- Home
- Entertainment
- చెర్రీ ఫ్రూట్ లా నిగనిగలాడుతున్న జాన్వీ కపూర్ అందం.. టైట్ ఫిట్ లో స్ట్రక్చర్ చూపిస్తున్న యంగ్ బ్యూటీ..
చెర్రీ ఫ్రూట్ లా నిగనిగలాడుతున్న జాన్వీ కపూర్ అందం.. టైట్ ఫిట్ లో స్ట్రక్చర్ చూపిస్తున్న యంగ్ బ్యూటీ..
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) వరుస చిత్రాలతో అభిమానులను అలరిస్తోంది. ప్రస్తుతం తన చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా ఉంది. ఈ సందర్భంగా లేటెస్ట్ ఫొటోషూట్లు చేస్తూ మతిపోగొడుతోంది.

జాన్వీ కపూర్ పేరు బాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుంటున్న జాన్వీ కపూర్ పైనే దర్శక నిర్మాతల చూపు ఉంది. దీంతో అప్ కమింగ్ ఫిల్మ్స్ లో ఈ యంగ్ బ్యూటీని ఎంచుకునేందుకు ఇష్టపడుతున్నారు.
వరుస చిత్రాల్లో నటిస్తూ అభిమానులను అలరిస్తున్న జాన్వీ తన గ్లామర్, నటనకు మంచి మార్కులు పొందింది. తన నటిస్తున్న సినిమాలకు కూడా విభిన్న కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.
గతేడాది ‘రూహి’ చిత్రంతో అలరించిన జాన్వీ కపూర్ ప్రస్తుతం ‘గుడ్ లక్ జెర్రీ’ ( Good Luck Jerry)తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. హిందీ-భాషలో బ్లాక్ కామెడీ క్రైమ్ చిత్రంగా విడుదల కాబోతున్న ఈ మూవీకి సిద్ధార్థ్ సేన్‌గుప్తా దర్శకత్వం వహించారు.
లైకా ప్రొడక్షన్స్ మరియు కలర్ ఎల్లో ప్రొడక్షన్స్, మహవీర్ జైన్ ఫిల్మ్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించారు. జూలై 29న ఓటీటీలో రిలీజ్ కానుంది. మార్చిలోనే చిత్ర షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు.
ఈ చిత్రాన్ని దీపక్‌తో పాటు జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. డోబ్రియాల్, మితా వశిష్ట్, నీరజ్ సూద్ మరియు సుశాంత్ సింగ్ కీలక పాత్రల్లో నటించారు. తమిళ చిత్రం ‘కొలమావు కోకిల’కి ఇది రీమేక్. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ ను యూనిట్ గా నిర్వహిస్తోంది.
ఈ సందర్భంగా జాన్వీ కూడా ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ లో మతిపోయేలా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. జాన్వీ అందాల విందుకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.
తాజాగా తను పోస్ట్ చేసిన పిక్స్ నెటిజన్లకు పిచ్చెక్కిస్తోంది. చెర్రీ ఫ్రూట్ లా నిగనిగలాడే అందంతో ఆకట్టుకుంటోంది. టైట్ మెరూన్ డ్రెస్ లో డీప్ బ్యాక్ చూపిస్తూ రెచ్చకొడుతోంది. ట్రెండీ వేర్ లో యంగ్ బ్యూటీ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ లో దర్శనమివ్వడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఈ పిక్స్ ను షేర్ చేస్తూ క్రేజీ గా క్యాప్షన్ ఇచ్చింది. ‘ఒకవేళ జెర్రీ చెర్రీ అయితే’ అంటూ తన సినిమాను గుర్తుచేస్తోంది. ఓ రేంజ్ లో చిత్ర ప్రమోషన్ చేసుకుంటోంది. తను పోస్ట్ చేసిన పిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజన్లు లైక్ లు, కామెంట్లతో జాన్వీ ని సపోర్ట్ చేస్తున్నారు.