- Home
- Entertainment
- Janhvi Kapoor: రామ్ చరణ్ కి శ్రీదేవి కూతురు షాక్, జాన్వీ కపూర్ పెద్ది ప్రమోషన్స్ కి ఎందుకు రావడంలేదు?
Janhvi Kapoor: రామ్ చరణ్ కి శ్రీదేవి కూతురు షాక్, జాన్వీ కపూర్ పెద్ది ప్రమోషన్స్ కి ఎందుకు రావడంలేదు?
సినిమా ప్రమోషన్లకు హీరోహీరోయిన్లు కలిసి రావడం కామన్. కానీ 'పెద్ది' ప్రమోషన్లలో జాన్వీ కపూర్ ఎక్కడా కనిపించడం లేదు. దీని వెనుక ఉన్న కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు. అసలేం జరిగిందంటే..!

పెద్ది సినిమాను చుట్టుముట్టిన వివాదాలు..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటను వెండితెరపై చూడాలని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ 'పెద్ది' సినిమా రిలీజ్ దగ్గరపడేకొద్దీ వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఓవైపు జాన్వీ ప్రమోషన్లకు రాకపోవడం, మరోవైపు నిర్మాతలకు, థియేటర్ల యజమానులకు మధ్య గొడవలు సినిమా భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

ప్రమోషన్లకు దూరంగా జాన్వీ కపూర్..
డబ్బులు డబుల్ అంటూ విమర్శలు..
సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ లైవ్ కాన్సర్ట్‌తో పాటు, కీలక ఈవెంట్లకు కూడా జాన్వీ హాజరు కాలేదు. బాలీవుడ్‌లో పెద్ద రోల్స్ చేస్తున్న తాను, ఇంత చిన్న పాత్ర కోసం ప్రమోషన్స్ చేయడం ఇష్టం లేదని ఆమె అంటున్నారట. కానీ ఈ సినిమాకు బాలీవుడ్ కన్నా రెట్టింపు రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు రావడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. 'డబ్బులు డబుల్ కావాలి కానీ, ప్రమోషన్లకు రావా?' అని సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.
జూన్ 4న రిలీజ్ అవుతుందా లేదా?
హీరోయిన్ సమస్యే కాకుండా, 'పెద్ది' చిత్రానికి ఇప్పుడు నైజాం ఏరియాలో పెద్ద చిక్కు వచ్చి పడింది. థియేటర్ల అద్దె, లాభాల వాటా విషయంలో నిర్మాతలకు, ఎగ్జిబిటర్లకు మధ్య పెద్ద వివాదం నడుస్తోంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ సినిమా జూన్ 4న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, తమ డిమాండ్లు నెరవేర్చకపోతే సినిమాను ప్రదర్శించేది లేదని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు.
టెన్షన్ లో పెద్ది నిర్మాతలు
పెద్ది నిర్మాతలు ఈ విషయంలో టెన్షన్ పడుతున్నారు. “మాది 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ సినిమా. ఇప్పుడు మళ్లీ రిలీజ్ ఆలస్యమైతే మాకు భారీ నష్టం వస్తుంది” అని నిర్మాతలు ఫిల్మ్ ఛాంబర్ ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు జాన్వీ కపూర్ రాకపోవడం, మరోవైపు థియేటర్ల అద్దె గొడవల మధ్య రామ్ చరణ్ బిగ్ బడ్జెట్ సినిమా ఎలా గట్టెక్కుతుందో చూడాలి. ఈ అడ్డంకులన్నీ తొలగిపోయి, సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవ్వాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.

