- Home
- Entertainment
- వెబ్ సైట్ లో జాన్వీ కపూర్ అశ్లీల మార్ఫింగ్ ఫోటోలు, వాళ్లు దారుణంగా అవమానించారంటున్న దేవర బ్యూటీ..
వెబ్ సైట్ లో జాన్వీ కపూర్ అశ్లీల మార్ఫింగ్ ఫోటోలు, వాళ్లు దారుణంగా అవమానించారంటున్న దేవర బ్యూటీ..
టీనేజ్ లో తనకు ఎదురైన షాకింగ్ అనుభవాల గురించి వెల్లడించింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. తన ఫోటోలు మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాల్ జరిగిన రచ్చ గురించి వివరించింది బ్యూటీ. ఇంతకీ ఆమె ఏమంటుందంటే..?

సోషల్ మీడియా ద్వారా సినిమా తారల ఎంత ఫేమస్ అవుతారో.. అంతే ఇబ్బందులు కూడా పడతారు. వారు పెట్టే పోస్టులు ఎంత వైరల్ అవుతాయో.. వారికి వచ్చే కామెంట్లు కూడా అంతే ఇబ్బందికరంగా.. అనుచితంగా ఉంటాయి. అలా అని అన్ని నెగెటీవ్ కామెట్లు మాత్రం రావు. కాని లైక్ లు, కామెంట్స్, వాటి నుంచి వచ్చే ఫాలోయింగ్. డబ్బులు, ఫేమ్, అవకాశాల కోసం చాలా మంది ఇవన్నీ భరిస్తుంటారు. అయితే అవి మితిమీరి మార్ఫింగ్ చేసిన ఫోటోలు అశ్లీల సైట్లలో పోస్టు చేయడం వరకు రకరకాలుగా వేధింపులకు గురవ్వడం వరకూ వెళ్తుంటాయి.
అయితే ఇప్పటికే మార్ఫింగ్ ఫోటోల ద్వారా చాలా మంది సెలబ్రిటీలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా ఆ లిస్టులో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ కూడా చేరింది. టీనేజ్ లో తన మార్ఫింగ్ ఫోటోలను అశ్లీల వెబ్ సైట్లలో చూసి షాకైనట్లు వెల్లడించింది.అశ్లీల వెబ్‌సైట్లలో తన మార్ఫింగ్ ఫోటోలు చూసి భయపడ్డాను అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ, హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor).
అవి చూసి తాను కంగారు పడినట్టు తెలిపారు. అయితే ఈ సంఘటన తన టీనేజ్ లో జరిగింది అని అంటుంది జాన్వీ. ఆమె మాట్లాడుతూ.. నేను టీనేజ్‌లో ఉన్నప్పుడు నా ఫొటోలు మార్ఫింగ్ చేసి పోర్న్ సైట్లలో పెట్టారు. అప్పుడు నేను పడిన బాధ వర్ణనాతీతం అన్నారు జాన్వీ.
Janhvi Kapoor
ఆ ఫోటోలు చూసి నాతో చదువుకుంటున్న తోటి విద్యార్థులు ఆ ఫొటోలపై.. నాపై జోక్స్ వేశారు. స్కూల్ ఎప్పుడు మానేస్తున్నావ్..ఇండస్ట్రీలో ఇక కష్టపడాల్సిన అవసరం లేదు..ఇప్పుడే అందరికీ తెలిసిపోయావ్..అని హేళన చేశారు అంటూ బాధపడింది జాన్వీ కపూర్. అయితే అప్పుడు ఆ మాటలు నన్ను ఎంతగానో బాధపెట్టాయి అని జాన్వీ చెప్పారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వూలో తన మనసులో మాట బయట పెట్టింది జాన్వీ.
ముఖ్యంగా, ఫొటో మార్ఫింగ్ అంశాన్ని ప్రస్తావించింది. అప్పుడు నాకు పదేళ్లుంటాయి. స్కూల్లోని కంప్యూటర్ ల్యాబ్ లో నా క్లాస్ మేట్ కంప్యూటర్ స్క్రీన్ పై నా ఫొటోలు చూసి నిర్ఘాంతపోయాను. ఆ ఫొటోలు చాలా అసౌకర్యంగా అనిపించాయి. దాదాపు పోర్నోగ్రఫీ సైట్లలో ఉండే ఫొటోల్లా అనిపించాయి. దాంతో నా ఫ్రెండ్స్ నావైపు అదోలా చూడడం మొదలుపెట్టారు.
ముఖ్యంగా, ఫొటో మార్ఫింగ్ అంశాన్ని ప్రస్తావించింది. అప్పుడు నాకు పదేళ్లుంటాయి. స్కూల్లోని కంప్యూటర్ ల్యాబ్ లో నా క్లాస్ మేట్ కంప్యూటర్ స్క్రీన్ పై నా ఫొటోలు చూసి నిర్ఘాంతపోయాను. ఆ ఫొటోలు చాలా అసౌకర్యంగా అనిపించాయి. దాదాపు పోర్నోగ్రఫీ సైట్లలో ఉండే ఫొటోల్లా అనిపించాయి. దాంతో నా ఫ్రెండ్స్ నావైపు అదోలా చూడడం మొదలుపెట్టారు.
Janhvi Kapoor
ఇక శ్రీదేవ మరణం తరువాత 2018లో జాన్వీ కపూర్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ధడక్ సినిమాతో హీరోయిన్ మెరిసింది. అన్ని కథా బలం ఉన్న పాత్రలే చేసింది. రీసెంట్ గా బాలీవుడ్ లో మిలీ మూవీలో కనిపించింది. చివరి సారిగా వరుణ్ ధావన్ తో కలిసి బవాల్ మూవీలో సందడి చేసింది.
ఇక ప్రస్తుతం సౌత్ ప్లైట్ ఎక్కింది జాన్వీ. సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టింది. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమాలో చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ కపూర్ పైన చెప్పిన విషయాలు పంచుకున్నారు. సెలబ్రిటీల జీవితంలో కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని సామాన్యులతో పాటు వారి జీవితం కూడా కష్టాలు తప్పవని తెలుస్తోంది.