- Home
- Entertainment
- Janaki kalaganaledu: మల్లిక చేతే నిజం చెప్పించిన జానకి.. విడాకులు కావాలంటూ మల్లిక గోలా!
Janaki kalaganaledu: మల్లిక చేతే నిజం చెప్పించిన జానకి.. విడాకులు కావాలంటూ మల్లిక గోలా!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 9వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... జ్ఞానాంబ, జానకిని గది లో నుంచి బయటకు పిలుస్తూ ఇవి మన వంశపారంపర్యంగా వస్తున్న తోరాలు. మనల్ని ఎల్లకాలం చల్లగా చూస్తున్న తోరాలు. అలాంటి వీటిని నీ పుస్తకాలు పెట్టడం కోసం కింద పారేస్తావా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు?.షరతులు పెట్టి 24 గంటలు కూడా అవ్వలేదు. అప్పుడే దాన్ని హద్దు మీరావు. నీ చదువు కారణంగా నీ భర్తనీ, ఇంటిని తక్కువ చేయకుండా ఉండాలి అని చెప్పాను.
అప్పుడే నువ్వు దాన్ని హద్దు మీరావు అని తిడుతూ ఉండగా మల్లికా వచ్చి "ఇప్పుడే ఎలాగైతే ఐపీఎస్ అయిన తర్వాత ఇంక మనల్ని పట్టే పట్టించుకోదు అత్తయ్య గారు.కళ్ళు నెత్తి మీద పెట్టుకుంటుంది. ఇలాగైతే మనకి విలువ ఇవ్వదు. ఇప్పటికైనా మీరు నిర్ణయం మార్చుకోండి అత్తయ్య గారు అంటుంది మల్లిక. ఆ గోడ మీద రాసిన ఐదవకాశాల్లో ఒకటి చేరిపేయన అత్తయ్య గారు అని చెప్పి వెళ్లి చెరిపేస్తూ ఉండగా జానకి మల్లికని ఆపి ఒకసారి రమ్మంటుంది.
అప్పుడు జానకి 'నా గదిలో నువ్వు కొట్టేసిన నక్లిస్ బయటకు తీయు" అని అంటుంది. మల్లికా తో సహా అందరూ షాక్ అయిపోతారు. నేను నీ నక్లెస్ తీయలేదు ఏ కోర్టుకెళ్లి చెప్పమన్నా ఈ మాట చెప్తాను అని అంటుం.ది మరి నీ చేతికి పసుపు ఎందుకు అంటుకుంది?అని జానకి అడగక ఆ తోరాలు కింద పెడుతున్నప్పుడు అంటుకున్నట్టు ఉన్నది. అంతేగాని నీ నక్లెస్ తీయడం వల్ల కాదు అని చెప్పి నోరు జారుతుంది మల్లికా .ఇంట్లో వాళ్ళందరూ మల్లికను తిడతారు.
మల్లిక వెంటనే జ్ఞానాంబ కాళ్ళ మీదకు వెళ్ళిపోయి, జానకిని ఐపీఎస్ చదవడానికి ఒప్పుకున్నారు కానీ నాకు నా భర్తకి పట్నంలో కాపురం పట్టుకోడానికి ఒప్పుకోలేదు అని ఇలా చేశాను అత్తయ్య గారు. నన్ను క్షమించండి అంటూ ఏడుస్తూ ఉంటుంది.అప్పుడు జ్ఞానాంబా మల్లికని ,ఇదే నీ చివరి అవకాశం ఇంకోసారి ఇలా చేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు అంటూ తిడుతుంది.తోరాలు కింద పడిపోయాయి అన్న కోపంతో నిన్ను ఒక మాట అన్నాను జానకి ఏమీ అనుకోవద్దు అని అంటుంది జ్ణానాంబ. కుల్లుకుంటు ఏడుస్తుంది మల్లిక. ఆ తర్వాత సీన్లో మల్లిక బట్టల షాప్ లో ఉన్న విష్ణు దగ్గరకి వచ్చి నాకు విడాకులు కావాలి.
ఇప్పుడే లాయర్ దగ్గరికి వెళ్దాం పద అంటుంది. ఏమైంది అని విష్ణు అడగగా కూరలో ఉప్పు తక్కువ అయింది అన్న భర్తనైనా భరించొచ్చు గాని అత్త కోడలు గొడవలు లో భార్యకి సపోర్ట్ చేయని భర్తని మాత్రం అస్సలు భరించలేము అని అంటుంది మల్లిక.అక్కడ నువ్వు తప్పు చేశావని స్పష్టంగా తెలుస్తుంది నేనక్కడికి వచ్చి ఏం చేయగలను అని విష్ణు అంటాడు. అక్కడ మీ అన్నయ్య తన భార్య కోసం వాళ్ళ అమ్మకి నమ్మకద్రోహమే చేశాడు. కనీసం నువ్వు నాకు ఇది కూడా చేయలేవా?
నీకు ఇప్పుడు నేను రెండే ఆప్షన్స్ ఇస్తున్నాను ఒకటి నాకు విడాకులు ఇవ్వు లేకపోతే నేను ఏది చెప్తే అది నువ్వు చేస్తానని ఒట్టి ఇవ్వు అని షరతులు పెడుతుంది. సరే చేస్తాను అని అంటాడు విష్ణు. ఆ తర్వాత సీన్లో రామా స్వీట్ కొట్టు లో 200 కి బదులు 500 ఇస్తాడు. ఏమిటి పరధ్యానంలో ఉన్నారు అని జానకి రామాను అడుగుతుంది. ఆ గోడ మీద షరతులు గురించి భయమేస్తుంది. ఇప్పుడు మల్లిక చేసిన తప్పు మీరు రుజువు చేశారు కాబట్టి సరిపోయింది.
అది రుజువు చెయ్యలేకపోతే మనకి ఒక అవకాశం కోల్పోయినట్టే కదా అని అనగా ఐపీఎస్ అంటే సమాజంలో సమస్యలే కాదు ఇంట్లో సమస్యలు కూడా తెలివిగా పరిష్కరించడమే. నేను దాన్ని చూసుకుంటాను కానీ నాకు ఆకలేస్తుంది రండి తిందాం అని జానకి అంటుంది. జానకిరామలు అక్కడ కూర్చుని ఆనందం గా భోజనం తింటారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుం.ది తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!