున్నారు. ఎన్టీఆర్, కొడాలి నాని మధ్య ఫ్రెండ్ షిప్ అలాగే ఉందని అంటున్నారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
సాయి పల్లవి 4000 కోట్ల సినిమాలోకి.. హాలీవుడ్ డైరెక్టర్ ఎంట్రీ?
Recommended image2
Vijay: ఎన్నికల ప్రచారానికి గంట ప్రయాణం..విజయ్ ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?
Recommended image3
సినిమాల్లోకి రాక‌ముందు.. ఈ హీరోయిన్ల పేర్లు ఏంటో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved