రెమ్యునరేషన్ భారీగా పెంచిన జాన్వీ కపూర్, రామ్ చరణ్ మూవీకి ఎంత తీసుకుంటుందంటే?
నిన్నగాక మొన్న టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్ ఒక్క సినిమాతోనే రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందట. ఒక్క సినిమా హిట్ అవ్వడంతో జాన్వీ పారితోషికం ఎంత పెంచిందో తెలుసా?

టాలీవుడ్ ను టార్గెట్ చేసిన జాన్వీ కపూర్
బాలీవుడ్ తో తనకంటూ సొంత గుర్తింపు సాధించింది జాన్వీ కపూర్. శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినా... సొంత టాలెంట్ తో ఎదిగేప్రయత్నం చేస్తోంది. అందుకే నటన విషయంలో కాని, గ్లామర్ విషయంలో కాని ఏమాత్రం తగ్గడంలేదు. ముందుగా బాలీవుడ్ లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ.. ఆతరువాత సౌత్ పై కాన్సంట్రేషన్ చేసింది. సౌత్ లో కూడా మరీ ముఖ్యంగా టాలీవుడ్ పై గురి పెట్టింది జాన్వీ కపూర్. బాలీవుడ్ లో ఎక్కువగా ఆర్ట్ మూవీస్ చేసిన జాన్వీ.. టాలీవుడ్ లో మాత్రం కమర్షియల్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
పాన్ ఇండియా గుర్తింపు కోసం
పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు కోసం ప్లాన్ చేసింది జాన్వీ. అందులో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో దేవర సినిమాలో సందడి చేసింది బాలీవుడ్ బ్యూటీ. దేవర సినిమా తరువాత వరుసగా ఆఫర్లు ఆమెను చుట్టుముట్టాయి. కాని సౌత్ లో సెలక్టీవ్ గా సినిమాలకు సైన్ చేస్తోంది బ్యూటీ. నేచురల్ స్టార్ నాని సరసన హీరోయిన్ గా ఆఫర్ వచ్చినా సున్నితంగా తిరస్కరించిన జాన్వీ.. ఆతరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రెమ్యునరేషన్ భారీగా పెంచిన జాన్వీ
ప్రస్తుతం ఆమె చరణ్ జోడీగా పెద్ది సినిమాలో నటిస్తోంది. బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ సూప్ ఫాస్ట్ గా సాగుతోంది. ఇక ప్రస్తుతం జాన్వీ కపూర్ రెమ్యునరేషన్ పై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. దేవర సినిమా కోసం జాన్వీ 5 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమా హిట్ అవ్వడంతో రెమ్యునరేషన్ ను మరో కోటి పెంచేసిందట జాన్వీ. రామ్ చరణ్‌తో నటిస్తున్న ‘పెద్ది’ సినిమాలో హీరోయిన్‌గా నటించేందుకు 6 కోట్లు వసూలు చేస్తుందట జాన్వీ కపూర్.
పెద్ది సినిమాలో చరణ్ జోడీగా జాన్వీ
'పెద్ది’ సినిమాను ఉప్పెన ఫేం, జాతీయ అవార్డు విజేత సనా బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు (మీర్జాపూర్ ఫేమ్) వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
సోషల్ మీడియాలో కూడా జాన్వీ హవా
సినిమాలతో పాటు ఆడ్ ఫిల్మ్స్ , సోషల్ మీడియా గ్రూప్స్ ద్వారా కూడా సంపాదిస్తోంది జాన్వీ కపూర్. జాన్వీని ఇన్‌స్టాగ్రామ్‌లో 2.6 కోట్లకు పైగా నెటిజన్లు ఫాలో అవుతున్నారు. నార్త్ ఆడియెన్స్‌కి బాగా పరిచయమున్న జాన్వీ..ప్రస్తుతం సౌత్ ఆడియన్స్ ను కూడా బట్టలో వేసుకునే పనిలో ఉన్నారు. అంతే కాదు మార్కెట్ మంచిగా ఉండటంతో పాన్ ఇండియా సినిమాల కోసం జాన్వీ అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారు. జాన్వీ ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు దక్షిణాదిలోనూ పలు సినిమాలపై చర్చలు జరుపుతోంది. ‘పెద్ది’ సినిమా విషయానికి వస్తే, త్వరలో షూటింగ్ పూర్తి చేసి 2025 లో విడుదల చేయాలన్న ప్లాన్ ఉన్నట్లు సమాచారం.