- Home
- Entertainment
- జాన్వీ కపూర్, కంగనా, యామీ గౌతమ్.. సైనిక అధికారులుగా గూస్ బంమ్స్ తెప్పించిన హీరోయిన్లు
జాన్వీ కపూర్, కంగనా, యామీ గౌతమ్.. సైనిక అధికారులుగా గూస్ బంమ్స్ తెప్పించిన హీరోయిన్లు
బాలీవుడ్ నటీమణులు 'టెస్ట్ కేస్' నుండి 'తేజస్' వరకు యూనిఫాంలో అధికారి పాత్రలను పోషించారు. ఏ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది? అనేది చూద్దాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
నిమ్రత్ కౌర్
ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో భారత్ కీలకంగా చేపట్టిన `ఆపరేషన్ సిందూర్` విజయవంతం అయ్యింది. ఇందులో వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోషియా కురేషీ కీలక భూమిక పోషించారు. ఈ క్రమంలో సినిమాల్లో బలమైన సైనిక అధికారులుగా నటించిన నటీమణులు ఎవరో తెలుసుకుందాం.
2017లో విడుదలైన 'ద టెస్ట్ కేస్' వెబ్ సిరీస్‌లో నిమ్రత్ కౌర్ కెప్టెన్ పాత్ర పోషించారు. ఈ సినిమాకి IMDBలో 8.3 రేటింగ్ ఉంది. ఇందులో ఆమె నటన కూడా అదిరిపోయింది.
యామి గౌతమ్
2019లో విడుదలైన 'ఉరి: ద సర్జికల్ స్ట్రైక్' సినిమాలో యామి గౌతమ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పాత్ర పోషించారు. ఈ సినిమాకి IMDBలో 8.2 రేటింగ్ ఉంది. ఈ సినిమా థియేటర్లలో రచ్చ చేసింది. పెద్ద విజయం సాధించింది.
డయానా పెంటీ
2017లో విడుదలైన 'పరమాణు: ద స్టోరీ ఆఫ్ పోఖ్రాన్' సినిమాలో డయానా పెంటీ ఒక భారతీయ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారిణిగా నటించారు. ఈ సినిమాకి IMDBలో 7.6 రేటింగ్ దక్కింది. ఇది పెద్దగా ఆడలేదు.
జాన్వీ కపూర్
2020లో వచ్చిన 'గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్' సినిమాలో జాన్వీ కపూర్ ఫ్లైట్ లెఫ్టినెంట్ గుంజన్ సక్సేనా పాత్ర పోషించారు. ఈ సినిమాకి IMDBలో 5.5 రేటింగ్ ఉంది. సినిమా కూడా కమర్షియల్‌గా సత్తా చాటలేకపోయింది. కానీ జాన్వీకి మాత్రం మంచి మార్కులు పడ్డాయి.
షమితా శెట్టి
2004లో విడుదలైన 'అగ్నిపంఖ్' సినిమాలో షమితా శెట్టి భారతీయ వైమానిక దళ అధికారిణిగా నటించారు. ఈ సినిమాకి IMDBలో 4.8 రేటింగ్ ఉంది. ఇది పెద్ద డిజాస్టర్ అయ్యింది.
కంగనా రనౌత్
2023లో విడుదలైన 'తేజస్' సినిమాలో కంగనా రనౌత్ వైమానిక దళ అధికారిణిగా నటించారు. ఈ సినిమాకి IMDBలో 4.3 రేటింగ్ ఉంది. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా నటించిన ఈ మూవీ కూడా ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. కంగనా నటనకు మంచి మార్కులు పడ్డాయి.