MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Single Movie Review: `సింగిల్‌` మూవీ రివ్యూ

Single Movie Review: `సింగిల్‌` మూవీ రివ్యూ

కంటెంట్‌ని, కామెడీని నమ్ముకుని సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్న హీరో శ్రీవిష్ణు ఇప్పుడు `సింగిల్‌` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. శుక్రవారం విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

3 Min read
Author : Aithagoni Raju
Published : May 09 2025, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
single movie review

single movie review

శ్రీవిష్ణు హీరోగా కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా రూపొందిన మూవీ `సింగిల్‌`(#Single). కార్తీక్‌ రాజు దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో విద్యా కొప్పినీడు, భాను ప్రతాప్‌, రియాజ్‌ చౌదరీ సంయుక్తంగా నిర్మించారు. ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానంగా చేసుకొని రూపొంది ఈ చిత్రం నేడు శుక్రవారం(మే 9)న విడుదలైంది. కామెడీ చిత్రాలతో అలరించే శ్రీవిష్ణు ఈ సినిమాతో ఆడియెన్స్ ని అలరించారా? మూవీ ఎలా ఉందనేది రివ్యూలో తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
single movie review

single movie review

కథః 
విజయ్‌(శ్రీవిష్ణు) బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తుంటాడు. ఆయనకు అరవింద్‌(వెన్నెల కిశోర్) ఫ్రెండ్‌. వీరిద్దరు చిన్నప్పట్నుంచి అమ్మాయిలకు ప్రపోజ్‌ చేస్తుంటారు, కానీ ఎవరూ వీరి ప్రేమని అంగీకరించరు. ఎలాగైనా అమ్మాయిలను పడేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించవు. దీంతో ఉద్యోగం చేసే స్థాయికి వచ్చినా సింగిల్‌గానే ఉంటారు.

ఈ క్రమంలో విజయ్‌కి పూర్వ(కేతిక శర్మ) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమెని చూడగానే ప్రేమలో పడతాడు విజయ్‌. ఆమెని తన ప్రేమలో పడేసేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో డాన్స్ టీచర్‌ హరిణి(ఇవానా) విజయ్‌ని ప్రేమిస్తుంది. ఆయన్ని ఇంప్రెస్‌ చేయడానికి ప్రయత్నిస్తుంది.

కానీ విజయ్‌ మాత్రం పూర్వపై ఫోకస్‌ పెడతాడు. మరి వీరి ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది. విజయ్‌కి పూర్వ పడిందా? హరిణికి విజయ్‌ పడ్డాడా? లేక సింగిల్‌గానే మిగిలిపోయాడా? అనేది మిగిలిన కథ. 
 

Related Articles

Related image1
Subham Review : సమంత 'శుభం' మూవీ రివ్యూ
Related image2
Sai Pallavi: సాయి పల్లవికి ఎందుకు అంత క్రేజ్ ? ఆమె సూపర్ హిట్ చిత్రాల లిస్ట్ ఇదే
36
single movie review

single movie review

విశ్లేషణః 
`యాష్‌ ట్యాగ్‌ సింగిల్‌`(#Single) మూవీ కథ పరంగా చాలా సింపుల్‌. ఇదొక ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ. ఇద్దరు లవర్స్ తో హీరో ఎలా ఇబ్బంది పడ్డాడు? వారిని ఇంప్రెస్‌ చేయడానికి చేసే ప్రయత్నాలు ఈ క్రమంలో పుట్టే కామెడీనే ఈ చిత్రం. స్టోరీ సింపుల్‌గానే ఉండటంతో మెయిన్‌గా కామెడీనే నమ్ముకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సందర్భానుసారంగా పుట్టే కామెడీ బాగా వర్కౌట్‌ అవుతుంది. ఇటీవల వచ్చిన చాలా చిత్రాలు ఇలానే విజయాలు అందుకున్నాయి. ఆ కోవలోనే `సింగిల్‌` మూవీని రూపొందించారు. లాజిక్‌తో సంబంధం లేకుండా ఆడియెన్స్ ని రెండున్నర గంటలపాటు నవ్విస్తే చాలు సినిమా థియేటర్లలో రచ్చ చేస్తుంటుంది. ఈ మూవీ విషయంలో అదే స్ట్రాటజీని ఇంప్లిమెంట్‌ చేశారు. ఆ విషయంలో సక్సెస్‌ అయ్యారు.

సినిమా ప్రారంభం నుంచే కామెడీ వర్కౌట్‌ అయ్యేలా చేశారు. శ్రీవిష్ణు, వెన్నెల కిశోర్‌ ల మధ్య కామెడీ ట్రాక్‌ని బలంగా రాసుకుని ఈ మూవీని తెరకెక్కించారు. వీరిద్దరి మధ్య సీన్లు అంతే బాగా వర్కౌట్‌ అయ్యాయి. వీరి సీన్లు ఎప్పుడు వచ్చినా హిలేరియస్‌గా నవ్వులు పూయిస్తుంది. 
 

46
single movie review

single movie review

ఇక అమ్మాయిల విషయంలో హీరో చేసే పొరపాట్లు, తొందరపాట్లు, ఈ క్రమంలో కొందరు అమ్మాయిలను దూరం చేసుకోవడం వంటి సీన్లు అలరించేలా తెరకెక్కించారు. నవ్విస్తూనే ఆలోచింప చేసేలా ఉంటాయి. హీరో పాత్రని కేవలం కామెడీగానే కాదు, అందులోనూ బాధ్యతని చూపించిన తీరు బాగుంది.

మంచితనం, బాధ్యత వంటి లక్షణాలు హీరోకి ఉంటేఇప్పుడు వర్కౌట్‌ కాదు, కానీ ఇందులో దాన్ని కన్విన్సింగ్‌గా చూపించడం విశేషం. హీరోహీరోయిన్ల మధ్య లవ్‌ ట్రాక్‌ సీన్లు ట్రెండీగా ఉంటాయి. ఇప్పటి యువతకి బాగా కనెక్ట్ అవుతాయి. అవే సినిమాకి హైలైట్‌గా చెప్పొచ్చు. ఏ సినిమా అయినా కథ బలంగా లేకపోతే ఓ దశలో కొంత నిరాసక్తి అనిపిస్తుంది. ఇందులోనూ అలాంటి ఫీలింగ్‌ కలుగుతుంది. కొన్ని సీన్లు ఇరికించాయా? అనేలా ఉంటాయి. లాజిక్‌ లేకుండా ఉంటాయి.

అయితే సెకండాఫ్‌లో కొంత ఎమోషనల్‌ టచ్‌, క్లైమాక్స్ లో స్టార్స్ గెస్ట్ అప్పీయరెన్స్ లు హైలైట్‌గా నిలిచాయి. క్లైమాక్స్ ని కొత్తగా చూపించిన తీరు కూడా బాగుంది. సో ఇలా కథ, లాజిక్‌లు పక్కన పెట్టి చూస్తే ఈ మూవీ ఆద్యంతం నవ్వులు పూయిస్తుందని చెప్పొచ్చు. 
 

56
single movie review

single movie review

నటీనటులుః 
హీరో శ్రీవిష్ణు మంచి కాన్సెప్ట్ ఉన్న చిత్రాలను ఎంపిక చేసుకుంటూ, కామెడీని నమ్ముకుంటూ సినిమాలు చేస్తున్నాడు. సక్సెస్‌ అవుతున్నాడు. మిగిలిన హీరోల్లో మాస్‌ ఇమేజ్‌కి పోకుండా తన పరిధి మేరకు తన బెస్ట్ ఇస్తూ తానేంటో నిరూపించుకుంటున్నాడు. నటుడుగా మెప్పిస్తున్నాడు.

ఈ మూవీలోనూ విజయ్‌గా తనదైన నటనతో, కామెడీతో అలరించారు. అమాయకత్వంలో నవ్వులు పూయించాడు. వెన్నెల కిశోర్ తో కలిసి వెండితెరపై రచ్చ చేశారు. ఇక వెన్నెల కిశోర్‌ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇందులో వీరిద్దరే మెయిన్‌ హైలైట్‌. ఇక కేతిక శర్మ గ్లామర్‌తోపాటు నటనతోనూ ఆకట్టుకుంది.

ఇవానా సైతం అందంతోపాటు అభినయంతోనూ కాసేపు అలరించింది. ఇక వీటీవీ గణేష్‌ కామెడీ మరో అసెట్‌గా చెప్పాలి. ఎప్పటిలాగే మెప్పించాడు. రాజేంద్రప్రసాద్‌ కాసేపు మెరిశారు. ఎమోషనల్‌గా ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రధారులు ఉన్నంతలో ఓకే అనిపించారు. 
 

66
single movie review

single movie review

టెక్నీషియన్లుః 
టెక్నీకల్‌గా మూవీ చాలా బాగుంది. విశాల్‌ చంద్రశేఖర్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంది. కామెడీకి తగ్గట్టుగా ఆయన అందించిన బీజీఎం కూడా అలరించేలా ఉంది. వేల్‌ రాజ్‌ కెమెరా వర్క్ మరో బలం. విజువల్స్ పరంగా చాలా కొత్తగా అనిపిస్తుంది. అదేసమయంలో కలర్‌ఫుల్‌గానూ ఉంటుంది. ఎడిటింగ్‌ ఫర్వాలేదు. నిర్మాణ విలువలకు కొదవ లేదు.

ఇక దర్శకుడు కార్తీక్‌ రాజు కామెడీని నమ్ముకుని ఈ మూవీని తెరకెక్కించాడు. ఆ విషయంలో ఆయన సినిమాకి న్యాయంచేశాడు. ఆడియెన్స్ ని అలరించడంలో సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. అయితే కథ పరంగా ఏదైనా కొత్తగా చేసి ఉంటే బాగుండేది. నవ్వులతోపాటు మంచి కథ కూడా ఉంటే సినిమా ఇంకా అదిరిపోయేది. 

ఫైనల్‌గాః `సింగిల్‌`తో నవ్వులు గ్యారంటీ. 
రేటింగ్‌ః 3
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Movie Review: టాక్సిక్‌ మూవీ రివ్యూ.. యష్‌, నయనతార, రుక్మిణి వసంత్‌ నటించిన సినిమా ఎలా ఉందంటే?
Recommended image2
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image3
Mangalya Balam Review: టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ 100 డేస్ సినిమా.. ఏఎన్నార్, సావిత్రి రొమాంటిక్ మూవీ, 'మాంగల్య బలం' రివ్యూ
Related Stories
Recommended image1
Subham Review : సమంత 'శుభం' మూవీ రివ్యూ
Recommended image2
Sai Pallavi: సాయి పల్లవికి ఎందుకు అంత క్రేజ్ ? ఆమె సూపర్ హిట్ చిత్రాల లిస్ట్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved