కన్నడ చిత్ర పరిశ్రమలో కొందరు స్టార్ హీరోలు లేడీ గెటప్స్ వేసి కూడా పాపులర్ అయ్యారు. ఏ హీరో, ఏ సినిమాలో లేడీగా కనిపించి మెప్పించారో ఓ లుక్కేద్దాం.
entertainment Jun 26 2026
Author: Aithagoni Raju Image Credits:social media
Telugu
డా. రాజ్‌కుమార్
బి.ఎస్. రంగా దర్శకత్వం వహించిన 'చంద్రహాస' సినిమాలో డా. రాజ్‌కుమార్ లేడీ గెటప్ వేశారు. ఇందులో ఆయన డ్యాన్స్ టీచర్‌గా నటించి అందరి మనసులు దోచుకున్నారు.
Image credits: social media
Telugu
శ్రీధర్
పి.ఎన్. రామచంద్రరావు డైరెక్షన్‌లో వచ్చిన 'బొంబాట్ హెండ్తి' సినిమాలో హీరో శ్రీధర్ మహిళా వేషంలో కనిపించారు.
Image credits: social media
Telugu
శరణ్
హీరో శరణ్ 'జై లలిత' అనే కామెడీ సినిమాలో లేడీ గెటప్‌లో నటించి కడుపుబ్బా నవ్వించారు.
Image credits: social media
Telugu
జగ్గేష్
నవరస నాయక జగ్గేష్ 'మేకప్' అనే సినిమాలో మహిళా పాత్రలో మేకప్ వేసుకుని అదరగొట్టారు.
Image credits: social media
Telugu
ప్రకాశ్ రై
దక్షిణాది పాపులర్ నటుడు ప్రకాశ్ రై 'అనుకూలక్కొబ్బ గండ' సినిమాలో లేడీ గెటప్‌లో చాలా క్యూట్‌గా కనిపించారు.
Image credits: social media
Telugu
సాయికుమార్
'కల్పన' అనే హారర్ సినిమాలో సాయికుమార్ ట్రాన్స్‌జెండర్ (మంగళముఖి) పాత్రలో కనిపించారు. ఈ క్యారెక్టర్ పెద్ద హిట్ అయ్యింది. సాయికుమార్ కన్నడలో స్టార్ రాణిస్తోన్న విషయం తెలిసిందే.
Image credits: social media
Telugu
శివరాజ్‌కుమార్
ఇటీవల `పెద్ది`లో మెరిసిన హీరో శివరాజ్‌కుమార్ '45', 'మిడిత శ్రుతి' సినిమాల్లో మహిళగా కనిపించి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు.
Image credits: social media
Telugu
సంచారి విజయ్
'నాను అవనల్ల అవళు' సినిమాలో ట్రాన్స్‌జెండర్ పాత్రలో అద్భుతంగా నటించినందుకు సంచారి విజయ్ జాతీయ అవార్డు అందుకున్నారు.
Image credits: social media
Telugu
డా. విష్ణువర్ధన్
సాహససింహ విష్ణువర్ధన్ 'హబ్బ' సినిమాలో చీర కట్టుకుని అమ్మాయిలా నటించారు. ఈ సినిమాలో అంబరీష్, శశికుమార్ కూడా గెటప్స్ మార్చడం విశేషం.