వామ్మో ప్రశాంత్ వర్మ, ఏంటయ్యా నీ ట్యాలెంట్.. తక్కువ బడ్జెట్ లో మిరాకిల్, హనుమాన్ సక్సెస్ కి కారణాలు
యువ హీరో తేజ సజ్జా, ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సూపర్ హీరో చిత్రం 'హను మాన్'. ఇక్కడ ఆంజనేయ స్వామినే సూపర్ హీరోగా చూపిస్తూ ఆయన శక్తి యుక్తులతో హీరో ఏం చేశాడు అనే ఆసక్తికరమైన కథతో హను మాన్ చిత్రం తెరకెక్కింది.
యువ హీరో తేజ సజ్జా, ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో ప్రయోగాత్మకంగా తెరకెక్కిన సూపర్ హీరో చిత్రం 'హను మాన్'. ఇక్కడ ఆంజనేయ స్వామినే సూపర్ హీరోగా చూపిస్తూ ఆయన శక్తి యుక్తులతో హీరో ఏం చేశాడు అనే ఆసక్తికరమైన కథతో హను మాన్ చిత్రం తెరకెక్కింది. వినయ్ రాయ్ ప్రతినాయకుడిగా, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం నేడు థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది.
Hanu Man
ఆల్రెడీ ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ప్రీమియర్ షోలకు మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తోంది. బుల్లి హీరోగా వచ్చిన తేజ సజ్జా నటనతో తన పెర్ఫామెన్స్ తో అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇదంతా ఒకెత్తయితే దర్శకుడు ప్రశాంత్ వర్మ మరో ఎత్తు అని చెప్పొచ్చు.
తేజ సజ్జా లాంటి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బుల్లి హీరోతో సూపర్ హీరో సినిమా చేయడం అంటే మామూలు సాహసం కాదు. అది కూడా తక్కువ బడ్జెట్ లో మైండ్ బ్లోయింగ్ విజువల్స్ తో ప్రశాంత్ వర్మ మిరాకిల్ చేశాడు. దీనితో ప్రశాంత్ వర్మ ట్యాలెంట్ కి ధైర్యానికిసోషల్ మీడియా ఫిదా అవుతోంది.
సంక్రాంతికి మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోల చిత్రాలు రిలీజ్ అవుతున్నప్పటికీ ప్రశాంత్ వర్మ వెనక్కి తగ్గలేదు. తన సినిమా కంటెంట్ నమ్మకుని ధైర్యంగా ముందుకు వచ్చాడు. థియేటర్స్ లో ఆడియన్స్ ని కట్టి పడేశాడు. ఇంత ట్యాలెంట్ పెట్టుకుని ఆ మాత్రం బలుపు ఉంటే తప్పు లేదు అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. హను మాన్ సక్సెస్ కి గల కారణాలని విశ్లేషిస్తున్నారు.
డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సూపర్ హీరో కథ అయినప్పటికీ దీనిని ఆంజనేయ స్వామి భక్తితో మిళితం చేసిన విధానం ఆకట్టుకుంటుంది. కథని నెమ్మదిగా ప్రారంభించి ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వరకు ఆడియన్స్ ని కట్టిపడేసాడు. ఆంజనేయ స్వామి షాట్స్ అయితే థియేటర్స్ లో భక్తిని నింపడమే కాదు గూస్ బంప్స్ వచ్చేలా చేస్తున్నాయి. 50 కోట్ల బడ్జెట్ లోపే ప్రశాంత్ వర్మ ఈ విజువల్ వండర్ ని సృష్టించారు.
తేజ సజ్జా తన పాత్రలో ఒదిగిపోయి పెర్ఫామ్ చేశాడు. తేజ సజ్జా, వరలక్ష్మి శరత్ కుమార్ మధ్య సన్నివేశాలు ఎంతో అందంగా వర్కౌట్ అయ్యాయి. ఎమోషనల్ ఎలివేట్ అయ్యాయి. మూవీ చివర్లో చిన్న ట్విస్ట్ తో పార్ట్ 2 ని కూడా ప్రశాంత్ వర్మ అనౌన్స్ చేశాడు. ప్రశాంత్ వర్మ టాలీవుడ్ లో నెక్స్ట్ బిగ్ థింగ్ నంటూ ప్రశంసలు దక్కుతున్నాయి.