ఏఎన్నార్ విగ్రహావిష్కరణలో కొత్త ప్రియుడితో జయసుధ ?.. మరోసారి వైరల్ గా సహజనటి వ్యక్తిగత జీవితం
ఏఎన్నార్ శతజయంతి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సహజనటి జయసుధ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జయసుధ ఏఎన్నార్ తో కలసి ప్రేమాభిషేకం, మేఘసందేశం లాంటి మెమొరబుల్ చిత్రాల్లో నటించింది.
తెలుగు నటనా శిఖరం అక్కినేని నాగేశ్వర రావు శతజయంతి నేటి నుంచి మొదలైంది. దీనితో ఏఎన్నార్ తనయుడు, కింగ్ నాగార్జున తన తండ్రి శతజయంతి ఉత్సవాలని వైభవంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. నేడు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఏఎన్నార్ విగ్రహావిష్కరణతో శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరయ్యారు. ఏఎన్నార్ పంచలోహ విగ్రహావిష్కరణ వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగింది.
ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి అతిరథ మహారథులంతా హాజరయ్యారు. మహేష్ బాబు, రాంచరణ్, మోహన్ బాబు, రాజమౌళి, కీరవాణి, బ్రహ్మానందం, జయసుధ, నాని, సురేష్ బాబు ఇంకా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ హాజరు కావడం విశేషం.
అయితే ఏఎన్నార్ శతజయంతి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సహజనటి జయసుధ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జయసుధ ఏఎన్నార్ తో కలసి ప్రేమాభిషేకం, మేఘసందేశం లాంటి మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. అయితే ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జయసుధ వ్యక్తిగత జీవితం చర్చనీయాంశంగా మారింది.
జయసుధ ఈ ఈవెంట్ లో మరోసారి తన కొత్త ప్రియుడితో కనిపించింది అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 80 దశకంలో జయసుధ హీరోయిన్ గా ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించింది. ప్రస్తుతం జయసుధ టాలీవుడ్ లో తల్లి పాత్రలలో రాణిస్తున్నారు. తల్లి పాత్రలతో కూడా ఆమె తనదైన ముద్ర వేస్తున్నారు. బొమ్మరిల్లు, పరుగు, శతమానం భవతి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి చిత్రాలే అందుకు నిదర్శనం.
ఇదిలా ఉండగా జయసుధ వ్యక్తిగత జీవితం ఎన్నో ఒడిదుడుకులతో కూడుకున్నది. గతంలో జయసుధకి రెండు పెళ్లిళ్లు జరిగాయి. ప్రస్తుతం జయసుధ వయసు 64 ఏళ్ళు. ఏ వయసులో జయసుధ మరోసారి కొత్త ప్రియుడితో సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. యుఎస్ కి చెందిన ఒక వ్యక్తితో జయసుధ తాజాగా ఏఎన్నార్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో కలసి కనిపించింది.
గతంలో కూడా వీరిద్దరూ జంటగా కనిపించారు. ఇప్పుడు ఎన్నార్ ఈవెంట్ కి కలసి రావడంతో జయసుధ మూడవ వివాహం గురించి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే జయసుధ కొత్త ప్రియుడు ఆమె బయోపిక్ ని డాక్యుమెంటరీ గా తెరకెక్కిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా తన కొత్త ప్రియుడిగా రూమర్స్ వస్తున్న వ్యక్తి గురించి జయసుధే క్లారిటీ ఇవ్వాలి.
జయసుధ కాకర్లపూడి రాజేంద్రప్రసాద్ అనే వ్యాపారవేత్తని వివాహం చేసుకుంది. విభేదాలతో అతడి నుంచి విడిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ ప్రముఖ నటుడు జితేంద్ర కపూర్ బంధువు నితిన్ కపూర్ ని వివాహం చేసుకుంది. నితిన్ కపూర్ అనారోగ్య సమస్యల కారణంగా 2017లో ఆత్మహత్య చేసుకుని మరణించారు.