MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘జవాన్’ నటీనటుల రెమ్యునరేషన్స్.! ఒక్కొక్కరు ఎన్ని కోట్లు తీసుకున్నారంటే?

‘జవాన్’ నటీనటుల రెమ్యునరేషన్స్.! ఒక్కొక్కరు ఎన్ని కోట్లు తీసుకున్నారంటే?

షారుఖ్ ‘జవాన్’లో భారీ తారాగణం నటించింది. ముఖ్యపాత్రలు పోషించి వెండితెరపై అదరగొట్టింది. అయితే ఈ సినిమా కోసం వారంత ఎంత పారితోషికం తీసుకున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..  

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 08 2023, 06:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్ షారుఖ్ (Shah Rukh Khan)  ‘పఠాన్’ తో ఈ ఏడాది సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ఏకంగా వెయ్యి కోట్లు క్రాస్ అవ్వడం విశేషం. ఇక అదే ఊపులో భారీ యాక్షన్ ఫిల్మ్ ‘జవాన్’ (Jawan) తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. నిన్న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదలైంది. పాజిటివ్ రెస్పాన్స్ తో థియేటర్లలో దుమ్ములేపుతోంది.

26

‘జవాన్’ చిత్రానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.  తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ చేయడం. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార బాలీవుడ్ కు ఈ చిత్రంతోనే ఎంట్రీ ఇవ్వటం. దీపికా పదుకొణె అతిథి పాత్ర.. అనిరుధ్ సంగీతంతో పాటు విజయ్ సేతుపతి విలన్ పాత్ర పోషించడం వంటి అంశాలను సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. అలాగే హాలీవుడ్ కు చెందిన ప్రముఖ యాక్షన్ కొరియోగ్రఫర్లు ఈ చిత్రానికి వర్క్ చేశారు. 

36

యాక్షన్ మూవీస్ ను ఇష్టపడే వారికి ‘జవాన్’ చిత్రం ట్రీట్ అనే చెప్పాలి. షారుఖ్ తో పాటు ఈ చిత్రం నయనతార, విజయ్ సేతుపతి, దీపికా, తదితరులు తమ పెర్ఫామెన్స్ తో అదరగొట్టారు. సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. ఈ క్రమంలో నటీనటుల రెమ్యునరేషన్స్ గురించి ఓ న్యూస్ వైరల్ గా మారింది. దాని ప్రకారం.. ఒక్కొక్కరు ఎంత పారితోషికం తీసుకున్నారంటే.. 

46

ఏకంగా నాలుగు గెటప్స్ లో అలరించిన షారుఖ్ ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ పై నిర్మించిన విషయం తెలిసిందే. దీంతో చిత్రంలో ఇతర పాత్రల్లో నటించిన వారికి భారీగానే రెమ్యునరేషన్స్ అందించారు. నెగెటివ్ రోల్ లో నటించిన విజయ్ సేతుపతికి రూ.23 కోట్ల రెమ్యునరేషన్ అందించారంట. ఇక నయనతార రూ.10 కోట్లు పారితోషికం అందుకుంది. 
 

56

అతిథి పాత్రలో అలరించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణెకు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ అందించారని తెలుస్తోంది. కీలక పాత్రలో మెరిసిన ప్రియమణికి రూ.3 కోట్లు ,  కమెడియన్స్ యోగి బాబు, సునీల్ గ్రోవర్ లకు ఒక్కొక్కిరికి రూ.2 కోట్లు చెల్లించారంట. అలాగే రిధి డోగ్రా, సంగీత వంటి నటీమణులకు చెరొక్క రూ.కోటీ అందించారని తెలుస్తోంది. 
 

66

ఇక ఈ భారీ యాక్షన్ ఫిల్మ్ ను రూ.300 కోట్లతో షారుఖ్ ఖాన్ భారీ గౌరీ ఖాన్ నిర్మించారు. తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.129 కోట్ల గ్రాక్ కలెక్ట్ చేసింది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సులభంగా వెయ్యి కోట్ల మార్క్ రీచ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తుందో చూడాలి. 
 

About the Author

SG
Sreeharsha Gopagani
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
సాయి పల్లవి 4000 కోట్ల సినిమాలోకి.. హాలీవుడ్ డైరెక్టర్ ఎంట్రీ?
Recommended image2
Vijay: ఎన్నికల ప్రచారానికి గంట ప్రయాణం..విజయ్ ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా?
Recommended image3
సినిమాల్లోకి రాక‌ముందు.. ఈ హీరోయిన్ల పేర్లు ఏంటో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved