MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki kalaganaledu: జెస్సి దగ్గర మళ్లీ బుద్ది చూపించిన అఖిల్.. జానకి కోసం కష్టపడుతున్న రామ!

Janaki kalaganaledu: జెస్సి దగ్గర మళ్లీ బుద్ది చూపించిన అఖిల్.. జానకి కోసం కష్టపడుతున్న రామ!

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 4వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Oct 04 2022, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..జ్ఞానాంబ ఇంట్లో వాళ్ళందరూ పూజ చేసుకుంటూ ఉండగా జానకి,రామలు అక్కడికి వస్తారు.అప్పుడు రామా సంతోషంగా, జానకి గారు ఈరోజు పరీక్ష బాగా రాసారట. పూర్తిగా మార్కులు వచ్చేసాయట.ఇలాగే ప్రతిపరీక్ష ఇలాగే రాస్తే ఖచ్చితంగా పోలీస్ అయిపోతారు అని ప్రిన్సిపల్ గారు చెప్పారు ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళందరూ చాలా ఆనందపడి జానకికి శుభాకాంక్షలు చెప్తారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అప్పుడు మల్లిక కి లోపల ఎంత మండిపోతున్నా సరే బయటికి చాలా నవ్వుతూ మేనేజ్ చేస్తూ ఉంటుంది.అప్పుడు జ్ఞానాంబ జానకి ని దగ్గరికి తీసుకొని, నిన్ను,రామా ని చూస్తే చాలా గర్వంగా ఉన్నదమ్మా. ఇంటి బాధ్యతలు మాత్రమే కాకుండా,సొంత కలలు కోసం తపనపడుతున్నారు.  కొన్ని మందున్నారు ఎందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు అని జెస్సీ వైపు చూస్తూ, ఇంకొన్ని మంది వాళ్ళ జీవితాలు సరిదిద్దుకుందాం అని చూడకుండా వాళ్లతోపాటు ఆడదాని జీవితం కూడా నాశనం చేసేస్తారు అని అఖిల్ ని చూస్తూ అంటుంది జ్ఞానాంబ.
 

37

అఖిల్ కి కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. జెస్సి బాధపడుతూ ఉంటుంది. అప్పుడు అఖిల్ బయటకు వచ్చిన తర్వాత, ఇంట్లో నన్ను ఎంత బాగా చూసుకునేవారు ఇప్పుడు నన్ను ఇన్ని మాటలంటున్నారంటే అది ఆ జెస్సి వాళ్లే అని జెస్సీ మీద కోపం చూపిస్తాడు. ఇంతలో జెస్సి బయటకు వచ్చి అఖిల్ భుజం మీద తన తలపెట్టి,అత్తయ్య గారు మనసు వెన్న.ఇది నాకన్నా బాగా నీకు తెలుసు కదా త్వరలోనే మారుతారులే అని చెప్తుంది. అప్పుడు అఖిల్ అక్కడి నుంచి లెగిసి, ఇదంతా నీ వల్లే వచ్చింది!నన్ను ఇంట్లో రాజకుమారుగా చూసుకునేవారు.
 

47

 అప్పటికీ చెప్పాను అబార్షన్ చేసుకోమని నువ్వు వినకుండా వదిన సహాయం తీసుకొని నన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నావు.ఇదంతా నీ వల్లే వచ్చింది అని అంటాడు, దానికి జెస్సి బాధపడుతుంది. ఆ తర్వాత రాత్రికి జానకి పడుకున్నప్పుడు హాల్లో లైట్లు వెలిగి ఉంటాయి.అక్కడ రామ ఉంటాడు. ఏం చేస్తున్నారు రామ గారు అని జానకి అనగా, మీ పరీక్షలు అయ్యేంతవరకు నేనేం చేయాలో మిమ్మల్ని ఎలాగా చదువుపించాలో అన్ని రాసుకుంటున్నాను జానకి గారు అని రామా అంటాడు.జానకి నవ్వి ఇప్పుడు నేను బానే చదువుతున్నాను కదా.
 

57

 అత్తయ్య గారు మళ్ళీ నా మీద శ్రద్ధతో స్వీట్ షాప్ ని మర్చిపోతున్నారు అని బాధపడతారు అని అనగా అమ్మ ఏమి అలా అనుకోదు,నాకు, మీ గురించి చూసుకోమని చెప్పింది అని అంటాడు రామా. అప్పుడు రామా సరే రేపటి నుంచి మొదలుపెడదాము ప్రస్తుతానికి వెళ్లి పడుకోండి అని జానకిని ఎత్తుకొని వెళ్లి గదిలో పడుకోబెడతాడు. ఆ తర్వాత రోజు ఉదయం జ్ఞానాంబ పూల దండ కడుతూ ఉండగా గోవిందరాజు అక్కడికి వచ్చి, ప్రతి సంవత్సరం మనం బొమ్మల కొలువు పెడతాం కదా ఇప్పుడు పెట్టడం లేదా అని అనగా, మొన్న జరిగినది చాలాదా అండి.
 

67

అప్పుడే ముత్తైదువులందరూ దగ్గర మాట పడాల్సి వచ్చింది ఇప్పుడు మళ్లీ అది జరగడం నాకు ఇష్టం లేదు అని అంటుంది. అప్పుడు జానకి,అత్తయ్య గారు ఈ సంవత్సరం మనం బొమ్మల కొలువు చేయాలి. ఎందుకంటే మన కుటుంబంలో ఇప్పుడు ఇద్దరు కడుపుతో ఉన్నారు. వాళ్ళ మంచి కోసమైనా చేయాలి ఈ ఒక్కసారికి ఒప్పుకోండి. మళ్లీ ఎలాంటి గొడవ రాకుండా నేను చూస్తాను అని అంటుంది.నువ్వు చెప్తున్నావు కనుక ఒప్పుకుంటున్నాను అని అంటుంది జ్ఞనాంబ. నేను పిల్లలందరినీ వెళ్లి పిలుస్తాను అని జానకి అంటుంది.
 

77

 అప్పుడు మల్లిక, పిల్లల్ని పిలుస్తాదా ఈ సమయాన్ని నేను బాగా వాడుకోవాలి. అయినా జానకి ఏం చెప్తున్నా పోలేరమ్మ ఒప్పుకుంటుంది అంటే ఇంట్లో నాకన్నా దాని విలువ పెరిగిపోతుంది. ఎలాగైనా నేను అడ్డుకోవాలి అని అనుకోని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మల్లిక. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Anushka Shetty: డైరెక్టర్ ఆ మాట అన్నాడని హోటల్ నుంచి నేరుగా జిమ్ కి వెళ్లిన అనుష్క..దెబ్బకు నయనతార అవుట్
Recommended image2
Vishnupriya: ఓపెన్ గా చెప్పేసిన విష్ణుప్రియ, నా బాడీ కౌంట్ 5.. దారుణంగా ట్రోలింగ్
Recommended image3
Ram Charan: సూపర్‌స్టార్‌ కృష్ణ రిజెక్ట్ చేసిన మూవీతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన రామ్‌ చరణ్‌.. ఆ సినిమా ఏంటో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved