MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Janaki Kalaganaledu: జ్ఞానాంబతో ఎమోషనల్ గా మాట్లాడిన జానకి.. జ్ఞానాంబని నిలదీసిన గోవిందరాజులు?

Janaki Kalaganaledu: జ్ఞానాంబతో ఎమోషనల్ గా మాట్లాడిన జానకి.. జ్ఞానాంబని నిలదీసిన గోవిందరాజులు?

Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కుటుంబం పరువుతో కూడిన కాన్సెప్ట్ తో ఈ సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 16వ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.. 

3 Min read
Author : Navya G
Published : Jan 16 2023, 12:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఈరోజు ఎపిసోడ్లో మల్లిక స్నానం చేయడానికి బాత్రూం దగ్గరికి వెళ్ళగా బాత్రూంలో జెస్సి ఉండడంతో స్నానం చేద్దాము అనుకుంటే ఉదయాన్నే దూరేసింది ఇప్పుడు ఏం చేయాలి ఒళ్ళు కంపరంగా ఉంది అనుకుంటూ ఉంటుంది. జెస్సి అక్కడే వేచి చూస్తూ ఉంటుంది.  అప్పుడు పనిమనిషి చికిత అక్కడికి వచ్చి మల్లిక మీద సెటైర్లు వేస్తూ ఉంటుంది. అయినా ఈ జెస్సి ఇంకా రాలేదేంటి అని మల్లిక అటు ఇటు కాలు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటుంది. మరొకవైపు రామచంద్ర జానకి దగ్గరికి వచ్చి హడావిడి చేస్తూ టిఫిన్ కి పిలిచలేదు ఏంటి జానకి గారు తొందరగా టిఫిన్ వడ్డించండి షాప్ కి వెళ్ళాలి అని అంటాడు.
 

27

అప్పుడు జానకి ఏ షాప్ కి అని అడగడంతో మన షాప్ కి అని అంటాడు. అప్పుడు జానకి రామచంద్ర అసలు విషయాని గుర్తు తెచ్చుకొని ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. చాలా రోజులుగా అలవాటైపోయింది కదండి అందుకే మన షాపు మనది కాదు అన్న విషయాన్ని మరిచిపోయాను అంటాడు రామచంద్ర. అప్పుడు రామచంద్ర తినకుండా ఇల్లు గడవాలి అంటే ఏదో ఒక పని చేయాలి అని అక్కడినుంచి వెళ్ళిపోతూ ఉండగా జానకి ఎంతగా పిలిచినా కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు. అప్పుడు జానకి లోపలికి వెళుతుండగా జ్ఞానాంబ బయట కూర్చుని ఉండడం చూసి ఏంటి అత్తయ్య గారు ఇక్కడ కూర్చున్నారు అనగా జ్ఞానాంబ అక్కడి నుంచి లేచి ఇంట్లోకి వెళుతుండగా అత్తయ్య గారు ఒక నిమిషం ఆగండి అత్తయ్య గారు అని అంటుంది.
 

37

మేము చేసాము అనిపిస్తే ఒక మాట తిట్టండి లేదా కొట్టండి కానీ ఇలా ఉండకండి. మీ మౌనం కూడా నాకు నరకంగా ఉంది. కోడలు కూడా నా కూతురుతో సమానమని మీరే చాలా సార్లు అన్నారు కదా,మరి కూతురు తప్పు చేస్తే ఇలా దూరం పెడతారా అని అడుగుతుంది జానకి. ఇంటికి పెద్ద దిక్కు మీరు మిమ్మల్ని చూసే మేము ధైర్యంగా ఉంటాం అలాంటిది మీరే దూరంగా పెడితే మేము ఎలా ఉండాలి చెప్పండి అత్తయ్య అని జానకి ఎమోషనల్ గా మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటలు జెస్సీ గోవిందరాజులు ఇద్దరు వింటూ ఉంటారు.
 

47

 మా బాధలు ఎవరితో చెప్పుకోవాలి అత్తయ్య గారు ఆయన మంచి చేయాలని చూస్తే ఇలా చెడు ఎదురయింది అని ఎమోషనల్ గా మాట్లాడుతుంది జానకి. తమ్ముడు కోసం ఇలా చేశాడు కానీ ఆయన ఏనాడు మిమ్మల్ని దూరం చేసుకునే పని చేయడు ఆ విషయం మీకు కూడా తెలుసు కదా అత్తయ్య గారు అంటుంది. అప్పుడు జానకి ఎన్ని మాట్లాడిన కూడా జ్ఞానాంబ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇప్పుడు చికిత కావాలని చూడండి అమ్మగారు అయ్యగారికి చక్కెర ఎంత వేసినా కూడా చాలడం లేదు అంటున్నారు మీదైన వెయ్యండి ఇది చక్కెర కాదు అని అనగా గోవిందరాజులు కామెడీ చేయడంతో జ్ఞానాంబ నవ్వుతూ ఉంటుంది. అదిచూసి అందరూ సంతోష పడుతూ ఉంటారు.
 

57

అప్పుడు జానకి మీ నవ్వు ఎంత సంతోషంగా ఉంది అత్తయ్య గారు ఆ నవ్వు మా అందరికీ చాలా బలాన్ని ఇస్తుంది అనడంతో జ్ఞానాంబ నవ్వకుండా సైలెంట్ గా ఉంటుంది. అప్పుడు మల్లిక అక్కడికి వచ్చి ఎంతమంది చెప్పిన వినిపించుకోకుండా చికిత చేతిలో ఉన్న కరాచీ పొడి కాఫీ గ్లాసులో వేసుకొని తాగుతుంది. అది చూసి నవ్వుకుంటూ ఉండగా అప్పుడు చికిత అసలు విషయం చెప్పడంతో ఛీ ఛీ అనుకుంటూ చికితని కొడుతూ ఉండగా అందరూ అది చూసి నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు జ్ఞానాంబ సంతోషంగా నవ్వుతూ లోపలికి వెళ్తుంది. అది చూసి జానకి జెస్సి గోవిందరాజులు నవ్వుకుంటూ ఉంటారు.
 

67

మరొకవైపు రామచంద్రా రోడ్డుపై వెళ్తూ ఉండగా ఇంతలో తన స్వీట్ షాప్ బోర్డు తీసివేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చి మేము ఈ షాప్ ని అమ్ముకోలేదు బాబాయ్ నా మాట వినండి మా అమ్మ పేరుని తీసివేయొద్దండి బాబాయ్ అని అంటాడు. ఇంతలో భాస్కర్ రావు అక్కడికి వచ్చి అదేలా కుదురుతుంది రామా అని అంటాడు. అప్పుడు రామచంద్ర ఆ పేరును తీసేయొద్దండి అని వారిని బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు సరే అని వాళ్ళు ఆ స్వీట్ షాపు కీ ఉన్న ఫ్లెక్సీ ని మళ్ళీ అలాగే తగిలిస్తారు. మరొకవైపు జానకి ఒకవైపు చదువుకుంటూనే మరొకవైపు వంట చేస్తూ ఉంటుంది.
 

77

అది చూసి గోవిందరాజులు బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి జ్ఞానాంబ వస్తుంది. ఏంటండీ ఆలోచిస్తున్నారు అనగా మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను అనడంతో మీరు అవన్నీ ఆలోచించకండి అంటూ గోవిందరాజులు కి ధైర్యం చెబుతూ ఉంటుంది జ్ఞానాంబ. అప్పుడు గోవిందరాజులు జ్ఞానాంబను రామచంద్ర గురించి అడగగా పక్కకు తప్పించుకొని వెళ్లాలని చూస్తుంది. అప్పుడు మందులు అయిపోవడంతో జ్ఞానాంబ చికితను పిలవగా జానకి అక్కడికి వస్తుంది. చికిత బయటికి వెళ్ళింది ఏం కావాలో చెప్పండి అత్తయ్య గారు అని అడగగా నా మందులు అయిపోయాయి అని గోవిందరాజులు చెప్పడంతో సరే అత్తయ్య గారు ఆ పేపర్ ఇలా ఇవ్వండి మందులు తీసుకొస్తాను అనగా చేతికి ఇవ్వకుండా పక్కన పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జ్ఞానాంబ. ఆ తర్వాత జానకి తన గదిలోకి వెళ్లి చూడగా అక్కడ డబ్బులు లేకపోవడానికి ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Raakaasa Day 3 Box office: రాకాస మూవీ 3 రోజుల కలెక్షన్లు, బైకర్‌కి షాక్‌ ఇచ్చిన నిహారిక.. ర్యాంపేజ్‌
Recommended image2
Biker 3 Days Collections: `బైకర్‌` 3 రోజుల కలెక్షన్లు.. రాజశేఖర్‌, శర్వానంద్‌ ల సినిమా హిట్‌ కావాలంటే ఎంత రాబట్టాలంటే?
Recommended image3
Karthika Deepam 2 Today Episode April 6: కార్తీక్‌ని బ్లాక్‌ మెయిల్‌ చేసిన జ్యోత్స్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌తో ఛాలెంజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved