- Home
- Entertainment
- యాంకర్ ఝాన్సీతో విడాకులు, మమ్మల్ని కలిపేందుకు చిరంజీవి ఎంతో ప్రయత్నించారు.. జోగి నాయుడు ఎమోషనల్
యాంకర్ ఝాన్సీతో విడాకులు, మమ్మల్ని కలిపేందుకు చిరంజీవి ఎంతో ప్రయత్నించారు.. జోగి నాయుడు ఎమోషనల్
నటుడు, వైసిపి మద్దతు దారుడు, ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ హెడ్ గా ఉన్న జోగి నాయుడు తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితాన్ని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

jogi naidu marraige
నటుడు, వైసిపి మద్దతు దారుడు, ఏపీ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్ హెడ్ గా ఉన్న జోగి నాయుడు తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితాన్ని గుర్తు చేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ప్రముఖ యాంకర్, నటి ఝాన్సీ జోగి నాయుడు మాజీ భార్య అనే సంగతి తెలిసిందే. గతంలో ప్రేమించి వివాహం చేసుకున్న వీరిద్దరూ విభేదాల కారణంగా విడిపోయారు.
అనంతరం జోగి నాయుడు రెండవ వివాహం చేసుకున్నారు. జోగి నాయుడు, యాంకర్ ఝాన్సీకి ధన్య అనే కుమార్తె ఉంది. జోగి నాయుడు టాలీవుడ్ లో ఎక్కువగా సుకుమార్ చిత్రాల్లో కనిపిస్తుంటారు. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా జోగి నాయుడు కొనసాగుతూ రాజకీయాల్లో వైసిపి మద్దతు దారుడిగా మారారు.
ఇదిలా ఉండగా జోగి నాయుడు.. తాజా ఇంటర్వ్యూలో ఝాన్సీతో విడాకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు ఝాన్సీ కాలేజీ స్టూడెంట్. అప్పటి మా ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఆ క్షణాలు మా ఇద్దరి మధ్య ఎంతో మధురమైనవి. వివాహం తర్వాత సినిమాల్లో ఇద్దరికీ మంచి గుర్తింపు లభించింది.
అప్పుడే మా ఇద్దరి మధ్య విభేదాలు కూడా మొదలయ్యాయి. విభేదాలు మొదలైన ఏడాదికే విడిపోయాం అని జోగినాయుడు తెలిపారు. ఝాన్సీ, జోగి నాయుడు 2014లో విడాకులు తీసుకున్నారు. అనంతరం 2018లో జోగి నాయుడు రెండవ వివాహం చేసుకున్నారు.
ఝాన్సీతో కలసి ఉండాలని ఎంతో ప్రయత్నించాను. కానీ కుదర్లేదు. కొన్నేళ్ల పాటు ఆ బాధ నన్ను వెంటాడింది. మేమిద్దరం కలిసుండాలని బ్రహ్మానందం గారు ఒక తండ్రి స్థానంలో ఉండి కోరుకున్నారు. మమల్ని కలిపేందుకు ఎంతో ప్రయత్నించారు. చిరంజీవి గారు అయితే మూడు గంటలపాటు మమల్ని కూర్చోబెట్టి మాట్లాడారు. అవేమీ వర్కౌట్ కాలేదు. మా ఇద్దరి బంధం అంతవరకు మాత్రమే రాసిందేమో అని జోగినాయుడు అన్నారు.
మా అమ్మా నాన్నలు బలవంతం చేయడంతో రెండవ వివాహం చేసుకున్నా. నా కుమార్తె ధన్యని చూడలేకపోతున్నానని రోజు భాదపడుతుంటా. నాకు దూరంగా ఝాన్సీ నా కుమార్తె ని పెంచుతోంది. రెండవ వివాహంతో దేవుడు నాకు మరో ఇద్దరు కుమార్తెలని ఇచ్చారు. దీనితో కొంతవరకైనా ఆ బాధని మరచిపోగలుగుతున్నా అంటూ జోగి నాయుడు ఎమోషనల్ అయ్యారు.