Janaki kalaganledu: జానకికి పిల్లలు పుట్టకుండా ప్లాన్ చేసిన మల్లిక!
Janaki kalaganledu: బుల్లితెరపై ప్రసారమయ్యే జానకి కలగనలేదు (Janaki kalaganledu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ఆదరణతో ఈ సీరియల్ కొనసాగుతోంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

Janaki kalaganledu
అసలు విషయం తెలియడంతో జ్ఞానాంబ బాధపడుతూ ఉంటుంది. దీంతో రామచంద్ర (Ramachandra) నీకు నిజంగా సంతోషపడే రోజు తప్పకుండా వస్తుంది అని జ్ఞానాంబతో అంటాడు. ఇక ఆ మాటలు జ్ఞానాంబ (Jnanaamba) ఏ మాత్రం పట్టించుకోకుండా అక్కడినుంచి బాధతో వెళ్ళిపోతుంది.
Janaki kalaganledu
ఆ తర్వాత మల్లిక జానకి కడుపు ఉత్తుత్తి కడుపు అయ్యిందని ఎంతో ఆనంద పడుతుంది. అంతే కాకుండా జానకి (Janaki) పూర్తిగా కడుపు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్లాన్ లు కూడా వేస్తుంది. ఆ తర్వాత జ్ఞానాంబ (Janamaba), రామచంద్ర దంపతులను పిలిచి మీరు ఇప్పట్లో ఏమన్నా పిల్లలు వద్దు అనుకున్నారా అని అడుగుతుంది.
Janaki kalaganledu
దాంతో రామచంద్ర (Ramachandra) అలాంటిది ఏమీ లేదమ్మా అని అంటాడు. ఇక జ్ఞానాంబ (Jnanaamba) పెళ్లి అయ్యి ఇన్నేళ్లు అయినా మీకు ఎలాంటి విశేషం లేదంటే ఒకసారి డాక్టర్ ను కలవండి అని అంటుంది. అంతేకాకుండా కోడలిని తీసుకొని ఈరోజు ఆసుపత్రి కి వెళ్తాను అని అంటుంది.
Janaki kalaganledu
ఈలోపు నీలావతి, మల్లిక (Mallika) అక్కడికి వచ్చి నాటు వైద్యం గురించి చెప్పి వాటిని వాడమని జానకి (Janaki) తో చెబుతారు. దానికి జానకి షాక్ అయ్యి నేను ఇలాంటి వాటిని నమ్మను అని చెబుతుంది. ఇక జ్ఞానాంబ కూడా జానకిను నాటు మందులు వాడమని చెబుతుంది. దాంతో జానకి మరింత ఆశ్చర్యానికి గురి అవుతుంది.
Janaki kalaganledu
ఇక జానకిని నాటు వైద్యుల దగ్గరకు తీసుకుని వెళ్లి పిల్లలు పుట్టకుండా మల్లిక, నీలావతి (Mallika) లు మందులు ఇప్పిస్తారు. మరోవైపు జ్ఞానాంబ (Jnanaamba ) దంపతులు వెన్నెల నిశ్చితార్థం ముహూర్తం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు అక్కడకు మల్లిక వచ్చి జానకి నేను మందులు తీసుకున్నాము అంటూ చెప్పుకోస్తుంది.
Janaki kalaganledu
ఆ తరువాత జ్ఞానాంబ (Jnanaamba ), జానకి ఎక్కడ అని అడుగగా మల్లిక ఆమెకీ ఈ మధ్య షికార్లు ఎక్కువయ్యాయని జానకి (Janaki) గురించి చాడీలు చెబుతుంది. ఇక ఈ క్రమంలో జ్ఞానాంబ ఏవిధముగా రియాక్ట్ అవుతుందో రేపటి భాగం లో చూడాలి.