శ్రీదేవికి అహంకారం ఎక్కువ.. జయప్రద అంటే అతిలోక సుందరికి ఎంతకు అంత కోపం..?
అతిలోక సుందరి.. దివంగత అందాల తార శ్రీదేవికి గర్వం ఎక్కువ అని వెల్లడించారు స్టార్ హీరోయిన్ జయప్రద. ఇంతకీ ఆమె ఎందుకు అలా అన్నారు. కారణం ఏంటి..?
Actress Sridevi
సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది శ్రీదేవి. తెలుగు, తమిళ భాషల్లో అతిలోక సుందరి ట్యాగ్ మర్చిపోలేని సినిమాలు అందించింది శ్రీదేవి. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అతిలోక సుందరిగా పేరు పొందిన తార శ్రీదేవి ఒక్కతే. ఆమె అందాన్ని గంధర్వ కాంతలతో పోల్చుతుంటారు.
అంతలా ఫ్యాన్స్ ను మైకంలో ముంచిన తార.. సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా తన స్టార్ డమ్ ను కొనసాగించింది. కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న శ్రీదేవి 50 ఏళ్లకే కన్నుమూసి.. అభిమానులను శోక సంద్రంలో ముంచెత్తింది.
ఇక శ్రీదేవి తెలుగు తమిళ భాషల్లో ఎక్కువగా సినిమాలు చేసింది. తెలుగులో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నాగార్జున కాంబినేషన్ లో ఎన్నో హిట్ సినిమాలు నటించింది. అయితే ఆమె చాలా సార్లు సినిమాల విషయంలో మేకర్స్ ను ఇబ్బందిపెట్టేదని టాక్ ఉంది. అంతే కాదు కొంత మంది నటీనటులతో కూడా ఆమె చాలా గర్వంగా ఉండేవారట.
మహేష్ బాబు కంటే ముందు నమ్రత 9 ఏళ్ళు ప్రేమించింది అతడినేనా..?
మరీముఖ్యంగా కొంత మంది హీరోయిన్లను ఆమె లెక్కచేసేవారు కాదట. ఈ విషయాంలో ముందుగా చెప్పుకునే పేరు జయప్రదదే. ఆమెతో శ్రీదేవి ఏమాత్రం సఖ్యతగా ఉండేవారు కాదట. అంత కాదు శ్రీదేవికి గర్వం చాలా ఎక్కువగా అన్నారు ఓ సందర్భంలో జయప్రద. ఆమె సినిమా వరకే మాట్లాడేవారట.
సినిమా షూటింగ్ ఉంటే.. షూటింగ్ లో .. సీన్ లో మాత్రంమే చాలా దగ్గర మనిషిలా ఉండేవారట. ఆతరువాత జయప్రద ఒక చోట కూర్చుంటే.. శ్రీదేవి ఆమెకు దూరంగా వెళ్ళి వేరు చైర్ లో కూర్చునేవారట. కనీసం పలకరింపు కూడా ఉండేది కాదట. ఇక చాలామంది విషయంలో శ్రీదేవి అలానే ప్రవర్తించేవారట.
అంతే కాదు కలిసి ఎన్ని సినిమాలు చేసినా.. ప్రతీ సినిమాకు డైరెక్టర్ కాని.. ప్రొడ్యూసర్ కాని ఎవరో ఒకరు వచ్చి... ఇదిగో జయప్రద గారు అని పరిచయం చేయాల్సి వచ్చేదట. కాని ఆమె మాత్రం చూసినా మాట్లాడేది కాదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో జయప్రద వెల్లడించారు.
అంతే కాదు శ్రీదేవి గురించి చాలా సందర్భాల్లో ఇలాంటి కామెంట్లు సహజంగానే వినిపించాయి. నిజానికి బాహుబలి సినిమాలో శివగామిగా శ్రీదేవిని అడిగారట. రాజమౌళి. కాని ఆమె చాలా పొగరుగా సమాధానం చెప్పడంతో పాటు.. చాలా డిమాండ్ చేశారట. ఆమె ప్రవర్తనతో రాజమౌళి.. శ్రీదేవిని తీసుకోలేదని అంటారు.
ఇక శివగామిగా రమ్యకృష్ణను చూసిన తరువాత.. శ్రీదేవిని తీసుకోకపోవడం మంచిది అయ్యింది అన్నారట రాజమౌళి. అంతే కాదు జయప్రదతో శ్రీదేవి గొడవ గురించి జయసుధ కూడా ఓ సందర్భంలో ప్రస్తావించారు. ఇక ఈవిషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది.