- Home
- Entertainment
- Janaki kalganaledu: జానకికి మాతృత్వాన్ని దూరం చెయ్యాలనుకున్న మల్లిక.. నిజం తెలుసుకున్న జానకి ఏం చెయ్యనుంది?
Janaki kalganaledu: జానకికి మాతృత్వాన్ని దూరం చెయ్యాలనుకున్న మల్లిక.. నిజం తెలుసుకున్న జానకి ఏం చెయ్యనుంది?
Janaki kalganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki kalganaledu ) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమ, అనురాగాల నేపథ్యంలో కొనసాగుతుంది. కాగా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Janaki kalganaledu
జ్ఞానాంబ.. వెన్నెల నిశ్చితార్థ ముహూర్తానికి దిలీప్ (Dilip) ఫ్యామిలీ అందర్నీ రమ్మని చెప్పు అని రామచంద్ర కు చెబుతుంది. ఆ తర్వాత జానకి (Janaki ) నాటు వైద్యుడు తనకిచ్చిన మందులను ల్యాబ్ లో చెక్ చేయించి తన మీద విషప్రయోగం చేయాలి అనుకున్న విషయాన్ని తెలుసుకుంటుంది.
Janaki kalganaledu
దాంతో జానకి ఆ నాటు వైద్యుల దగ్గరకు పోలీసులతో వెళ్లి అతడి చొక్కాను పట్టుకుని మరి ఎందుకు చేసావ్ అని అడుగుతుంది. దాంతో ఆ వ్యక్తి మీ తోటి కోడలు మల్లిక (Mallika) ఇదంతా చేయించింది అని చెబుతాడు. అంతేకాకుండా ఆ వ్యక్తి మీకు ఎప్పుడు పిల్లలు పుట్టే యోగం కలగకుండా చేయమని మల్లిక (Mallika) డబ్బులు కూడా ఇచ్చిందని చెబుతాడు.
Janaki kalganaledu
దాంతో జానకి (Janaki) షాక్ అవుతుంది. ఇక ఆనాటు వైద్యుడిని పోలీసులు తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత జానకి (Janaki) ఇంటికి వెళ్లి మల్లికను కోపంగా చూసుకుంటూ ఆ నాటు వైద్యుడికి కుట్ర చేయమని ఇచ్చిన డబ్బులను ఇస్తుండగా మల్లికా తెలిసిపోయిందని మనసులో ఎంతో టెన్షన్ పడుతుంది.
Janaki kalganaledu
ఇక అది చూసిన జ్ఞానాంబ (Jnanaamba) బాధపడుతుందేమో అని జానకి టాపిక్ మార్చి చెబుతుంది. ఆ తర్వాత జానకి (Janaki) తలుపులు వేసి నాలోని మాతృత్వాన్ని చెరిపేయాలని చుసిన నిన్ను చూస్తే నాకు అసహ్యం అనిపిస్తుంది అని మల్లికతో అంటుంది. ఇక అదే క్రమంలో పలు మాటలతో జానకి మల్లిక (Mallika) పై విరుచుకు పడుతుంది.
Janaki kalganaledu
ఆ తర్వాత మల్లిక కన్నబాబు (Kannababu) ద్వారా నువ్వు ప్రేమించిన అబ్బాయి నెంబర్ తీసుకున్నాను.. మీ పెళ్లి నేను ఎలాగైనా జరిపిస్తానని వెన్నలతో అంటుంది. దాంతో వెన్నెల కంగారు పడుతూ దిలీప్ కి ఫోన్ చేస్తుంది. ఇక అది చాటుగా మల్లిక (Mallika) వింటుంది.
Janaki kalganaledu
ఇక జ్ఞానాంబ (Jnanaamba ) ఫ్యామిలీ నిశ్చితార్థానికి వెళతారు. ఆ క్రమంలో జానకి ఇంట్లోకి వెళుతుండగా నువ్వు ఆగు అంటూ ఒక ముసలావిడ అపుతుంది. దాంతో జానకి (Janaki) కంగారు పడుతుంది. మరీ రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.