Janaki Kalaganaledu: కొత్త చిచ్చు రాజేసిన మల్లిక.. కుటుంబం మూడు ముక్కలు కాబోతుందా!
Janaki Kalaganaledu: బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు (Janaki Kalaganaledu) సీరియల్ మంచి పరువుగల కుటుంబ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈరోజు మే 5 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే జానకి (Janaki) ఇంట్లో పనులు చేస్తున్న విషయం లో మల్లిక అత్త గారికి అనేక మాటలు నూరిపోస్తుంది. జానకి నన్ను ఇంటి పనులు చేయనివ్వండి అత్తయ్య గారు అని వేడుకుంటుంది. కేవలం నిన్ను నా కొడుకు గురించే ఈ ఇంటికి రానించాను అని జ్ఞానాంబ (Jnanamba) అంటుంది.
ఈలోగా అక్కడకు రామచంద్ర (Ramachandra) రాగ ఏమీ లేదండి అని జానకి (Janaki) కవర్ చేసి వెళుతుంది. ఆ తర్వాత రామచంద్ర జానకి దగ్గరికి వెళ్లి నన్ను ఎవరైనా ఒక మాట అంటే అమ్మ అసలు తట్టుకోలేదని చెబుతాడు. అంతేకాకుండా మా అమ్మ స్థానంలో ఎవరైనా ఉంటే మీ అన్నయ్య మీద కోపం మీ మీద చూపించే వారు అని అంటాడు.
ఇక జానకి (Janaki) మీరు చెప్పిన మాట అక్షరాల నిజం అని అంటుంది. ఇక జానకి తన బాధను మనసులో దాచుకుని కుమిలిపోతూ ఉంటుంది. మరోవైపు రామచంద్ర జానకి ఫీజు కట్టడానికి లక్ష రూపాయలు వడ్డీకి అప్పు అడుగుతూ ఉంటాడు. ఒకవైపు మల్లిక (Mallika) పులి మేక ఆడుకుంటూ ఇంట్లో మంటలు ఎలా రాచెయ్యాలో అని ఆలోచిస్తుంది.
ఒకవైపు రామచంద్ర (Ramachandra) అన్నం తినకుండా లక్ష రూపాయలు ఎలా సర్దుబాటు చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక జానకి (Janaki) భోజనం చేయకుండా ఎందుకు ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. రామచంద్ర మీ ఫీజ్ డబ్బులు నేను ఏర్పాటు చేస్తాను మీరు టెన్షన్ పడకండి అని అంటాడు.
ఆ తర్వాత రామచంద్ర (Ramachandra) దగ్గరకు జ్ఞానాంబ వచ్చి ఏమైంది నాన్న ఎందుకలా టెన్షన్ పడుతున్నావు అని అంటుంది. ఆ క్రమంలో తల్లి రామచంద్ర యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. ఇక నా కొడుకు ఇంత భాద పడడం ఎప్పుడూ చూడలేదు అని జ్ఞానాంబ జానకి (Janaki) తో అంటుంది.
ఇక మల్లిక (Mallika) బావగారు ఫైనాన్స్ షాప్ కి వెళ్లారు అని జ్ఞానాంబ (Jnanamba) కు చెబుతుంది. అంతేకాకుండా బావ గారు అప్పు అయినా తీసుకోవాలి.. లేక ఎవరికీ తెలియ కుండా వడ్డీ వ్యాపారం అయిన చేస్తూ ఉండాలి అని కుటుంబంలో లేనిపోని పుల్లలు పెడుతుంది. ఇక రేపటి భాగం లో ఏం జరుగుతుందో చూడాలి.