శ్రీదేవి, జయసుధ కంటే ఎక్కువగా ఎన్టీఆర్ కి ఇష్టమైన నటి.. చివరికి ఆ హీరోయినే వెన్నుపోటు పొడిచింది
స్వర్గీయ ఎన్టీఆర్ తన కెరీర్ లో అలనాటి సావిత్రి నుంచి ఇప్పటి సీనియర్లు జయసుధ, జయప్రద లాంటి హీరోయిన్ల వరకు ఎందరో నటీమణులతో నటించారు. శ్రీదేవి, జయప్రద అయితే ఎన్టీఆర్ తో కలసి చిన్న తనంలో నటించారు.
NTR
స్వర్గీయ ఎన్టీఆర్ తన కెరీర్ లో అలనాటి సావిత్రి నుంచి ఇప్పటి సీనియర్లు జయసుధ, జయప్రద లాంటి హీరోయిన్ల వరకు ఎందరో నటీమణులతో నటించారు. శ్రీదేవి, జయప్రద అయితే ఎన్టీఆర్ తో కలసి చిన్న తనంలో నటించారు. ఆ తర్వాత పెద్దయ్యాక ఆయన పక్కనే హీరోయిన్లుగా రొమాన్స్ చేసారు.
ఎన్టీఆర్ శ్రీదేవి, ఎన్టీఆర్ జయప్రద జోడి సిల్వర్ స్క్రీన్ పై అప్పట్లో సూపర్ హిట్. ఎన్టీఆర్ కి ఇష్టమైన నటీమణులలో జయప్రద ఒకరు అట. ఎన్టీఆర్ కి శ్రీదేవి, జయసుధ కంటే జయప్రద ఎక్కువగా ఇష్టం అని తెలుస్తోంది. ఈ విషయాన్ని జయప్రద ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. అంత మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ 1994లో ఎన్టీఆర్ గారు నాకు మాత్రమే ఫోన్ చేసి రాజకీయాల్లోకి ఆహ్వానించారు.
ఆయన ఇన్వైట్ చేసిన క్షణమే నేను ఎన్టీఆర్ గారితో రాజకీయాల్లో ఉండాలి అని డిసైడ్ అయ్యా. అప్పట్లో నా కెరీర్ పీక్ స్టేజిలో ఉంది. బాలీవుడ్ లో కూడా ఆఫర్స్ వస్తున్నాయి. నిర్మాతలు కూడా కొందరు నన్ను హెచ్చరించారు. రాజకీయాల్లోకి వెళితే కెరీర్ పాడవడం మాత్రమే కాదు.. అనేక ఇబ్బందులు తలెత్తుతాయి అని హెచ్చరించారట. కానీ నేను అవన్నీ ఆలోచించలేదు. ఎన్టీఆర్ పిలుపు మేరకు 1994లో తెలుగు దేశం పార్టీలో జాయిన్ అయ్యాను.
ఆయన నాకు ప్రాధాన్యత ఇచ్చారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో జయప్రద టీడీపీ కోసం ప్రచారం చేశారు. పార్టీ ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల పార్టీ చంద్రబాబు చేతుల్లోకి వెళ్ళింది. ఆ టైంలో పార్టీని ప్రభుత్వాన్ని రక్షించడం కోసం నేను కూడా చంద్రబాబు వైపు ఉన్నాను. నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే. పరిస్థితి ఎలాంటిది అయినా ఆ టైంలో నేను ఎన్టీఆర్ వైపు ఉండి ఉండాల్సింది. ఆ విషయంలో ఇప్పటికీ బాధపడుతుంటా అని జయప్రద అన్నారు.
అంత మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ ఎన్టీఆర్ గారు నాకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన మాటని పాటిస్తాను అని బాగా నమ్మకం. నా మీద నమ్మకంతో అనేక బాధ్యతలు ఇచ్చారు. వాటన్నింటినీ నెరవేర్చాను. కానీ చివరి రోజుల్లో ఆయన వైపు ఉండలేకపోయాను అని జయప్రద ఫీల్ అయ్యారు.