కళ్ళ ముందు హీరో రాజశేఖర్ కారు యాక్సిడెంట్.. సంక్రాంతి ఈవెంట్ లో ఏడ్చేసిన జీవిత
హీరో రాజశేఖర్, జీవిత దంపతులు టాలీవుడ్ లో స్టార్ కపుల్ గా ఉన్నారు. ఇప్పటికి రాజశేఖర్ హీరోగా రాణిస్తూ సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా రాజశేఖర్ నితిన్ ఎక్స్ట్రా చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే.

హీరో రాజశేఖర్, జీవిత దంపతులు టాలీవుడ్ లో స్టార్ కపుల్ గా ఉన్నారు. ఇప్పటికి రాజశేఖర్ హీరోగా రాణిస్తూ సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గా రాజశేఖర్ నితిన్ ఎక్స్ట్రా చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జీవిత రాజశేఖర్ కుమార్తెలు శివాని, శివాత్మిక కూడా హీరోయిన్లుగా రాణిస్తున్నారు.
తాజాగా జీవిత జీవిత, రాజశేఖర్ ఇద్దరూ ఓ ఛానల్ లో ప్రసారం అయ్యే సంక్రాంతి ఈవెంట్ కి హాజరయ్యారు. పండగ అంటే ఇట్టా ఉండాల అనే ఈవెంట్ లో వీరిద్దరూ పాల్గొన్నారు. ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయింది. యాంకర్ రవి, జీవిత రాజశేఖర్ ఇతర సభ్యలు కలసి చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
ఈ ప్రోమోలో జీవిత రాజశేఖర్ బంధంపై ఇతర సభ్యులు చాలా సరదాగా కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో ఎంత మంది అందగత్తెలు ఉన్నా రాజశేఖర్ మాత్రం జీవితనే ప్రేమిస్తారు అని ఓ వ్యక్తి అన్నారు. యాంకర్ రవి స్పందిస్తూ.. ఎందుకంటే అందరికంటే అందగత్తె జీవిత గారే అని సమాధానం ఇచ్చాడు. దీనితో జీవిత పగలబడి నవ్వుకున్నారు.
జీవిత గారు రాజశేఖర్ గారిని ఎక్కువ ప్రేమిస్తారా లేక రాజశేఖర్ గారు జీవిత గారిని ఎక్కువ ప్రేమిస్తారా అంటూ యాంకర్ రవి ఇరకాటంలో పెట్టారు. రాజశేఖర్ మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా.. నేనే ఎక్కువ ప్రేమిస్తున్నా అని ఇప్పుడే నిరూపిస్తా అంటూ రాజశేఖర్ ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆటపాటలతో ఈ షోలో జీవిత, రాజశేఖర్ చాలా హంగామా చేశారు. వేదికపై జీవిత, రాజశేఖర్ రొమాంటిక్ డ్యాన్స్ చేశారు.
వర్షిణితో కలసి రాజశేఖర్ చేసిన రొమాంటిక్ డ్యాన్స్ కూడా ఆకట్టుకుంది. జీవిత మాట్లాడుతూ రాజశేఖర్ గారు హీరోయిన్లతో రొమాన్స్ చేయాలంటే చాలా అన్ కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు అని తెలిపింది. ఆ తర్వాత కొందరు ఆర్టిస్టులు వేదికపై జీవిత రాజశేఖర్ ప్రేమ కథని, రియల్ లైఫ్ ని రిక్రియెట్ చేస్తూ పెర్ఫామ్ చేశారు. వాళ్ళిద్దరికీ పరిచయం ఎలా జరిగింది ? ఎలా ప్రేమికులు గా అయ్యారు? వారి ప్రేమకు వచ్చిన అడ్డంకులు ఏంటి ? ఆ తర్వాత భార్య భర్తలుగా ఎంత అన్యోన్యంగా ఉన్నారు అనే విషయాలని చూపించారు.
రాజశేఖర్ ఆ మధ్యన కారు ప్రమాదానికి గురయ్యారు. రింగ్ రోడ్డులో రాజశేఖర్ కారు యాక్సిడెంట్ జరిగింది. కానీ ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో రాజశేఖర్ చిన్న చిన్న చిన్న గాయాలతో బయట పడ్డారు. బెంజ్ కారు మాత్రం నుజ్జు నుజ్జు అయింది. ఆ సన్నివేశాన్ని కూడా రిక్రియెట్ చేశారు.కళ్ళముందే తన భర్త యాక్సిడెంట్ సీన్ చూపించడంతో జీవిత తట్టుకోలేకపోయింది. దీనితో జీవిత ఆ సీన్ చూస్తూ వెంటనే ఎమోషనల్ గా ఏడ్చేసింది. ఆయన బతుకుతారో లేదో అని ఎంతో టెన్షన్ పడ్డట్లు చెప్పుకొచ్చింది.