- Home
- Entertainment
- Janaki Kalaganaledu: వెన్నెలకు మాట ఇచ్చిన జానకి.. పరువే ముఖ్యమని షాకిచ్చిన జ్ఞానాంబ!
Janaki Kalaganaledu: వెన్నెలకు మాట ఇచ్చిన జానకి.. పరువే ముఖ్యమని షాకిచ్చిన జ్ఞానాంబ!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki kalaganaledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జానకి, రామచంద్రలు లో కారులో వస్తుండగా రామచంద్ర ఒక దగ్గర కారు అపి 'అమ్మ రావడం తో చెప్పడం ఆపేసిన విషయం' జానకి (Janaki) ని చెప్పమంటాడు.

ఇక జానకి (janaki) ఇంత ఆనందమైన సమయంలో ఆ విషయం ఎందుకు చెప్పండి అంటుంది. అంతేకాకుండా నా ఐపీఎస్ సిస్టాన్ని నేను వదిలేసాను ఇక మీరు ఆలోచించ కండి అని చెబుతుంది. ఈ లోపు జానకి కు వెన్నెల (Vennela) ఫోన్ చేసి 'నా కారణంగా నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు నన్ను క్షమించు వదిన' అని అంటుంది.
ఇప్పుడు నువు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని జానకి (Janaki) అడగగా ' ఇక నేను ఉండను కదా వదినా చివరిసారిగా సారీ చెప్పాలి అనిపించింది' అని వెన్నెల ఏడ్చుకుంటూ చెబుతుంది. ఈలోపు రామచంద్ర ఫోన్ తీసుకుని ఎక్కడున్నావ్ అమ్మా అని అడగగా ' చావుకు దగ్గరగా ఉన్న అన్నయ్య' అని వెన్నెల (Vennela) చెబుతుంది.
ఇక రామచంద్ర (Rama chandra) జరిగిన సంగతి గురించి వెన్నెలను అడిగి తెలుసుకుంటాడు. ఆ సమస్యకు పరిష్కారం మేము చూపిస్తాం అని వాళ్ళిద్దరు వెన్నెలను ఎంత బతిమిలాడినా వినకుండా ఫోన్ స్విచాఫ్ చేస్తుంది. ఇక ఆ తర్వాత వెన్నెల, దిలీప్ (Dilip) లు కొండపై నుంచి దూకటానికి కొండ ఎక్కుతారు.
మరోవైపు రామచంద్ర (Rama chandra) , జానకి లు వీరిద్దరిని వెతుకుతున్న క్రమంలో అదే కొండ దగ్గరికి వచ్చి ఆ కొండ నుంచి వచ్చిన శంఖం శబ్దాన్ని బట్టి ఇంతక ముందు ఫోన్ లో వచ్చిన శంఖం శబ్దాన్ని గ్రహించి వీరిద్దరు అదే కొండపై ఉన్నారని గ్రహించి కొండ దగ్గరకు వెళ్లి వెతుకుతూ ఉంటారు. ఈలోపు కొండ పై నుంచి దిలీప్, వెన్నెల (Vennela) ను గమనించి అక్కడికి వెళ్లి వీరిద్దరు కాపాడుతారు.
ఇక జానకి (Janaki) వాళ్ళిద్దరికీ నచ్చజెప్పి ధైర్యం చెప్పి అక్కడి నుంచి తీసుకెళుతుంది. మరోవైపు నిత్యానంద గోవిందరాజులు వెన్నెల పెళ్లికి పూజారితో ముహూర్తం పెట్టిస్తు ఉంటారు. ఆ క్రమంలో జ్ఞానాంబ (Jnanaamba) పూజారి తో మాకు ప్రాణం కంటే పరువే ముఖ్యం అని చెబుతుంది.
మరోవైపు జానకి (Janaki) పరువు కంటే నీ ప్రాణాలు ముఖ్యమని వెన్నెలతో చెప్పింది. ఎలాగైనా మీ ఇద్దరి పెళ్లి గురించి అమ్మతో చెప్పి మేము ఒప్పిస్తాం అని జానకి రామచంద్రలు వెన్నెలకు (Vennela) మాటిస్తారు. ఇక ఈ క్రమంలో రేపటి భాగం ఏం జరుగుతుందో చూడాలి