- Home
- Entertainment
- Sukumar Wife: సుకుమార్ భార్యగా గర్వంతో ఉప్పొంగుతున్నా.. రాంచరణ్, సుక్కు మూవీ కథపై అంచనాలు పెంచేసిన తబిత
Sukumar Wife: సుకుమార్ భార్యగా గర్వంతో ఉప్పొంగుతున్నా.. రాంచరణ్, సుక్కు మూవీ కథపై అంచనాలు పెంచేసిన తబిత
సుకుమార్ భార్య తబిత రాంచరణ్ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుకుమార్, చరణ్ కాంబోలో ఆర్సీ 17 చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ గురించి రోజుకొక ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.

రాంచరణ్
పెద్ది చిత్రంలో రాంచరణ్ నటనకు ప్రశంసలు దక్కాయి. కానీ ఆ సినిమా రాంచరణ్ స్థాయికి కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కాలేదు. ఈ నేపథ్యంలో రాంచరణ్ తదుపరి చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. రాంచరణ్ నెక్స్ట్ మూవీ సుకుమార్ దర్శకత్వంలో ఉండబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వచ్చిన రంగస్థలం చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
సుకుమార్ భార్య కామెంట్స్
రాంచరణ్, సుకుమార్ కాంబోలో తెరకెక్కబోతున్న RC17 మూవీపై సుకుమార్ భార్య తబిత సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుకుమార్ భార్యగా RC17 ప్రాజెక్ట్ ని చూసి ఎంతో గర్వపడుతున్నా, ఎగ్జైట్ అవుతున్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో సుకుమార్ హార్డ్ వర్క్, లెక్కలేనన్ని గంటల గడపడం నాకు తెలుసు. ఇప్పుడు అన్నీ కలసి ఈ ప్రాజెక్ట్ ని స్పెషల్ గా మార్చేశాయి.
సుక్కు హార్డ్ వర్క్
సూపర్ హిట్ కాంబినేషన్ మళ్ళీ తిరిగి వస్తోంది. ఈసారి మరింత భారీ అంచనాలతో అంటూ తబిత పోస్ట్ చేశారు. దీనితో తబిత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్క్రిప్ట్ విషయంలో సుకుమార్ హార్డ్ వర్క్ గురించి చెప్పడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.
హీరోయిన్ ఎవరు ?
RC17 గురించి రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందుగా ఈ మూవీలో ధురంధర్ ఫేమ్ సారా అర్జున్ హీరోయిన్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాలో ఓ తెలుగు నటిని హీరోయిన్ గా సుకుమార్ ఫిక్స్ చేశారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఆమె ఎవరో కాదు స్వాతిక వీరవల్లి. తెలుగు అమ్మాయి అయిన ఆమె ఫారెన్ లో సెటిల్ అయింది. సినిమాలపై ఆసక్తితో తిరిగి ఇండియాకు వచ్చింది. స్వాతిక మంచి డ్యాన్సర్. ప్రస్తుతం ఆమె దుల్కర్ సల్మాన్ ఆకాశంతో ఒక తార చిత్రంలో నటిస్తోంది.
మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ?
సుకుమార్ తొలిసారి తన మ్యూజిక్ కంబోని కూడా బ్రేక్ చేస్తున్నారు. సుకుమార్ సినిమా అంటే దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఉండాల్సిందే. ఈ సినిమాకు దేవిశ్రీ సంగీత దర్శకుడిగా పని చేయడం లేదు. అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉండబోతున్నట్లు టాక్.





