- Home
- Entertainment
- Janaki Kalaganaledu: పిల్లల విషయంలో జానకిని దూరం పెడుతున్న రామ.. మళ్లీ కుట్ర చేసిన మల్లిక!
Janaki Kalaganaledu: పిల్లల విషయంలో జానకిని దూరం పెడుతున్న రామ.. మళ్లీ కుట్ర చేసిన మల్లిక!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జూన్ 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలోనే తమ గదిలో ఉన్న జానకి రామ (Rama)తో ఒంటరి సమయాన్ని గడపడానికి ప్రయత్నిస్తుంది. ఇక వీరు ఏం చేస్తున్నారా అని మల్లిక పక్కన ఉండి వింటో ఉంటుంది. ఇక జానకి (Janaki) రామతో రొమాంటిక్ గా మాట్లాడుతూ దగ్గరికి వెళ్తుంది. ఆసమయంలో రామ కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాడు.
ఆ తర్వాత వీరిద్దరూ దగ్గరవుతున్న సమయంలో.. మల్లిక (Mallika) అది గమనించుకొని వీరికి బిడ్డ పుడితే ఆస్తి మొత్తం పోతుందన్న ఉద్దేశంతో వారిని డిస్టర్బ్ చేస్తుంది. దాంతో రామ (Rama) ఉలిక్కిపడి జానకిని దూరం పెడతాడు. జానకి బాధపడుతూ నా లక్ష్యం కోసం తన ఇష్టాలను దూరంగా పెడుతున్నాడు అని బాధపడుతుంది.
ఇక వారి ఏకాంతాన్ని చెడగొట్టినందుకు మల్లిక (Mallika) సంతోషంగా అరటిపండ్లు తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. విష్ణు కు కూడా తాను డిస్టర్బ్ చేసిన విషయాన్ని చెప్పటంతో నీకెందుకంత కుళ్ళు అని విష్ణు జానకి (Janaki) పై అరుస్తాడు. ఆ తర్వాత జానకి బాగా సిగ్గుపడుతూ అరటి తొక్క మీద కాలు వేసి దారి పడుతుంది.
ఇక మరుసటి రోజు ఉదయం గోవిందరాజు (Govindha Raju) దంపతులు ఏరువాక పూర్ణిమ సందర్భంగా ఇంట్లో వాళ్లందర్నీ పొలం దగ్గరికి తీసుకొని వెళ్లడానికి ప్లాన్ చేస్తారు. ఇక అందరూ పొలం దగ్గరికి వెళ్లడానికి ఇష్టపడితే మల్లిక (Mallika) మాత్రం అక్కడికి వెళ్లి మట్టిలో పనిచేయాలా అని కష్టంగా అనుకుంటుంది.
ఆ తర్వాత అందరూ కలిసి పొలం దగ్గరకు బయలుదేరుతూ ఉండగా.. జానకి (Janaki), రామచంద్ర వాళ్ళు బైక్ మీద సరదాగా వస్తుంటారు. ఇక రామచంద్ర (Rama Chandra) బైకు నడుపుతూ జానకి చదువుకి ప్రతిరోజు ఏదో ఒక అడ్డు వస్తుంది అని బాధపడుతుంటాడు.
ఇక మల్లిక (Mallika) జానకి చేతిలో ఉన్న విత్తనాలను పడేయాలి అని కాళ్లు అడ్డుపెట్టగా జానకి (Janaki) వెళ్లి అక్కడున్న గునపంపై పడబోతుంది. అప్పుడే రామ వచ్చి కాపాడటంతో జానకి ఆ ప్రమాదం నుండి బయటపడుతుంది. ఇక మల్లిక అమ్మో ఇలాంటి తప్పు చెయ్యొద్దు అని అనుకుంటుంది.
ఇక ఆ తర్వాత అందరూ పొలం దగ్గరికి వెళ్లి పూజ ఏర్పాట్ల కోసం పనులు చేస్తూ ఉంటారు. మల్లిక (Mallika) మాత్రం ఏ పని చేయకుండా ఉండటంతో గోవిందరాజులు వచ్చే సెటైర్లు వేస్తూ ఉంటాడు. ఆ తర్వాత అందరు కలిసి పొలం పనులు ప్రారంభిస్తుండగా జానకి (Janaki) , మల్లిక విత్తనాలు చల్లుతూ ఉంటారు.