విదేశాల్లో షూటింగ్, నేనొచ్చేవరకు బిడ్డని కనకు అంటూ భార్యకి ఎన్టీఆర్ వార్నింగ్.. లక్ష్మీ ప్రణతి అబద్దం చెప్పి
ఎన్టీఆర్ సినిమాలతో పాటు కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. తారక్ తరచుగా భార్య పిల్లలని తీసుకుని వెకేషన్ కి వెళుతుండటం చూస్తూనే ఉన్నాం. 2011లో జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి లకు వివాహం జరిగింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే ఈ చిత్రం వరల్డ్ వైడ్ 350 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ ఈ చిత్రంతో పదిలం చేసుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ కి దేవర చిత్రం రెండో మూవీ. గతంలో వీరిద్దరూ కాంబినేషన్ లో జనతా గ్యారేజ్ అనే చిత్రం వచ్చింది. ఆ మూవీ మంచి విజయం సాధించింది. ఇప్పుడు కొరటాల శివ ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించారు. మనిషికి బ్రతికేంత ధైర్యం ఉంటే చాలు.. చంపేంత ధైర్యం అక్కర్లేదు అనే పాయింట్ తో సముద్రం బ్యాక్ డ్రాప్ లో దేవర కథ రాసుకున్నారు.
ఎన్టీఆర్ సినిమాలతో పాటు కుటుంబానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. తారక్ తరచుగా భార్య పిల్లలని తీసుకుని వెకేషన్ కి వెళుతుండటం చూస్తూనే ఉన్నాం. 2011లో జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మి ప్రణతి లకు వివాహం జరిగింది. వీరికి అభయ్ రామ్, భార్గవ్ రామ్ ఇద్దరు పిల్లలు వీరికి సంతానం. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు 2014లో అభయ్ రామ్ మొదటి సంతానంగా జన్మించాడు. మొదటి బిడ్డ పుట్టేటప్పుడు ఎన్టీఆర్ టెన్షన్ అంతా ఇంతా కాదట.
ఆ సమయంలో రభస చిత్ర షూటింగ్ కూడా జరుగుతోంది. జీవితంలో మరచిపోలేని ఆసక్తికర సంఘటన చోటు చేసుకుందని తారక్ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ సమయంలో లక్ష్మీ ప్రణతి నిండు గర్భిణి. కాబట్టి ఎలాంటి సమస్య ఉన్నా హాస్పిటల్ కి రావాలని వైద్యులు తెలిపారు. నేను రభస మూవీ కోసం స్విట్జర్లాండ్ షూటింగ్ లో ఉన్నాను. ప్రతి రోజు భార్యతో ఎన్టీఆర్ వీడియో కాల్ మాట్లాడి ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకునేవాడట. ఒక రోజు ప్రణతి డల్ గా కనిపించింది.. నేను ఫారెన్ లో ఉన్నా.. నేను వచ్చే లోపు బిడ్డని కనకు.. చంపేస్తాను.. నాకు టెన్షన్ గా ఉంది అని సరదాగా చెప్పాడట. అలాంటిది ఏమి లేదు నేను బాగానే ఉన్నాను అని ఆమె సమాధానం ఇచ్చిందట.
నేను మరుసటి రోజు షూటింగ్ పూర్తి చేసుకుని స్విట్జర్లాండ్ నుంచి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాను. ల్యాండ్ అయి ఇంటికి ఫోన్ చేశాను. నేను హాస్పిటల్ కి వెళుతున్నా అని చెప్పింది. నా గుండె ఆగిపోయింది. హాస్పిటల్ కి ఏంటి అని అడిగితే.. లేదు లేదు నార్మల్ చెకప్ కోసమే అని అబద్దం చెప్పింది. తోడుగా మా అమ్మ కూడా ఉన్నారు. సరే హాస్పిటల్ కి వెళ్లు.. నేను ఇంటికి వెళ్లి వస్తాను అని చెప్పా.
Lakshmi Pranathi
ఇంటికి వెళ్లి కూర్చుని కాఫీ తాగుతున్నా.. మా అమ్మ ఫోన్ చేసింది. నార్మల్ చెకప్ అని చెప్పింది.. ఇప్పుడు మా అమ్మ ఫోన్ చేస్తోంది.. అసలేం అయిందో అర్థం కాక భయంతో నా ఒళ్ళు మొత్తం చల్లబడిపోయింది. ఏంటి అమ్మా అని అడిగితే.. డాక్టర్ గారు నీతో మాట్లాడతారు అని ఇచ్చింది. నాకు అర్థం అయిపోయింది..డాక్టర్ నేను వెంటనే రావాలా అని అడిగా. మీరు ఎంత త్వరగా వస్తే అంత బెటర్ అని చెప్పారు. వెంటనే వెళ్లాను. ఆపరేషన్ థియేటర్ లో చూశాను.. కాసేపటికి మా పెద్దబ్బాయి జన్మించాడు. కాస్త లేట్ అయి ఉన్నా.. దుబాయ్ లో ఫ్లైట్ లేట్ గా స్టార్ట్ అయి ఉన్నా డెలివరీ టైంకి నేను ఉండేవాడిని కాదు అని ఎన్టీఆర్ తెలిపారు.