- Home
- Entertainment
- Janaki Kalaganledu: తన కొడుకును జానకి మాయ నుంచి తప్పించాలని చూస్తున్న జ్ఞానాంబ.. కానీ రామచంద్ర మాత్రం?
Janaki Kalaganledu: తన కొడుకును జానకి మాయ నుంచి తప్పించాలని చూస్తున్న జ్ఞానాంబ.. కానీ రామచంద్ర మాత్రం?
Janaki Kalaganledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబం అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు ఏప్రిల్ 25 వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలోనే రామచంద్ర (RamaChandra) జానకి లు ఇద్దరూ కలిసి బైక్ మీద ఒక చోటికి వెళుతూ ఉంటారు. అనుకోకుండా రామచంద్రకు ఫోన్ రావడంతో ఒక దగ్గర బైకు ఆపుతాడు. ఆ ప్లేస్ లో జానకి (Janaki) తాను ఇదివరకు ప్రశాంతంగా ఒంటరిగా చదువుకున్న ప్లేస్. కాబట్టి ఆ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది.
అదే క్రమంలో రామచంద్ర (Ramachandra) తాను ఇదివరకు ఆ వైపు నుంచి వస్తుండగా అక్కడ ఒక అమ్మాయి చదువుకుంటూ కనిపించింది అని చెబుతాడు. అమ్మాయిని చూస్తే చాలా ఆనందంగా అనిపించింది అని జానకి (Janaki) తో అంటాడు. అంతేకాకుండా ఆ అమ్మాయిని చూస్తే ఒక స్వీట్ బాక్స్ కూడా ఇవ్వాలి అని అనిపించింది అని అంటాడు.
దాంతో జానకి (Janaki) ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో కరెంటు పోయి ఉంటుంది. దాంతో ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నాదేమో అని అంటుంది. అంత మాత్రాన మీరు స్వీట్ బాక్స్ ఇవ్వాళా.. అంటే ఏంటి మీ ఉద్దేశం అని రామచంద్ర (Ramchandra) పై అరుస్తుంది. ఇక ఆ అమ్మాయి నేనే అని తెలుసుకున్న జానకి మనసులో ఆనంద పడుతూ ఉంటుంది.
ఇక అదే క్రమంలో జానకి (Janaki) తన మాటలతో ఆ అమ్మాయి నేనే అని అర్థమయ్యేలా ఇన్ డైరెక్టుగా రామచంద్రకు చెబుతుంది. దాంతో రామచంద్ర ఎంతో ఆనంద పడతాడు. ఇక జానకి.. నేను చాలా అదృష్టవంతురాలునండి నేనెవరో తెలియక ముందే నా చదువుకు మీరు గిఫ్ట్ ఇచ్చారు అని రామచంద్ర (Ramachandra) చేతులు పట్టుకొని చెబుతుంది.
ఇక రామచంద్ర (Ramachandra), జానకి లు ఇంటికి వెళ్ళి గోడ దూకుతున్న క్రమంలో వాళ్ళిద్దరికీ లూసీ అనే అమ్మాయి పర్స్ దొరుకుతుంది. ఇక తన పాస్పోర్ట్ కూడా వాళ్లకు దొరుకుతుంది. ఇక ఆ తర్వాత రోజు జ్ఞానాంబ (Jnanaamba) తన కూతురికి జడ వేస్తూ ఉంటుంది. ఆ క్రమంలో కుటుంబమంతా ఎవరి పనులు వాళ్ళు హాయిగా చేసుకుంటూ ఉంటారు.
అదే క్రమంలో రామచంద్ర (Ramachandra) జానకి ను అద్దంలో చూసుకుంటూ సైగ చేస్తూ ఉంటాడు. అది గమనించిన జ్ఞానాంబ (Jnanaamba) నా కొడుకును ఎలాగైనా జానకి మాయ నుంచి తప్పించాలి అని అనుకుంటుంది. ఇక ఈ క్రమంలో రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.