- Home
- Entertainment
- ఆ సినిమా ఫ్లాప్ ఆస్తులన్నీ ఇచ్చేయబోయిన పవన్.. తమ్ముడి నిజ స్వరూపం బయటపెట్టిన నాగబాబు.. అందుకేనా ఇంత?
ఆ సినిమా ఫ్లాప్ ఆస్తులన్నీ ఇచ్చేయబోయిన పవన్.. తమ్ముడి నిజ స్వరూపం బయటపెట్టిన నాగబాబు.. అందుకేనా ఇంత?
పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఆసక్తికర విషయాలను, పలు రహస్యాలను బయటపెట్టాడు నాగబాబు. `జానీ` ఫ్లాప్ సమయంలో పవన్ చేసిన పని వెల్లడించారు.

Nagababu - Pawan Kalyan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపుతిప్పాడు. మొన్నటి వరకు ఆవేశపరుడు, అరుస్తాడు, ఇతను రాజకీయాల్లో ఎలా సక్సెస్ అవుతారనే విమర్శలు వచ్చాయి. రాజకీయ అవగాహన లేదన్నారు. మూడుపెళ్లిళ్లు అంటూ విమర్శించారు. వ్యక్తిగతంగా, రాజకీయంగా పవన్‌ని టార్గెట్ చేస్తూ ప్రత్యర్థి పార్టీల నాయకులు దారుణంగా కామెంట్ చేశారు. వాటికి ధీటుగా సమాధానం చెప్పాడు పవన్. ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పాడు. ప్రభుత్వ మార్పులో కీలక పాత్ర పోషించాడు.
Pawan Kalyan
ఇదిలా ఉంటే పవన్‌కి హీరోగానూ విపరీతమైన క్రేజ్ ఉంది. చాలా వరకు చెప్పే మాట పవన్‌కి మించిన క్రేజ్ ఇండస్ట్రీలో ఎవరికీ లేదని, అందులో నిజమెంతా అనేది పక్కన పెడితే డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పవన్ సినిమా వచ్చిందంటే థియేటర్లని షేక్ చేసే ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కనిపిస్తే చాలు ఊగిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. అంతటి క్రేజ్ పవన్ సొంతం.
Nagababu - Pawan Kalyan
అయితే ఇంతటి అభిమానం పట్ల మెగాఫ్యామిలీ కూడా ఆశ్చర్యపోతుంటారట. దీనిపై నాగాబాబు స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పవన్‌కి ధైర్యం ఎక్కువ. భయం అనేది తెలియదు, ఎవరికీ భయపడడు. అదే సమయంలో సేవా తత్వం. ఇప్పటి వరకే ఎన్నో దానాలు, సహాయాలు చేశాడు.అవన్నీ బయటకు రావు, చాలా సైలెంట్‌గా హెల్ప్ చేస్తాడు. బయటకు చెప్పాలనుకోడు. అదే అతనిలో ఉన్న గొప్ప లక్షణం. ఎంతో పెద్ద స్టార్స్ ఉన్నా, ఇంతటి క్రేజ్ పవన్‌కి ఉండటానికి కారణం ఆ సేవ తత్వమే, ఫిల్టర్ లేని ఆ మనస్తత్వమే అని తాను భావిస్తానని తెలిపారు నాగబాబు.
Nagababu - Niharika
అతని హీరోయిజం, యాక్టింగ్ చూసి ఇంత ఫ్యాన్స్ అయ్యారని తాను నమ్మను అని, తన మనస్తత్వం, మంచితనమే ఈ క్రేజ్‌కి, ఫాలోయింగ్ కి కారణమని చెప్పాడు నాగబాబు. మరోసందర్భంగా నాగబాబు మరో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. `జానీ` సినిమా ఫ్లాప్ సమయంలో తాను చేసిన బయటపెట్టాడు నాగబాబు. ఆ సినిమా పరాజయం చెందితే తన కోటిన్నర పారితోషికం బయ్యర్లకి రిటర్న్ ఇచ్చేశాడట. అంతేకాదు తన ఫామ్ హౌజ్ కూడా ఇచ్చేయబోయాడట.
ఎంతో ఇష్టంగా కొనుకున్న ఎనిమిది ఎకరాల ఫామ్ హౌజ్‌ని కూడా ఆ సమయంలో నష్టపోయిన వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు పవన్. విషయం తెలిసి తానే ఆపానని, ఎంతో ఇష్టంగా కొనుకున్నావ్, వ్యవసాయం చేయాలనుకున్నావ్, ఇదొక్కటి ఉంచు రా అని బలవంతంగా ఆపితే ఆగాడట పవన్. లేదంటే అది కూడా అమ్మేసేవాడట. ఇప్పుడు అదొక్కటే పవన్ కి ఉన్న ఆస్తి అని చెప్పారు నాగబాబు. దాని వ్యాల్యూ పెరిగే అదే తప్ప మరేది లేదన్నారు.
ఫిక్స్ డ్ గా ఉన్న వాటిలో ఈ ఎనిమిది ఎకరాల ల్యాండ్, ఒక ఇళ్లు ఉందట. దీంతోపాటు మరో ఇళ్లు ఉందని, అది లోన్‌లో ఉందని తెలిపాడు నాగబాబు. కార్లు కూడా లోన్‌లోనే ఉన్నాయని, ఇలా తనకు వచ్చిన డబ్బులు ఇచ్చేస్తుంటాడని, తాను ఏమీ ఉంచుకోడని తెలిపాడు నాగబాబు. ఆస్తులు కూడబెట్టుకునే మనస్తత్వం తనది కాదని, అది ఎందుకు అంటే చెప్పలేమన్నాడు నాగబాబు. రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు. అయితే ప్రస్తుతం పవన్ బంపర్ మెజారిటీతో విజయం సాధించడంతో నాగబాబు సంతోషానికి అవదుల్లేవ్.