- Home
- Entertainment
- Janaki Kalaganaledu: వంటల పోటీల్లో రామచంద్రకు అవమానం.. టీవీ లైవ్ చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న జ్ఞానంబ!
Janaki Kalaganaledu: వంటల పోటీల్లో రామచంద్రకు అవమానం.. టీవీ లైవ్ చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న జ్ఞానంబ!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జూన్ 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే వేదిక మీద ఉన్న వారు రామచంద్ర (Rama Chandra) ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి చెప్పమంటారు. ఇక అది ఏంటో అర్థం కాక రామచంద్ర తడబడుతూ ఉంటాడు. ఇక చుట్టుపక్కల జనం తనకు ఇంగ్లీష్ రాదేమో అంటూ వేళాకోళం చేస్తూ ఉంటారు. ఇదంతా ఇంట్లో జ్ఞానాంబ (Jnanamba) టీవీలో చూస్తూ ఉంటుంది.
ఇక రామచంద్ర (Rama Chandra) నేను ఆరో తరగతి చదువుకున్నాను అని చెబుతాడు. అంటే నువ్వు వంటల గురించి ఏం చదువుకోలేదా అని వేదిక మీద ఉన్న వ్యక్తి అవమాన పరుస్తాడు. ఇక్కడకు అందరూ చెఫ్ లో డిగ్రీలు పొందిన వాళ్లు వస్తారు అని అంటాడు. ఈ మాటలు విన్న జ్ఞానాంబ (Jnanamba) అసహనం వ్యక్తం చేస్తుంది.
ఇక రామచంద్ర (Rama Chandra) నాకు వంటల్లో అమ్మే నా గురువు అని అంటాడు. అంతేకాకా అమ్మ గురించి చాలా గొప్పగా చెబుతాడు. ఇక అక్కడ ఉన్న వాళ్ళు అందరూ రామచంద్ర మాటలకు కరిగిపోయి క్లాప్స్ కొడతారు. రామచంద్ర వంటల పోటీల్లో భయపడుతూ ఉండగా జానకి (Janaki) తనను ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తుంది.
ఇక చెఫ్ కాంపిటేషన్ డైరెక్ట్ చేసే వాళ్ళు కాంపిటీషన్ లో పాల్గొనే వాళ్ళకి వాళ్ళు మనిషికి ఒక వెయ్యి రూపాయలు అందచేస్తారు. అంతేకాకుండా డబ్బులతో వంటకు కావలసిన వస్తువులన్నీ షాపింగ్ చేసుకుని రమ్మంటారు. దాంతో రామచంద్ర (Rama Chandra)hటెన్షన్ పడుతూ ఉండగా.. జానకి (Janaki) ఆల్ ది బెస్ట్ చెప్పి ధైర్యం చెబుతుంది.
ఇక రామచంద్ర (Rama Chandra) స్వయంగా కిరణా షాప్ కి వెళతాడు. అక్కడ ఒక వ్యక్తి మా అమ్మను హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాలి సార్ కొంత డబ్బు సహాయం చేయండి అని అడుగుతాడు. రామచంద్ర (Ramachandra) కు సహాయం చేయాలని ఉన్నా.. కానీ అతని చేతిలో వెయ్యి రూపాయలు మాత్రమే ఉంటాయి.
ఇక రామచంద్ర (Rama Chandra) సరుకులు మొత్తం కొనుగోలు చేసి 800 బిల్లు చేస్తాడు. మరి తరువాయి భాగం లో కాంపిటేషన్ కు చీఫ్ గెస్ట్ లు వస్తారు. కానీ రామచంద్ర ఏ మాత్రం తడబడకుండా నాకు మా అమ్మ దీవెనలు ఉన్నాయి అని తన తల్లి జ్ఞానాంబ (Jnanamba) ను తలుచుకుంటాడు. ఇక ఈ క్రమంలో రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.