MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • AK47: వెంకటేష్‌, త్రివిక్రమ్‌ మూవీ రీ షూట్.. `ఆదర్శ కుటుంబం` దానికి కాపీనా, రీమేకా?

AK47: వెంకటేష్‌, త్రివిక్రమ్‌ మూవీ రీ షూట్.. `ఆదర్శ కుటుంబం` దానికి కాపీనా, రీమేకా?

AK47: వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న `ఆదర్శ కుటుంబం హౌజ్‌ నెంబర్‌ 47` మూవీని రీ షూట్‌ చేస్తున్నారట. ఈ చిత్రం ఆ హిట్‌ సినిమాకి కాపీ అనే వార్తలు వినిపిస్తున్నాయి. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 26 2026, 07:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబోలో ఆదర్శ కుటుంబం
Image Credit : Asianet News

వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబోలో ఆదర్శ కుటుంబం

వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో మొదటిసారి సినిమా రూపొందుతుంది. `ఆదర్శ కుటుంబం హౌజ్‌ నెంబర్ 47` పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ(చినబాబు) నిర్మిస్తున్నారు. వెంకటేష్‌ నటిస్తున్న 77వ చిత్రమిది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీ షూటింగ్‌ చివరి దశకు చేరుకుంటుందని, ఈ దసరాకి మూవీ విడుదలయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రీ షూట్‌లో ఆదర్శ కుటుంబ హౌజ్‌ నెం 47
Image Credit : Asianet News

రీ షూట్‌లో ఆదర్శ కుటుంబ హౌజ్‌ నెం 47

ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె గతంలో `కేజీఎఫ్‌`లో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ ఆకట్టుకుంది. సినిమా రిలీజ్ డేట్‌ కూడా వచ్చింది. అక్టోబర్‌ 2న ఈ మూవీని రిలీజ్‌ చేయనున్నట్టు ప్రకటించారు. కానీ ఇప్పుడీ సినిమా దసరాకి రావడం కష్టమనే టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం రీ షూట్‌ జరుగుతుందట. కథలో చాలా మార్పులు చేస్తున్నారట. ఇది రీమేకా? కాపీనా అనే వాదన కూడా తెరపైకి వచ్చింది. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Related Articles

Related image1
Vadde Naveen: వడ్డే నవీన్‌ మొదటి భార్య ఎవరో తెలుసా? విడాకుల కారణంగానే హీరోగా కెరీర్‌ క్లోజ్‌, తొక్కేసింది ఎవరు?
Related image2
Samantha Remuneration: `మా ఇంటి బంగారం`కి సమంత పారితోషికం ఎంతో తెలుసా? కొడితే కుంభస్థలమే
35
ఒకే కథతో బ్లాస్ట్, ఏకే 47 మూవీస్‌
Image Credit : Asianet News

ఒకే కథతో బ్లాస్ట్, ఏకే 47 మూవీస్‌

దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ పై ఒక విమర్శ, ఒక రూమర్‌ ప్రధానంగా వినిపిస్తుంది. ఆయన హాలీవుడ్‌ చిత్రాల నుంచి కాపీ కొడతారని ఆరోపణలు ఉన్నాయి. ఆయన రూపొందించిన చాలా సినిమాలకు ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఇప్పుడు `ఆదర్శ కుటుంబం హౌజ్ నెంబర్‌ 47`(ఏకే 47) మూవీకి కూడా అదే రూమర్స్‌ వస్తున్నాయి. ఈ మూవీ ఇటీవల వచ్చిన అర్జున్‌ సర్జా `బ్లాస్ట్` మూవీ ఒకే కథతో రూపొందుతున్నాయట.  బ్లాస్ట్ మూవీ మంచి విజయం సాధించింది. అర్జున్‌కి హీరోగా మంచి కమ్ బ్యాక్ ఇచ్చిందని చెప్పొచ్చు. అందులో హీరోకి తమ కుటుంబానికి ఆపద వస్తే, ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం ఆయన చేసే పోరాటమే సినిమా. 

45
బ్లాస్ట్ తో ఏకే 47 రీ షూట్‌
Image Credit : our own

బ్లాస్ట్ తో ఏకే 47 రీ షూట్‌

ఇప్పుడు వెంకటేష్‌ హీరోగా రూపొందుతున్న మూవీ కథ కూడా సేమ్‌ అట. ఇందులో వెంకటేష్‌ ఒక రా ఏజెంట్‌గా ఫ్లాష్ బ్యాక్‌ ఉంటుందని, కానీ అవన్నీ వదిలేసి ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్‌ని లీడ్ చేస్తుంటాడట. కానీ అనుకోకుండా తన  కుటుంబానికి ఆపద వస్తుంది. దీంతో మళ్లీ తాను గతంలోకి వెళ్లి, కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఆయన చేసిన పోరాటమే మూవీ అని తెలుస్తోంది. అటు బ్లాస్ట్ స్టోరీ, ఇటు `ఆదర్శకుటుంబం` కథలు సేమ్‌. అందుకే ఇప్పుడు కథలో మార్పులు చేస్తున్నాడట త్రివిక్రమ్‌. ఇప్పటికే షూట్‌ చేసిన చాలా సీన్లని పక్కన పెట్టి మళ్లీ రీ షూట్‌ చేస్తున్నారట.

55
ఏకే 47 దీనికి రీమేకా?
Image Credit : facebook/@venkateshdaggubati

ఏకే 47 దీనికి రీమేకా?

ఇదిలా ఉంటే మొన్న వచ్చిన `బ్లాస్ట్`, ఇప్పుడు వెంకటేష్‌ హీరోగా రూపొందుతున్న `ఏకే 47` కూడా ఓ హాలీవుడ్‌ మూవీకి కాపీగానీ, రీమేక్‌ గానీ అంటున్నారు. హాలీవుడ్‌లో వచ్చిన `నోబడీ` అనే మూవీ నుంచి ఇన్‌స్పైర్‌ అయి ఈ సినిమాలను తీస్తున్నారట. ఇవే కాదు `ది అకౌంటెంట్`, `బీ కీపర్`, `ది ఫ్యామిలీ మ్యాన్‌` వంటి చిత్రాలు కూడా ఇదే తరహా కథతో రూపొందాయి.  అయితే త్రివిక్రమ్‌ ఇందులో ఒక సినిమా రీమేక్‌ రైట్స్ ని తీసుకున్నారని, అధికారికంగానే రీమేక్‌ చేస్తున్నారని సమాచారం. కాకపోతే ఆ విషయాన్ని ఎక్కడా వెల్లడించలేదు. మున్ముందు చెబుతారేమో చూడాలి. కానీ వెంకటేష్‌ సినిమా రీషూట్‌ అనేది ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌గా మారిందని చెప్పొచ్చు. దీంతో ఈ సినిమా దసరాకి రిలీజ్‌ కావడం కష్టమే అంటున్నారు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
దగ్గుబాటి వెంకటేష్
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
GV Narayana Rao Passes Away: చిరంజీవి, రజినీకాంత్ బెస్ట్ ఫ్రెండ్ జీవీ నారాయణ రావు కన్నుమూత, టాలీవుడ్ లో తీవ్ర విషాదం..
Recommended image2
Toxic Day 1 collections: నెగిటివ్ టాక్స్ మధ్య దుమ్మురేపిన టాక్సిక్ కలెక్షన్స్, యశ్ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందో తెలుసా?
Recommended image3
Trivikram - Pawan: అజ్ఞాతవాసి ఫెయిల్యూర్, ఆ 48 గంటలు ఏం జరిగిందంటే.. భార్య పిల్లలకు చెప్పేసిన త్రివిక్రమ్
Related Stories
Recommended image1
Vadde Naveen: వడ్డే నవీన్‌ మొదటి భార్య ఎవరో తెలుసా? విడాకుల కారణంగానే హీరోగా కెరీర్‌ క్లోజ్‌, తొక్కేసింది ఎవరు?
Recommended image2
Samantha Remuneration: `మా ఇంటి బంగారం`కి సమంత పారితోషికం ఎంతో తెలుసా? కొడితే కుంభస్థలమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved