MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తెలుగు హీరోయిన్ జాస్మిన్ కు కార్నియా డ్యామేజ్... కంటిచూపు సమస్య

తెలుగు హీరోయిన్ జాస్మిన్ కు కార్నియా డ్యామేజ్... కంటిచూపు సమస్య

తెలుగులో ‘దిల్లున్నోడు’ ‘వేట’, ‘లేడీస్ & జెంటిల్మన్’సినిమాలలో నటించింది. అలాగే అనేక  కన్నడ, మలయాళ, తమిళ సినిమాల్లోనూ

3 Min read
Surya Prakash
Published : Jul 22 2024, 08:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
Jasmin Bhasin

Jasmin Bhasin


కంటి చూపు సమస్యలకు సాధారణంగా మనం కళ్లద్దాలు వాడుతూంటాం. అయితే కొందరికి కళ్లద్దాలు పెట్టుకోవటం ఇష్టం ఉండదు. అలాంటప్పుడు కాంటాక్ట్ లెన్స్ వాడుతూంటారు. అందులో లేటెస్ట్ మాడర్న్ టెక్నాలిజీ కు తగినట్లు వాడుతూండటం కూడా సహజమే. అయితే ఈ కాంటాక్ట్ లెన్స్ విషయంలో చాలా  జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.  లెన్స్ సరిగ్గా ఉపయోగించకపోతే ఒక్కోసారి కంటి చూపు పోయే పరిస్థితి కూడా వస్తుంటుంది. తాజాగా తెలుగు హీరోయిన్ కు ఇలాంటి బ్యాడ్ ఎక్సపీరియన్స్ ఎదురైంది. 

212


లెన్స్ సరిగ్గా ఉపయోగించకపోవడం వల్ల ఇప్పుడు తనకు కళ్లు కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన జాస్మిన్ బాసిన్ తెలుగు వారికి కొత్తేమీ కాదు. తెలుగులో ‘దిల్లున్నోడు’ ‘వేట’, ‘లేడీస్ & జెంటిల్మన్’సినిమాలలో నటించింది. అలాగే అనేక  కన్నడ, మలయాళ, తమిళ సినిమాల్లోనూ నటించి అక్కడి మంచి పేరు తెచ్చుకుంది. అలాగే జాస్మిన్  హిందీ బిగ్ బాస్ 14, ఖత్రోంకి ఖిలాడీ తదితర రియాలిటీ షోల్లోనూ పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది.
 

312


జాస్మిన్ తాను  లెన్స్ ఉపయోగించడం కారణంగా ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని చెప్పుకొచ్చింది. ‘జూలై 17న ఒక ముఖ్యమైన పని కోసం ఢిల్లీలో ఉన్నాను. ప్రోగ్రాంకు రెడీ అవుతున్న టైంలో కళ్లకు లెన్స్ పెట్టుకోగానే ఎందుకో చాలా నొప్పిగా అనిపించింది. ఆతర్వాత ఆ నొప్పి మరింత ఎక్కువైపోయింది. దీంతో ఆ ఈవెంట్‌లో సన్ గ్లాసెస్ పెట్టుకుని ఎలాగోలా మేనేజ్ చేశాను. అయితే ఒకానొక సమయంలో నాకేం కనిపించలేదు. అంత చీకటిగా అనిపించింది. 
 

412


ఎలాగోలా కష్టమ్మీద పని పూర్తిచేసి డాక్టర్ దగ్గరికి వెళ్లాను. కార్నియా డ్యామేజ్ అయిందని చెప్పి కళ్లకు బ్యాండేజ్ వేశారు. కానీ ఈ నొప్పి తగ్గడానికి కనీసం 4-5 రోజులు పడుతుందని డాక్టర్స్ చెప్పారు. కానీ నొప్పి మాత్రం భరించలేనంతగా ఉంది. దీని వల్ల సరిగా చూడలేకపోతున్నా, నిద్ర కూడా సరిగా పట్టడం లేదు’ అని జాస్మిన్ బాసిన్ చెప్పుకొచ్చింది.
 

512


 ప్రస్తుతం ఆమె కళ్లకు వైట్ బ్యాండేజీతో కనిపిస్తోంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో  వైరలవుతున్నాయి. వీటిని చూసిన వారు జాస్మిన్ లెన్స్ సరైన రీతిలో ఉపయోగించకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బంది కలిగి ఉండొచ్చని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు తమకు తోచిన సలహాలు ఇస్తున్నారు. కొంతమంది అయితే తాము లెన్స్ ఉపయోగిస్తున్నామని భయపడాల్సిన అవసరం ఉందా అని ప్రశ్నిస్తున్నారు. 
 

612


ఇక సోషల్ మీడియాలో ఆ ఫొటో చూస్తున్న నెటిజన్లు.. అభిమానులు ఆమె త్వరగా అనారోగ్యం నుంచి కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. గెట్‌ వెల్‌ సూన్‌ అంటూ పెద్ద ఎత్తున పోస్టులు సైతం పెడుతున్నారు.  
 

712


ఇంతకు ముందు ఆమె సర్జరీలపై ట్రోలింగ్‌.. అర్థం చేసుకోకుండా తిడతారేంటి? అంటూ మండిపడింది.  సెలబ్రెటీలు  అందానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు.  అందం కోసమే ఖర్చు చేస్తారు.. అందంగా కనిపించేందుకే ఎక్కువ తాపత్రయపడతారు. అందులో తప్పేముంది. కొందరైతే ప్లాస్టిక్‌ సర్జరీల దాకా వెళ్తారు. ముఖంలో, శరీరంలో ఏమాత్రం తేడా కనిపించినా జనాలు ఇట్టే గుర్తుపట్టేస్తారు. 
 

812


పొరపాటున ఫేస్‌లో ఏదైనా మార్పు కన్పిస్తే చాలు నెటిజన్లు సెలబ్రిటీలను తెగ ట్రోల్‌ చేస్తున్నారని .ఈ వైఖరి మంచిది కాదని జాస్మిన్‌ భాసిన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. 'జనాలు ఎంత దారుణంగా ఉన్నారంటే ముఖం పట్టుకుని నానామాటలు అనేస్తున్నారు. నటీనటులుగా, సెలబ్రిటీలుగా మేము జనాల్లోనే ఉండాలి. అది నేను ఒప్పుకుంటాను. 
 

912


కానీ ఎందుకని ఎప్పుడూ నెగెటివిటీ ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. యాక్టర్స్‌గా అందంగా కనిపించడం మా బాధ్యత. అందవిహీనంగా కనిపించాలని ఎవరైనా అనుకుంటారా? మా ప్రొఫెషనల్‌లో అందానికి పెద్ద పీట వేస్తాం. ఎప్పటికప్పుడు అందాన్ని పెంపొందించుకోవాలనే చూస్తాం. అందుకోసం ఎంతగానో కష్టపడతాం అంది.
 

1012


 ఇక శరీరంలోని మార్పుల వల్ల, హార్మోన్ల అసమతుల్యత వల్ల మేమెంత ఇబ్బందిపడుతున్నా అవి పైకి కనిపించనీయకుండా ఉండటానికి ప్రయత్నిస్తూనే ఉంటాం. అది అర్థం చేసుకోకుండా నోటికొచ్చింది తిడుతున్నారు. అప్పటికే మేమెంతో ఒత్తిడిలో ఉంటాం. దానికి తోడు మీ ట్రోలింగ్‌ వళ్ల ఇంకెంత హర్ట్‌ అవుతామో ఆలోచించారా? దీనివల్ల డిప్రెషన్‌లోకి వెళ్లిపోయే ఛాన్స్‌ ఉంది. ఇంత బాధపెట్టడం మీకు న్యాయమేనా?' అని జాస్మిన్‌ ప్రశ్నించింది.
 

1112

గతంలోనూ జాస్మిన్  ఆరోగ్యానికి సంబంధించిన ఓ వార్త ఒకటి ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురి చేసింది. కడుపులో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆమె ఆస్పత్రి పాలయ్యారు. అప్పుడు ఆమె ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. సో ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను స్వయంగా ఆమే తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్‌ చేశారు. ఆ ఫొటో కాస్తా సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

1212

జాస్మిన్ త్వరగా కోలుకోవాలని, కంటి చూపు తిరిగి యధాస్దితికి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలాగే ఆమె తను సౌత్ సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పుకొచ్చింది. త్వరలో తెలుగులోనూ మరో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. తిరిగి ఆరోగ్యం సెట్ అయ్యి బిజీ అవ్వాలని కోరుకుందాం. 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
చిరంజీవినే ఎదిరించిన అనిల్ రావిపూడి, మెగాస్టార్ మాటకు నో చెప్పిన దర్శకుడు, కారణం ఏంటి?
Recommended image2
Bigg Boss 9 Winner: బిగ్‌ బాస్‌ విన్నర్‌ని కన్ఫమ్‌ చేసిన భరణి, సుమన్‌ శెట్టి.. నాగార్జునకి కొత్త తలనొప్పి
Recommended image3
Bigg Boss Telugu 9: తనూజ విన్నర్ కాదు... ఎలిమినేషన్ తర్వాత భరణి షాకింగ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved