- Home
- Entertainment
- Janaki kalaganaledu: ఇంట్లో వాళ్లని కలిపేందుకు ప్రయత్నిస్తున్న జానకి.. ఏం జరగనుంది?
Janaki kalaganaledu: ఇంట్లో వాళ్లని కలిపేందుకు ప్రయత్నిస్తున్న జానకి.. ఏం జరగనుంది?
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఐపీఎస్ కలను నిజం చేసుకునేందుకు అత్తవారింట్లో జానకి పడే కష్టాలే ఈ సీరియల్ కాన్సెప్ట్. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు అక్టోబర్ 24వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. జ్ఞానాంబ కుటుంబ సభ్యులందరూ కలిసి పూజారి దగ్గరకు వెళ్లి అర్చన చేయించమని అంటారు. అప్పుడు మల్లిక మాత్రం నా మాకు విడిగా చేయించమని అడగగా అదేంటమ్మా ఎప్పుడు కలిసి చేస్తారు కదా ఈసారి ఎందుకు విడిగా చేస్తున్నారు అని పూజారి అడుగుతారు. దానికి మల్లిక, జరిగిన విషయం ఏమిటంటే అని చెప్పేలోగా జానకి, మరేమీ లేదు పంతులు గారు మల్లిక కడుపుతో ఉన్నది కదా దానికోసం తన పుట్టబోయే బిడ్డ కోసం విడిగా చేస్తే బిడ్డకు మంచిది కదా అలాగే అఖిల్, జెస్సీ వాళ్ళకి కూడా విడిగానే చేయించండి అని అంటుంది.దానికి పూజారి గారు అలాగా అమ్మా నేను కంగారు పడ్డాను ఎందుకు ఇలా అడుగుతున్నారా అని, అని లోపలికి వెళ్లి అర్చన చేయిస్తాడు. అప్పుడు మల్లిక, పంతులుగారు జానకి చెప్పేది అబద్ధం అసలు విషయం ఏంటంటే అని చెప్పే లోగా జానకి గుడి గంటలు కొడుకు మల్లిక గొంతు ఎవరికి వినిపించకుండా చేస్తుంది.
అప్పుడు అందరూ పూజ చేస్తారు తర్వాత మల్లిక దగ్గరకు వెళ్లిన గోవిందరాజు, చూడమ్మా మల్లికా నీ నోరిని రేపటి వరకు అదుపులో పెట్టుకుంటే మంచిది అని అనగా నా నోటికి తిండికి హద్దు అదుపు ఉండదు అని తెలుసు కదా మావయ్య గారు.అయినా రేపు వెళ్ళిపోయే వాళ్ళం ఇప్పుడు మాతో ఇంకెందుకులెండి అని అంటాది. ఆ తర్వాత సీన్లో ఒక ఇంటి కుటుంబం అంతా జ్ఞానాంబ ఎదురుగా నిలబడి, అమ్మ మిమ్మల్ని చూస్తాం అనుకోలేదు మిమ్మల్ని చూడడం మంచిది అయింది అని చెప్పి వాళ్ళ పిల్లలతో నేను జ్ఞానాంబ గారు అని చెప్పాను కదా ఆవిడ ఈవిడే. వెళ్లి ఆశీర్వాదం తీసుకోండి అని జ్ఞానాంబ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటారు. మాకు ఇంత మంచి జీవితం ఉన్నదంట అది మీ వల్లే అని అనగా, నేనేం చేశాను నా వల్లే ఎందుకు వీళ్ళ జీవితం బాగుంటుంది అని జ్ఞానాంబ మనసులో అనుకుంటుంది.
అప్పుడు గోవిందరాజు మా జ్ఞానం వలన మీరు ఏవైనా లాభం పొందారా అని అనగా కాదండి ఒక ఉమ్మడి కుటుంబం అంటే ఎలా ఉండాలో మేము మీ కుటుంబాన్ని చూసి నేర్చుకున్నాము. ఒక కుటుంబంలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే అది ఉమ్మడి కుటుంబంలో ఉన్నంతవరకు హాయిగా ఉంటుంది అదే వేరు కాపురం పెడితే చాలా నరకంగా ఉంటుంది. ఉమ్మడి కుటుంబంలో మీరు ఉన్నంత బాగా ఇక్కడ ఎవరూ లేరు ఎవరైనా మిమ్మల్ని చూసుకోవాలి మీ పెద్దరికంలో మీ ఇల్లు చాలా బాగా నడుస్తుంది. మిమ్మల్నే మేము ఆదర్శంగా తీసుకున్నాము అని అంటారు.అప్పుడు జానకి ఈవిడని దేవుడే పంపించినట్టున్నారు అలాగే వేరు కాపురం పెడితే వచ్చే నష్టాలు కూడా మల్లిక వాళ్ళకి తెలియాలి అనుకొని ఆవిడతో, మీరు ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు
కదా మరి వేరుకాపురం పెడితే వచ్చే నష్టాలు గురించి మాకు చెప్పగలరా అని అనగా జ్ఞానాంబ గారి లాంటి మంచి మనసు ఉన్న వ్యక్తి ఇంట్లో కోడలుగా ఉన్నావు నీకు తెలియదేంటమ్మా అని అనగా మీ నోటితో వినాలని ఉన్నది చెప్పండి అని జానకి అంటుంది. అప్పుడు వాళ్లు, మేము కూడా కొన్ని రోజులు ఒకరికొకరు పడక వేరు కాపురం పెట్టాము అప్పుడే మాకు అర్థమైంది వేరు కాపురం ఉంటే సమాజంలో మనకి విలువ ఉండదు. ఎవరూ మనల్ని పలకరించరు పలకరించినా ప్రేమ ఉండదు, కష్టం వస్తే ఆదుకోడానికి మనిషి కూడా ఉండడు. పిల్లలు నానమ్మ తాతయ్యల కోసం ఆరాటపడుతున్నారు. మేము మా ఉద్యోగాలు పనిమీద వాళ్లని కేర్ సెంటర్ లలో వదిలేస్తున్నాను వాళ్ళు ఎలా ఉన్నారు కూడా పట్టించుకోవడం లేదు. ఒకవైపు మా అత్తయ్య, మావయ్య పిల్లల కోసం బాధపడుతున్నారు అందుకే ఇంక మేము ఒక మాట మీదకు వచ్చి మళ్ళీ ఉమ్మడి కుటుంబంలో బతుకుతున్నాము అని అంటారు. అప్పుడు మల్లిక, జానకి కావాలనే ఇలా అడుగుతున్నది దీన్నిబట్టి అయినా మేము మనసు మార్చుకుంటాము అనుకుంటుంది.
కానీ నేను తగ్గను అని అనుకుంటుంది మల్లిక. అప్పుడు వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు జానకి విష్ణు, తో చూసావా విష్ణు వేరు కాపురం పెడితే ఇన్ని నష్టాలు వస్తాయి. మీరు ఉండలేరు చిన్నప్పటినుంచి అందరూ కలిసిమెలిసి పెరిగిన తర్వాత విడిగా ఉండడాన్ని మీరు అలవాటు చేసుకోలేరు. మల్లిక ఏదో అన్నదని తొందరపడి నువ్వు నిర్ణయం తీసుకున్నావు ఇంక అఖిల్ నువ్వు ఇంట్లో చాలా గారంభంగా పెరిగావు. అన్నలు ఇద్దరి మధ్య ఏ కష్టం లేకుండా ఉన్నావు ఇప్పుడు ఒకేసారి సమాజంలోకి వెళ్తే నువ్వు తట్టుకోలేవు అని అంటుంది.
అప్పుడు మల్లిక మనసులో, ఏంటి మా ఆయన మనసు మార్చేసే ప్రయత్నం చేస్తుంది కొంపతీసి మారిపోతారా అని అనుకుంటుంది. ఆ తర్వాత జానకి గోవిందరాజుతో, మావయ్య గారు మీరు ఒకసారి అందర్నీ కూర్చోబెట్టి మాట్లాడండి అని అనగా అందరూ మెట్ల మీద కూర్చుంటారు. జ్ఞానాంబ ఆలోచనలలో పడుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే.