- Home
- Entertainment
- Janaki kalagana ledu: ఆ విషయంలో దొరికిపోయిన జానకి.. మల్లికకు చుక్కలు చూపించిన జ్ఞానాంబ!
Janaki kalagana ledu: ఆ విషయంలో దొరికిపోయిన జానకి.. మల్లికకు చుక్కలు చూపించిన జ్ఞానాంబ!
Janaki kalagana ledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki kalagana ledu ) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

రామచంద్ర మీ చూపులు నా గుండెల్లో మంటలు పుట్టిస్తున్నాయి అంటూ రొమాంటిక్ గా జానకి (Janaki) తో అంటాడు. ఆ తర్వాత జానకి (Janaki) ను పిండివంటలు చేయకుండా రామచంద్ర ఆటపట్టిస్తునందుకు జానకి, రామచంద్ర ను ఫన్నీగా బయటకు పంపుతుంది. ఇక జానకి బయటకు వచ్చిన తర్వాత రామచంద్ర (Rama chandra) కిందపడి నట్టు నటించి జానకిని నవ్విస్తాడు.
మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి అదే మీరు భర్త ఇచ్చే గొప్ప బహుమతి అని అంటాడు. ఆ తర్వాత మల్లిక (Mallika) , వెన్నెల ను వాళ్ల అక్క దగ్గరికి తీసుకుని వెళ్లి అత్తయ్య మీరు సంబంధం ఓకే చేశారు. కానీ ఈ పెళ్లి వెన్నెలకు ఇష్టమో కాదో అని అడిగారా అని అంటుంది. దాంతో వెన్నెల ఈ పెళ్లి నాకు ఇష్టమే అని చెబుతుంది.
ఇక వెన్నెల (Vennela) జ్ఞానాంబ దగ్గర ఇరుక్కు పోతుంది. ఆ తర్వాత జానకి (Janaki) కేకులని పూర్తి చేసి పార్సల్ చేసి ఆ ఆర్డర్ చేసిన వ్యక్తి ఇచ్చేస్తుంది. దాంతో ఆ వ్యక్తి జానకి ఎంతో పొగుడుతూ ప్రశంసిస్తాడు. దానికి జ్ఞానాంబ కూడా ఎంతో ఆనంద పడుతుంది. అదే క్రమంలో జ్ఞానాంబ (Jnanaamba) ' వెన్నెల కోసం నువ్వు చూసిన సంబంధం అత్తయ్య గారికి నచ్చిందట' అని జానకితో అంటుంది.
ఆ క్రమంలో ముగ్గురు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తారు.ఆ తరువాత జానకి (Janaki) మీరు నా పక్కన ఉంటే చాలు ఏదైనా చేసెయ్య గలను అని రామ చంద్ర తో ఆనందంగా అంటుంది. ఇక రామచంద్ర (Rama chandra) కూడా నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా చేస్తాను అని ఆనందంగా అంటాడు.
ఆ తరువాత జానకి (Janaki) , రామచంద్ర లు పెళ్ళికి వెళ్తాము అని చెప్పి ఇంటినుంచి బైటకు వెళతారు. కానీ ఆ పెళ్ళికి రామ చంద్ర మాత్రమే వెళతాడు. ఇక ఆ పెళ్ళికి రామ చంద్ర ఒక్కడే వచ్చిన విషయం ఆ పెళ్ళికి వెళ్లిన ఒక ఆమె జ్ఞానాంబ (jnanamba)కు చెబుతుంది. ఇక ఈ క్రమంలో రెపటి భాగంలో ఎం జాఫుగుతుందొ చూడాలి.